Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్ ఇంటికే… న్యూజిలాండ్‌తోనే ఇండియా సెమీ సమరం…

November 9, 2023 by M S R

ఒకప్పుడు శ్రీలంక, ఇంగ్లండ్ వంటి జట్లతో పోటీ అంటే మాంచి థ్రిల్ ఉండేది… కానీ ఇప్పుడవి తుస్… మరీ ఇంగ్లండ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి, అనేక ఓటములతో అసలు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండేనా అనే సందేహాల్లో పడేసింది అందరినీ… ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ మ్యాచులు కొంతకాలంగా ఎన్నో చూశాం కదా… చివరి బంతి వరకూ అదే థ్రిల్…

నిజానికి పాకిస్థాన్ కూడా ఒకప్పుడు సూపర్ జట్టే… ఇంగ్లండ్, శ్రీలంకలతో పోలిస్తే ఇప్పటికీ ఇది కాస్త బెటరే… కానీ అది వరల్డ్ కప్ నుంచి దాదాపు ఔట్ అయిపోయినట్టే… సెమీస్‌కు చేరని జట్టు అంటేనే నాసిరకం జట్టు అని లెక్క… నెదర్లాండ్స్, అఫ్ఘనిస్థాన్ జట్లను పక్కన బెడితే… (ఒకటీరెండు విజయాలు వచ్చినా సరే అవి ఇంకా పసికూనలే… సరైన ప్రత్యర్థి ఎదుట బేలగా చేతులెత్తాల్సిందే…) ఆమధ్య కాస్త మంచిగా ఆడిన బంగ్లాదేశ్ జట్టు కూడా దీనస్థితే ఇప్పుడు…

ఇక ఈరోజు శ్రీలంకపై గెలుపుతో న్యూజిలాండ్‌ దాదాపు సెమీస్‌కు వచ్చేసినట్టే… బహుశా నవంబరు 15న వాంఖెడే స్టేడియంలో ఇండియా- న్యూజిలాండ్ తలపడవచ్చు… ఆ అర్హత ఉన్న జట్టే అది… న్యూజిలాండ్ గనుక ఈరోజు ఓడితే పాకిస్థాన్ పరిస్థితి మెరుగవుతుందని తెలిసీ… సెమీస్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడకూడదని, అందుకని న్యూజిలాండే శ్రీలంక మీద గెలవాలని చాలా మంది కోరుకున్నారు… అదే జరిగింది… సరే, ఇక పాకిస్థాన్ ఎందుకు ఇంటికి తలవంచుకుని వెళ్లనుందని పరిశీలిస్తే…

Ads

icc

ఇప్పుడిక పాకిస్థాన్ ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది… అది గెలిచినా ఓడినా దానికి ఫరక్ పడేదేమీ లేదు… ఇది నామమాత్రం మ్యాచే… ఎందుకంటే… పాకిస్థాన్ గనుక నెట్ రేట్ బరిలో నిలబడాలీ అంటే ఇంగ్లండ్ మీద గెలిచి తీరాలి… కానీ ఓ అసాధారణ రీతిలో గెలవాలి… కానీ అదే కష్టం… (ఈ పట్టిక ఓసారి చూడండి… ప్రస్తుతం అన్ని జట్ల పాయింట్స్ ఇవే…)

icc

పాకిస్థాన్ గనుక ఇంగ్లండ్ మీద 335 రన్స్ తేడాతో గెలిస్తే అది సాధ్యం… మరీ ఆ రేంజ్ గెలుపును ఎదుటోడికి అందించేంత దురవస్థలో మాత్రం ఇంగ్లండ్ లేదు… ఇంగ్లండ్ గనుక మొదట బ్యాటింగ్ చేస్తే దాన్ని పాకిస్థాన్ 50 పరుగులకే ఆలవుట్ చేసి, 2.2 ఓవర్లలో ఛేజ్ చేయాలని కొందరు లెక్కలు వేస్తున్నారు… జస్ట్, ఇంపాజిబుల్… ప్రస్తుతానికి రకరకాల సమీకరణాలు, సాధ్యాసాధ్యాలు లెక్కలు వేస్తున్నారు కానీ అందరి లెక్క స్థూలంగా పాకిస్థాన్ ఇంటికి వెళ్లడమే అని… సగటు భారతీయుడు కోరుకున్నదీ అదే…

Pakistan’s only chance on Saturday…
make 400, restrict opponent to 112
make 350, restrict opponent to 62
make 300, restrict opponent to 13

2019 లో వరుస విజయాలతో సెమీస్ చేరిన ఇండియా ఇదే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది… ఇప్పుడు లెక్క సరిచేస్తుందా…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions