ప్రతి ఆదివారం కామెడీ మన్నూమశానమూ నింపి మాటీవీ, ఈటీవీ కొత్త ప్రోగ్రాములను తీసుకొచ్చాయి కదా… మధ్యాహ్నం టైములో ఓంకార్ నిర్మించే కామెడీ స్టార్స్ మాటీవీలో… మల్లెమాల ఎంటర్టెయిన్మెంట్ సమర్పించే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీలో… ఈ రెండూ ఫస్ట్ రోజే చతికిలపడ్డాయి… పెద్ద ఇంప్రెసివ్‌గా ఏమీ లేవు… ఏదో యాడ్స్ కోసం నాసిరకం స్కిట్లను కలిపి కుట్టి ప్రజెంట్ చేసినట్టే ఉన్నయ్… రెండూ అంతే… మాటీవీ వాడు ఏడో తారీఖున ఉత్సవం అంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో మరో ప్రత్యేక షో చేస్తున్నాడు… మొత్తానికి జెమినికి తప్ప మిగతా మూడు టీవీలు నాన్-ఫిక్షన్ షోల యాడ్స్ బాగానే రుచిమరిగాయి… ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీతో పోలిస్తే కాస్త మాటీవీలో వచ్చే కామెడీ స్టార్స్ బెటర్… అది ఇంకా పికప్ అయ్యే సూచనలు కూడా ఉన్నయ్… సీనియర్ కమెడియన్లున్నారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు… మరీ శ్రీదేవి డ్రామా కంపెనీయే కంపు కొడుతోంది…
అది అసలే ఈటీవీ… అందులోనూ మల్లెమాల… జబర్దస్త్ వెగటు ఈ షోకు కూడా సహజంగానే పాకింది… ఇదీ మల్లెమాల వాళ్లదే కదా, భిన్నంగా ఇంకేం కామెడీని ఆశించగలం… దీనికి అర్జున్ అనే యాంకర్… టీవీ నటుడు, కానీ యాంకర్‌గా కొత్త… అంత స్ట్రయికింగ్ లేడు… సరే, యాంకర్లది ఏముందిలే, కమెడియన్లు మంచి స్కిట్లు చేస్తే అన్ని లోపాలూ కొట్టుకుపోతాయి అనుకుంటే… అసలు స్కిట్లే కంపు కొట్టేలా… ప్రత్యేకించి ఇమాన్యుయెల్, వర్ష… ఈమధ్య వీళ్ల జంటను ఈటీవీ, మల్లెమాల బాగా ప్రమోట్ చేస్తోంది… సుధీర్, రష్మిజంట తరహాలో క్లిక్ చేయాలని బాగా తాపత్రయపడుతూ ఉన్నట్టుంది… కానీ సుధీర్, రష్మి జంట తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్లజెంటుగా ఉంటుంది… అందుకే ఏడేళ్లయినా సరే ప్రేక్షకులు వాళ్ల లవ్ ట్రాక్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు… వాళ్ల నడుమ మరీ వెగటు, బూతు డైలాగులేమీ ఉండకుండా చూసుకుంటారు కూడా…
Ads
కానీ ఇమాన్, వర్ష లవ్ ట్రాక్ మరీ నేలబారు… ఇమాన్ దగ్గర టైమింగ్ ఉంది, ఎనర్జీ ఉంది… కానీ అది బూతుల్లో పడి వృథా అయిపోతోంది… బ్యాడ్ ఇమేజీ సంపాదించుకుంటున్నాడు… వర్ష గురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు… మొన్నటి షోలో ఓ స్కిటు… తమ జంట గురించి ఇమాన్ చెబుతూ ఉంటే, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని యాంకర్ అడుగుతాడు… ఈ యాంకర్‌కు మన కెమిస్ట్రీ అర్థమైనట్టు లేదు, చూపిద్దామా అంటాడు… నువ్వడిగితే కాదంటానా అంటుంది వర్ష… ఇమాన్ ఆనందంతో గంతులేస్తూ… ‘‘ఇవ్వాళ ఇంటికి పోయేది లేదు, ఇక్కడే…’’ అని ఓ డబుల్ మీనింగ్ పంచ్ కొడతాడు… తరువాత ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పుతాడు… బాగా కష్టపడ్డాడు… కిందకు దింపాక యాంకర్ అంటాడు… ‘‘నిజం చెప్పు, చాన్స్ దొరికింది కదాని, అందులో చపాతీ పిండి ఒత్తినట్టు ఒత్తేశావు,,, ఇందులోనూ అలాగే ఒత్తేస్తున్నావు…’’ అంటాడు… అదే డబుల్ మీనింగ్… మొన్నామధ్య కూతురి వేషంలో ఉన్న వర్షనే వదలకుండా, నిన్నెందుకు వదులుతానంటూ తండ్రి వేషంలోని ఇమాన్ ముద్దులు పెట్టుకునే కక్కుర్తి… దాన్ని అలాగే ప్రసారం చేసిన టీవీకి శతకోటి నమస్కారాలు… థూమీబచె… ఇదే షోలో… పొట్టి నరేష్ వర్షకు బౌన్సర్… తమ్ముడు… వర్ష తన తమ్ముడిని చూపిస్తూ… ‘‘మా తమ్ముడిలో కరెంటు ఉంది తెలుసా, కరెంటు పోతే చార్జింగ్ కోసం మా తమ్ముడి దగ్గరకే వస్తారు’’ అంటుంది… ఇమాన్ ‘‘ఓహో, మరి చార్జింగ్ పిన్ ఎక్కడ పెడతారు’’ అని పరీక్షగా చూస్తుంటాడు… ఇమాన్, వర్ష అలా చేస్తున్నారు సరే, మరి అవి యథాతథంగా ఎలా ప్రసారం అవుతున్నాయి..? ఎందుకంటే..? ఈటీవీ, మల్లెమాల గలీజు టేస్టు కాబట్టి…!!
Share this Article