పత్రికలు – పాలసీలూ
……..
మొదట్నించీ కూడానూ….
Ads
కొన్ని పత్రికలు పాలసీ గానూ
కొందరు ఎడిటర్లు తమ పాలసీ గానూ
కమ్యూనిస్టు వ్యతిరేకత కనపరచేవారు.
ఆంధ్రపత్రిక దిన పత్రికలో కమ్యూనిస్టు వ్యతిరేకత బీభత్సంగా కనిపించేది.
చివరి పేజీలో చెణుకులు అని ఓ కాలం వేసేవారు.
అది దాదాపు ప్రస్తుతం టీవీ ఛానల్లలో వస్తున్న పిన్ కౌంటర్ , మామా మియా లాంటి కార్యక్రమమే.
రెండవ ప్రపంచ యుద్దానంతరం రష్యా వెలుపల కమ్యూనిస్టుల సంఖ్య బాగా పెరిగింది అని రష్యా రేడియో ప్రకటించింది.
అని రాసి దాని కింద కామెంటు…
సుమతీ శతక కారుడు చెప్పినట్టు పెరుగుట విరుగుట కొరకే … అని రాశారు.
అలాగే ఆంధ్రజ్యోతి వార పత్రికలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రోజుల్లో కూడా వచ్చేవి.
మహాకవి శ్రీశ్రీ చనిపోయిన కొత్తలో ఆంధ్రజ్యోతి వారపత్రిక జోకాభిరామం పేజీలో అచ్చైన ఓ జోకు.
మహాకవి మహాప్రస్తానం …లాంటి హెడ్డింగులు పెట్టకు ఎడిటర్జీ …
మేటర్ మేటర్లో కలసిపోయిందని రాస్తే రాడికల్స్ చంకలు గుద్దుకుంటారు …
ఆ జోకు రాసిన వ్యక్తి పేరు భూమిపుత్రుడు అని పెట్టారు.
భూమి పుత్రిక సీత కనుక పురాణం సీత పేరుతో ఇల్లాలి ముచ్చట్లు రాసే అలవాటు సుబ్రహ్మణ్య శర్మ గారికి ఉంది కనుక దాన్నే పుంలింగం చేసి భూమి పుత్రుడు అని వేసుకున్నాడని అప్పట్లో నాబోటివారు అనుకునేవారు.
ఆంధ్రపత్రిక చెణుకులు కాలంలోదే మరో జోకు –
కలరా , మలేరియా తదితర జబ్బుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 93.
ప్లేగు వల్ల ఇద్దరు చనిపోయారని చెన్నరాజధాని ఆరోగ్య శాఖాధికారి అంటున్నారు.
అని రాసి ఇలా కామెంటు పెట్టారు.
మరి కమ్యూనిజం అంటువ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య దీనికి కలిపినట్టు లేదు …
అని…. కామెంటు.
నచ్చని అభిప్రాయాల మీదా …
నచ్చని పార్టీల మీదా చేతికొచ్చింది రాయడం అనేది ప్రజాస్వామ్యమా … కాదా అని ఆలోచించనంత మూర్ఖత్వం మన మూలాల్లోనే ఉంది కనుక ఫలానా పత్రిక ఈ అంశం ఇలా రాసింది …అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంచేత ఆదండయ్యా సంగతి… ఉంటా మరీ…
Share this Article