Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయద‘షమి’… షమీ శమయతే పాపం… ‘షమి’ఫైనల్… ప్రశంసల భారీ వర్షం…

November 15, 2023 by M S R

షమి… ఏడు వికెట్లు… ఆ సంఖ్య కాదు తనను హీరో ఆఫ్ ది మ్యాచ్ అనడానికి… ఈ వరల్డ్ కప్ ఈవెంట్‌లో ఇప్పటికి అయిదేసి వికెట్ల ఘనతను మూడుసార్లు దక్కించుకున్నాడు… తను మొదట్లో ఆటలోనే లేడు… తరువాత ఆరు మ్యాచులు… ఇప్పటికి 22 వికెట్లు… అంతేకాదు, ఇండియాకు కీలకమైన ప్రతి సందర్భంలోనూ వికెట్లు తీశాడు… తనే దిక్కయ్యాడు… తన బౌలింగ్ ప్రదర్శనలో కన్సిస్టెన్సీ ఉంది, మెరిట్ ఉంది… ఈ సెమీ ఫైనల్ విజేత షమి… ట్రెమండస్ ప్లే… ఇది అతిశయోక్తి కాదు… ఎందుకంటే..?

ఎస్, మన బ్యాటర్లు బాగా రన్స్ చేశారు… కానీ ఇది బ్యాటింగ్ పిచ్… రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్… అందరూ బాగానే ఆడారు… ఇద్దరు సెంచరీలు చేశారు… దంచి కొట్టారు… ఫలితంగా 397 రన్స్… చిన్న ఫిగర్ ఏమీ కాదు… కానీ న్యూజిలాండ్ వంటి ఫైటింగ్ టీం మీద ఆమాత్రం స్కోర్ కావల్సిందే… ఓవర్‌కు 8 రన్స్ చేస్తే తప్ప గెలవని స్థితిలో న్యూజిలాండ్ అంత తేలికగా ఏమీ విడిచిపెట్టలేదు…

ప్రత్యేకించి మిషెల్, విలియమ్సన్ స్పూర్తిదాయకంగా పోరాడారు… ఒక దశలో మ్యాచ్ ఇండియా చేజారినట్టే అనుకునే పరిస్థితి… దేవుడా, దేవుడా ఒక్క వికెట్ ప్లీజ్ అంటూ ప్రార్థనలు… ఉత్కంఠ… ఈ స్థితిలో నేనున్నాను అంటూ షమి చకచకా కీలకమైన వికెట్లు పడగొట్టాడు… ఎప్పుడైతే మిషెల్ ఔటయ్యాడో, అప్పట్నుంచి ఇక న్యూజిలాండ్ పోరాటం పలుచబడిపోయి, చివరకు చేతులెత్తేసింది… ఈ కీలకమైన మ్యాచ్‌లో షమి ఏడు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు…

Ads

shami

ఎస్, కోహ్లీ కూడా బాగానే ఆడాడు… కానీ సెంచరీ సమీపిస్తున్న దశలో దూకుడు అకస్మాత్తుగా తగ్గిపోయింది… సెంచరీ మీదే దృష్టి పెట్టాడు… అది కాగానే మరో పదీపదిహేను రన్స్ చేసి, ఇక చాలులే అని ఔటయ్యాడు… తనది ప్రపంచ రికార్డే… కానీ తమదైన రోజు కలిసి వస్తే ఈ 400 రన్స్ కూడా కొట్టగల టీం న్యూజిలాండ్‌ది… గతంలో సెమీస్‌లో ఇండియాను ఓడించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి…

modi

ఇప్పుడు ఆ పాత ఓటములకు ఇండియా ప్రతీకారం తీర్చుకోవచ్చుగాక,.. మరొక్క అడుగు… ప్రిస్టేజియస్ వరల్డ్ కప్‌ను అందుకోవడానికి మరొక్క అడుగు ఉంది… కానీ ఆ పోటీ కూడా మామూలుగా ఉండదు… ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టఫ్ టీమ్స్… ఎవరు ఫైనల్‌కు వచ్చినా ఇండియాకు బలమైన పోటీయే… కానీ ఈ కప్‌లో ఇప్పటివరకూ ఓ మ్యాచ్ ఓడిపోలేదు ఇండియా… ఇది అరుదైన రికార్డే…

ఆ కప్పు కూడా ముద్దాడితే అసంఖ్యాక ఇండియన్ అభిమానులకు పండుగే… నిజానికి ఈ కప్ పోటీలపై మొదట్లో చాలామందికి ఆసక్తి లేదు… వరుస విజయాలతో ఇప్పుడు ఫైనల్‌కు వచ్చాక ఇప్పుడు ప్రేక్షకులు పెరిగారు… ఇండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 5 కోట్ల మంది మ్యాచ్ చూసినట్టు రికార్డయింది… గ్రేట్… ఇక ఫైనల్ మ్యాచ్‌కు ప్రేక్షకులు విరగబడతారు… ఖాయం…!! సోషల్ మీడియాలో హోరెత్తిన ఓ అభినందన ఏమిటో తెలుసా… షమీ శమయతే పాపం, షమీ శత్రు నివారిణి… అవును, శమీ చెట్టు విజయసూచిక…

చివరగా… హార్దిక్ కు గాయం కావడం భారత జట్టుకు మంచే చేసింది… దానివల్లే షమి వచ్చాడు ఆటలోకి… తనేమిటో, జట్టుకు తనెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు… ఇండియాను కూడా గెలిపించాాడు… ఈ విజయం హార్డిక్ పాండ్యా ఎడమ మోకాలి గాయానికి అంకితం…!! ఇలా 2011 తరువాత మళ్లీ ఫైనల్‌లోకి అడుగుపెట్టాం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions