Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బర్రెలక్క @ శిరీష… దాడులు, బెదిరింపులకు గురయ్యే రేంజ్‌కు ఎదిగిపోయిందా..?!

November 21, 2023 by M S R

దారుణం… కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క @ శిరీష తమ్ముడిపై దాడి చేసిన దుండగులు… గత కొద్దిరోజులుగా చందాలు వేసి మరి ప్రచారం చేయిస్తున్న నిరుద్యోగులు… సోషల్ మీడియా నుంచి కూడా బర్రెలక్కకు భారీగా లభిస్తున్న మద్దతు… కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష తమ్ముళ్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి … బర్రెలక్కకు బెదిరింపులు… వెంటనే శిరీషకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని డిమాండ్……. ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన వార్త…

నిజమే, ఆమెకు సోషల్ మీడియా నుంచి విపరీతమైన మద్దతు కనిపిస్తోంది… అనూహ్యం… ఇంతకీ ఎవరీమె..? అది ఆసక్తికరంగా మారింది… ఆమె పాటలు, ఆమె ప్రశ్నలు ప్రధానంగా అధికార పార్టీకే ఇరకాటం… అయితే మరీ అధికార పార్టీ ఉలిక్కిపడి దాడులు చేయించేంతగా ఆమె కనిపిస్తోందా..? ఆమెను బెదిరిస్తున్నది ఎవరు..? సరే… ఫేస్‌బుక్‌లో Bhaaskaron Vijaya  వాల్ మీద కనిపించిన బర్రెలక్క కథ ఇదుగో… ఆమె పరిచయం ఇది…



అంత‌టా బ‌ర్రెల‌క్క ఏమిటా క‌థ… బ‌ర్రెల‌క్క పేరు విచిత్రంగా ఉంది క‌దూ. ఇప్పుడు తెలంగాణ‌లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ గా మ‌రారు బ‌ర్రెల‌క్క అలియాస్ శిరీష‌. త‌ను నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పెద్ద‌కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రామానికి చెందింది. క‌డు పేద కుటుంబం. తండ్రి తాగుబోతు. చిన్న‌ప్పుడే వ‌దిలేసి పోయిండు. త‌ల్లితో క‌లిసి నానా క‌ష్టాలు ప‌డింది.

Ads

చ‌దువు మీద ఉన్న ప్రేమ‌తో ఓపెన్ యూనివ‌ర్శిటీలో డిగ్రీ చేసింది. గ్రూప్ -1, గ్రూప్ -2 ఇత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యింది. త‌న‌కు పోలీస్ శాఖ‌లో చేరాల‌ని కోరిక‌. కానీ ఏదీ కాలేక పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కొలువు తీరిన రాక్ష‌స‌, దొర‌ల పాల‌నేన‌ని అంటోంది ఈ బ‌ర్రెల‌క్క‌. ప్ర‌శ్నించ‌డ‌మే నేరంగా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో, అదీ నియంత‌ల‌కు పెట్టింది పేరైన కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగింది బ‌ర్రెల‌క్క‌.

barrelakka

ఉద్యోగం రాద‌ని నాలుగు బ‌ర్రెల‌ను పెట్టుకున్నానంటూ ఆ మ‌ధ్య‌న రీల్ చేసింది. అది కాస్తా వైర‌ల్ అయ్యింది. మెల్లమెల్ల‌గా సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ల‌క్ష‌లాది మంది ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు , ప్ర‌జాస్వామిక వాదులు, ప్ర‌జా సంఘాలు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, మేధావులు , గాయ‌నీ గాయ‌కులు , సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ , బ‌హుజ‌న సంఘాలు , లెక్చ‌ర‌ర్లు, ప్రొఫెస‌ర్లు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

తాను నిరుద్యోగుల త‌ర‌పున బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నామినేష‌న్ దాఖ‌లు చేసింది. ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బ‌ర్రెల‌క్క‌. ఇవాళ ఎక్క‌డ చూసినా బ‌ర్రెల‌క్క గురించిన చ‌ర్చే జ‌రుగుతోంది. ఒకానొక ద‌శ‌లో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు ద‌డ పుట్టించే స్థాయిలో ప్ర‌స్తుతం ప్ర‌చారం కొన‌సాగిస్తోంది .

బర్రెలక్క

ఇక కొల్లాపూర్ లో 11 సార్లు వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు శాస‌న స‌భ్యులుగా విజ‌యం సాధించారు. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో అత్య‌ధిక ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ఇక బ‌ర్రెల‌క్క క్రియేష‌న్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛాన‌ల్ కు మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆమె ఏది మాట్లాడినా సెన్సేష‌న్. తెలంగాణ‌లో జాబ్ లు రావని అందుకే బ‌ర్రెల‌ను పెంచుకుంటున్నానంటూ చేసిన రీల్, వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

బ‌ర్రెల‌క్క దెబ్బ‌ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల‌కు ద‌డ పుట్టిస్తోంది. త‌న‌పై దాడికి దిగినా తాను వెనక్కి త‌గ్గేది లేదంటోంది బ‌ర్రెల‌క్క‌. ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. స్వ‌చ్చందంగా ఆమె త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. యానాం నుంచి అల్లాడి కృష్ణారావు ఏకంగా రూ. ల‌క్ష విరాళంగా ప్ర‌క‌టించారు. గెలిచినా ఓడినా బ‌ర్రెల‌క్క మాత్రం చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు కొల్లాపూర్ ప్ర‌జ‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలంటే కొంత కాలం పాటు ఆగాలి…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions