చాలా చిన్న పత్రికలు ఉంటయ్… వాటి సర్క్యులేషన్, వాటి సిబ్బంది సామర్థ్యం, వాటి సాధనసంపత్తి దృష్ట్యా వాటిల్లోని వార్తల విశ్లేషణ జోలికి పోవద్దు నిజానికి… కానీ ఈ వార్త ఒకటి విచిత్రం, గమ్మత్ అనిపించింది… ఓహో, ఇలా కూడా వార్త రాయొచ్చా అనేలా ఉంది… విచిత్రం ఏమిటంటే..? వార్త చదవగానే సడెన్‌గా కొంపదీసి రాజ్యసభ ఎంపీ సంతోషే రాయించుకున్నాడా ఏందీ అనే డౌటొచ్చేలా ఉంది… ఆయనకు ఇలాంటి స్టోరీలు రాయించుకోవడం అవసరం లేదు, పైగా అలా రాయించుకోవాలంటే, ఆయన పత్రిక మన తెలంగాణ లేదా..? ఆంధ్రప్రభ లేదా..? మరీ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక దేనికి..? కాకపోతే ఈ వార్తను యథాతథంగా కేసీయార్ చదివితే మాత్రం, సంతోష్‌కు నష్టమే…
విషయం ఏమిటంటే..? కేసీయార్ కుటుంబసభ్యుల్లో రాజకీయ తెరపై ప్రధానంగా కనిపించేది కేసీయార్, కేటీయార్… తరువాత హరీష్, కవిత… తరువాత సంతోష్… అందరూ పదవుల్లో ఉన్నవాళ్లే… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక యాక్టింగ్ ముఖ్యమంత్రి… ఇప్పుడేమో కేసీయార్ తన కొడుకును సీఎం చేస్తాడట… కవిత ఏమో అలిగి పంచాయితీ పెడుతోందట… హరీష్ బావతో కలిసి పనిచేస్తాడా..? చాన్స్ కోసం వేచిచూస్తాడా..? ఇవి కీలకప్రశ్నలు… మధ్యలో ఈ పత్రిక తీసుకొచ్చిన ప్రశ్న ఏమిటంటే..? మరి సంతోష్ మాటేమిటి అని…!! ఈ కథనంలో ఎక్కడిదాకా పోయారంటే… సంతోష్‌ను అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు… మస్తు మేధస్సుంది… తనకు పార్టీలో బలమైన వర్గం ఉంది… తను అలిగితే మాత్రం ఇక ఆ కుటుంబంలో ముసలం పుట్టినట్టే… కేసీయారూ, కేటీయారూ బహుపరాక్ అని హెచ్చరిస్తున్నట్టుగా సాగింది కథనం…
Ads
ఇప్పటికిప్పుడు సంతోష్ పార్టీ మీద, కేసీయార్ మీద అలిగి, తిరగబడి, కకావికలం చేయకూడదు అనుకుంటే… కేసీయార్ సంతోష్‌ను బుజ్జగించాలా..? సంతోష్‌ను సంతోషపెట్టడానికి ఏం చేయాలి…? ఎలాగూ మోడీతో, అమిత్ షాతో కాంప్రమైజ్ ఫార్ములాలు కుదిరాయి కాబట్టి… పనిలోపనిగా కేంద్ర కేబినెట్లో చేరి, సంతోష్‌కు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే బెటరా..? అప్పుడిక కేటీయార్ ముఖ్యమంత్రిత్వానికి ఏ ఢోకా ఉండకపోవచ్చా..? అంటే… సంతోష్ అనర్హుడని కాదు, కేంద్ర మంత్రి అయితే మంచిదే… వివాదరహితుడు… పైగా కేసీయార్‌కు సమయానికి మందులిచ్చి, తనను కంటికిరెప్పలా కాపాడుకునే సొంత మనిషి… అన్నీ బాగానే ఉన్నయ్… కానీ సంతోష్ తిరగబడితే ఇక దబిడి దిబిడే అన్నట్టుగా ఉన్న ఇలాంటి ప్రత్యేక వార్తలు కనిపిస్తే… కేసీయార్ అపార్థం చేసుకుంటే మాత్రం… సంతోష్‌కు భారీ నష్టం తప్పదు… అఫ్కోర్స్, ఇలాంటి వార్తల్ని కేసీయార్ దాకా పోనివ్వడులే…!!
Share this Article