Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది:
ప్రచారం – వాస్తవం

November 6, 2023 by M S R


*****************

👉ప్రచారం: పారిశ్రామిక అభివృద్దిలో తెలంగాణ దేశంలోనే “నంబర్-1”

👉వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం సాధించిన పారిశ్రామిక అభివృద్ది కన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పారిశ్రామిక అభివృద్ది దిగజారింది.
*****************

👉తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకు పోతుందనీ, లక్షల కొలదీ ఉద్యోగకల్పన జరిగిందనీ, దేశంలో ఇప్పుడు తెలంగాణ “నంబర్-1” అనే ప్రచారం చూస్తున్నాం… ఇందులో వాస్తవమెంతో చూద్దాం..
******************

👉ముందుగా: ఎవరన్నా మీతో “ఈ తొమ్మిదేళ్లలో నేను లక్షాధికారిగా మారాను” అనగానే, “అబ్బా…వీడు బాగా సంపాదించాడని వెంటనే డిసైడ్ కాకండి….” వాడు అంతకు ముందు కోటీశ్వరుడేమో ఒక సారి కనుక్కోండి…
**************

👉పారిశ్రామిక అభివృద్దికి విద్యుత్ వినియోగం ప్రామాణికం:

• ఒక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన జరిగినప్పుడు, అక్కడ తప్పనిసరిగా పరిశ్రమల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. పారిశ్రామిక విద్యుత్ వినియోగరేటు ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్దికి సూచిక.

• ఒక ప్రాంతంలో పరిశ్రమల విద్యుత్ వినియోగంలో వృద్ది రేటు గతంలో కన్నా పెరిగితే, అక్కడ పారిశ్రామిక అభివృద్ది గతంకన్నా మెరుగ్గా ఉందనీ, ఒక వేళ విద్యుత్ వినియోగ వృద్ది రేటు తగ్గితే, ఆ ప్రాంత పారిశ్రామిక వృద్ది గతం కన్నా తగ్గిందనీ చెప్పవచ్చు.

• పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో పెరుగుదల రేటు తెలంగాణ ఏర్పడ్డ తరువాత, తెలంగాణ ఏర్పడక ముందు ఏ విధంగా ఉందో చూద్దాం…
*****************

👉విద్యుత్ వినియోగ దృష్ట్యా పరిశ్రమలు లో-టెన్షన్ (LT-3), హైటెన్షన్ (HT-1) కాటగరీలుగా ఉంటాయి.

👉 తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న పరిశ్రమలను LT-3గా, ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్న పరిశ్రమలను HT-1 అని స్థూలంగా విభజించవచ్చు. ఈ రెండు కాటగరీల వినియోగాన్ని (ఎల్‌టి-3+ హెచ్‌టి-1) కలిపి మనం మొత్తం పారిశ్రామిక విద్యుత్ వినియోగంగా పేర్కొంటాము.
***************

👉తెలంగాణ రాష్ట్రంలో (31-03-2014 నుండి 31-03-2022 వరకు: 8 ఏళ్లలో ):

• 2013-14 ఆర్ధిక సంవత్సరాంతానికి, అంటే మార్చ్ 31, 2014 నాటికి తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 10085 మిలియన్ యూనిట్లు.

• తెలంగాణ ఏర్పడ్డ 8 ఏళ్లకు, 2021-22 లో తెలంగాణ పారిశ్రామిక విద్యుత్ వినియోగం 15056 మిలియన్ యూనిట్లకు చేరింది.

అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఎనిమిదేళ్ళలో పరిశ్రమల వినియోగం 49.2% పెరిగింది.

(ఆధారం: తెలంగాణ స్టాటిస్టికల్ ఇయర్ బుక్స్, TSDISCOMS ARRs, TSERC Tariff Orders: 2014-2022 వరకు)
****************

👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో (31-3-2006 నుండి 31-03-2014 వరకు: 8ఏళ్లలో):

• ఇక 2005-06 లో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 5957 మిలియన్ యూనిట్లు.

• 2013-14 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 10085 మిలియన్ యూనిట్లు.

👉అంటే తెలంగాణ ఏర్పడక ముందు 8 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పారిశ్రామిక విద్యుత్ వినియోగ వృద్ది 69.30%.

(ఆధారం: ఆంధ్ర ప్రదేశ్ స్టాటిస్టికల్ ఇయర్ బుక్స్, APDISCOMS ARRs, APERC Tariff Orders: 2005 నుండి 2014 వరకు)
****************

👉దిగజారిన పారిశ్రామిక విద్యుత్ వినియోగ వృద్ది శాతం:

• తెలంగాణ సాధించుకున్న 8 ఏళ్లలో, తెలంగాణ ప్రాంత పారిశ్రామిక విద్యుత్ వినియోగ వృద్ది శాతం 69.30 నుండి 49.2 కు పడిపోయింది.

• అంటే, తెలంగాణ ప్రాంత పారిశ్రామిక వృద్ది రేటు ప్రత్యేక రాష్ట్రంలో కన్నా, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతుంది.

👉పారిశ్రామిక అభివృద్ది పై తెలంగాణ రాష్ట్రం దేశంలోనే “నంబర్-1” అంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ కాకి లెక్కలని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

👉ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత పారిశ్రామిక అభివృద్ది జరుగక పోగా మరింత దిగజారడం ఆందోళన కలిగించే అంశం.

👉పారిశ్రామిక అభివృద్ది కుంటుపడడంతో యువతకు ఉద్యోగకల్పన విషయంలో తెలంగాణ రాష్ట్రం మరింత వెనుక పడిందని స్పష్టం అవుతున్నది.

👉నిజానికి వచ్చిన పరిశ్రమలెన్ని? వచ్చిన ఉద్యోగాలెన్ని? అందులో తెలంగాణ యువత ప్రాతినిధ్యమెంత? ఇవన్నీ అత్యంత రహస్యం…!

*************
— తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి‌జే‌ఏ‌సి)
**************

(తెలంగాణ ఏర్పడ్డ తరువాత తలసరి ఆదాయం, జి‌ఎస్‌డి‌పి, హైదరాబాద్ అభివృద్ది…. మొదలైన అంశాలపై ప్రచారాలు-వాస్తవాలు మరో పోస్టులో….)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions