బిగ్‌బాస్ ఏ సీజన్ ఎంత విసిగించినా సరే… జనం చీదరించుకుంటూ చూడటం మానేసినా సరే… హౌజులో సభ్యులు ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు, వ్యూహాలు, కోపాలు, వెన్నుపోట్లతో ఎంత తన్నుకున్నా, తిట్టుకున్నా సరే… ఓ దశ వస్తుంది… అందరూ ఒక్కటవుతారు… అదే కుటుంబసభ్యుల రాకడ… బిగ్‌బాస్ సీజన్లలో ఎమోషన్ నింపి, ప్రేక్షకుడితో కనెక్టయ్యేది ఇదే దశ…
కుటుంబసభ్యులు కావచ్చు, ఇతర ఆత్మీయులు కావచ్చు… వచ్చినప్పుడు ఆ హౌజ్ సభ్యుడే కాదు, అందరూ ఆనందిస్తారు… ఒక్కటవుతారు… అదొక పాజిటివ్ వాతావరణం… అఫ్‌కోర్స్, వాళ్లు వచ్చినప్పుడు వీళ్లు ఏడవడాలు, వాళ్ల ఓదార్పులు… కొంత అతి అనిపించినా సరే, ఆ ఎమోషన్ మనల్ని కనెక్టవుతుంది ఎంతోకొంత… బిగ్‌బాస్ ఏడో సీజన్ కూడా ఆరో సీజన్‌లాగే చిరాకెత్తిస్తున్నా సరే… ప్రస్తుతం కుటుంబ సభ్యుల రాకడ మొదలైంది కదా, ఆసక్తిని రేకెత్తిస్తోంది…
Ads
ఒక్కసారి గతంలోకి వెళ్దాం… కీర్తిభట్… టీవీ నటి… కార్తీకదీపంలోనూ చేసింది… ఆమెకు ఎవరూ లేరు… యాక్సిడెంటులో చావు అంచుదాకా వెళ్లి బయటపడింది… బొక్కలు చూరచూర… చివరకు సంతానం కలిగే యోగం కూడా దూరమైంది… పెంచుకున్న అమ్మాయి కూడా చనిపోతే ఏడుస్తూనే బిగ్‌బాస్ హౌజుకు వచ్చింది… అందరికీ కుటుంబసభ్యులు వస్తున్నారు… కానీ ఆమెకోసం ఎవరు..?
నేను అంటూ తోటి టీవీ నటుడు, స్నేహితుడు మహేశ్ వచ్చాడు… దేవుడు నీ నుంచి అన్నీ తీసుకున్నా సరే, నీకు శోకమే మిగిలినా సరే, నావంటి స్నేహితుడు తోడుగా ఉంటారు అని ఓదార్చాడు… అది బిగ్‌బాస్ ప్రేక్షకులందరినీ కనెక్ట్ చేసింది… కదిలించింది… (ఈ అమ్మాయికి ఈమధ్యే నిశ్చితార్థం అయినట్టుంది… చాలా అమ్మాయిలు ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి…)
ఈ సీజన్‌లో ఇప్పుడు శివాజీ కోసం కొడుకు వచ్చాడు… బాగుంది… ఓ డాక్టర్‌గా ప్రవేశపెట్టారు, సర్‌ప్రయిజ్ ఫ్యాక్టర్… తరువాత హౌజులోకి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాడు… ఇదే కదా ఎమోషన్ అంటే, ఆ శివాజీ కూడా ఏడ్చాడు… నటన కాదు ఇక్కడ… ఎమోషనే… అశ్విని కోసం ఆమె అమ్మ వచ్చింది… ఈమె ఏడుస్తుంటే ఆమే ధైర్యం చెప్పింది…
చెప్పాల్సింది అంబటి అర్జున్ భార్య సురేఖ గురించి… ఆమె కూడా నటే… ఇద్దరిదీ ప్రేమవివాహం… అప్పటికప్పుడు హౌజులోనే ఆమెకు సీమంతం చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు హౌజ్ మేట్స్… చిన్న ఎఫర్టే, కానీ ప్రేక్షకుడిని కనెక్టయ్యేవి ఇవే… కూల్‌గా ఉండే అర్జున్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు… అంతేకదా మరి… అందరి కోసం కుటుంబసభ్యులో, ఆత్మీయులో, స్నేహితులో వస్తారు… ఇవే ఎమోషనల్ సీన్స్ వస్తాయి… చిరాకెత్తించే సీజన్‌లో కాస్త బాగుండే వారం ఇదే… గుడ్…
Share this Article