Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ఇది గల్ఫ్ ‘బలగం’ : ఆ ముగ్గురి వల్లే ఐదుగురి అవతరణ… నిన్న కోరుట్లలో గల్ఫ్ జేఎసి ఆధ్వ్యరంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో ఆవేశం, కసి కాకుండా స్థిరత్వం కనిపించింది. రాజకీయంగా నిశితం అవుతున్న బృందంగానే కాదు, అదొక బలగంగా మారుతున్న వైనం కానవచ్చింది.
అది 2008. కోరుట్ల సమీపంలోని మొగలిపేట గ్రామం. ఇద్దరు సోదరులు దుబాయ్ లో సిలిండర్ పేలి చనిపోవడంతో అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్ గారు ఎంతో ఆవేదన చెంది సరాసరి వారి కుటుంబాన్ని సందర్శించి ఓదారుస్తారు. ఆ ఒక్క కుటుంబాన్నే కాదు, లక్షలాది కుటుంబాలకు ఓదార్పుగా, ఉపశమనంగా మాత్రమ కాదు, గొప్ప భరోసా నిచ్చే ఓ మహత్తర నినాదాన్ని కూడా అందించి మూడు శ్రేణుల ప్రజలనూ ఉద్యమంలో కదిలి వచ్చేలా చేశారు. అదే, “బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి’ జీవితాల గురించిన నినాదం.
సుమారు పదిహేను లక్షల మంది గల్ఫ్ లో ఉన్నారు. వారు తమ కుటుంబంలోని ముగ్గురు ఓటర్లకు చెప్పి నిలబడ్డ గల్ఫ్ అభ్యర్థులకు ఓటు వేపించినా దాదాపు నలబై లక్షల ఓట్లు. వీరితో పాటు రిటర్న్ వచ్చిన వారి ఓట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ అభ్యర్థులు ఎక్కడికక్కడ ముందుకు వెళుతున్నారు అని అభ్యర్థులందరికీ మార్గదర్శకత్వం వహిస్తున్న మంద భీం రెడ్డి గారన్నారు. పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర వైఫల్యం నుంచి రూపొందుతున్న సరికొత్త రాజకీయ ధోరణిగానే దీన్ని చూడాలని, అందుకే ఆ ముగ్గురి వల్లే ఈ ఐదుగురి అవతరణ అని ప్రతీకాత్మంగా రాయడం…
Share this Article
Ads