కాస్త నవ్వొచ్చింది… దివ్యవాణి అనే మాజీ నటి మెడలో కాంగ్రెస్ కండువా వేస్తున్న ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఫోటో చూస్తే ఆ పార్టీ ప్రయారిటీల మీద కాస్త జాలేసింది… అయ్యా, సారు గారూ… ఆమె కోసం వెయిట్ చేసి, ప్రత్యేకంగా ‘ఈ కండువా కార్యక్రమం’ నిర్వహించేంత సీన్ ఆమెకు అంత లేదు మాస్టారూ…
వోట్లను ప్రభావితం చేయగలిగేంత ఇమేజీ ఏమీ లేదు ఆమెకు… అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో చేసింది, తరువాత మెయిన్ స్ట్రీమ్‌కు దూరమైంది… సేమ్, మొన్న ఇలాగే కత్తి కార్తీక చేరిక… అసలు ఎవరామె..? వీళ్లెవరైనా ఎప్పుడైనా నిజంగా ప్రజాజీవితంలో ఉన్నారా..? వీళ్లతో ఒరిగేదేముంది..? అంతెందుకు..? తెలుగునాట అందరికీ బాగా పరిచయం ఉన్న పేరు విజయశాంతి… తరచూ పార్టీలు మారే చంచల తత్వం… మొన్న బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరితే సింగిల్ కాలమ్ వార్త…
అసలు ఇప్పుడు టీవీ, సినిమా సెలబ్రిటీలను, కామెడీ కేరక్టర్లను రాజకీయాల్లో ఎవరు పట్టించుకుంటారు..? సరే, ఈ దివ్యవాణి అనబడే నటి ఏడాదిన్నర క్రితం ఏం చేసిందో చూద్దాం…
Ads
హఠాత్తుగా దివ్యవాణి రాజీనామా వార్తలు యూట్యూబ్ చానెళ్లలో… టీడీపీకి భారీ షాక్ అని వార్తలు గబగబా రాసేసుకున్నయ్… ఆ టైమ్‌కు ఆ వార్త సేల్ అవుతుంది అంతే… సరిగ్గా గంట సేపట్లో సీన్ రివర్స్… రాజీనామా ఉపసంహరణ అని మళ్లీ వార్తలు…
ఓ కళాకారుడు స్థాపించిన పార్టీలో కళాకారిణికి అన్యాయమా..? అవమానమా..? ఈమాత్రం గుర్తింపులేదా..? ఓ ఫైర్ బ్రాండ్‌గా కష్టపడుతున్నాను… నన్ను మాట్లాడనివ్వరా..? ఛఫో, ఈ బేమాన్ పార్టీలో ఉండటం వేస్టు, నేను వెళ్లిపోతున్నా అన్నట్టుగా… మస్తు బాధపడుతూ మాట్లాడిన వీడియో కూడా ఒకటి కనిపించింది… రాజీనామా ప్రకటన తరువాత గంటసేపటికే రాజీనామా ఉపసంహరణ అట… ఈ గంట సేపట్లో అవమానం ఎటుపోయింది..? మళ్లీ పార్టీ ధగధగ వెలుగుతూ ఎలా కనిపించింది..? ఇంతకీ ఆమెకు ఏం కావాలి..? ఎవరేం హామీ ఇచ్చారు..? అసలు ఫైర్ బ్రాండ్ అనగానేమి..?
ఇలాంటి కేరక్టర్లతో కాంగ్రెస్‌కు ఒరిగేదేముంది డియర్ మాణిక్ రావ్..? అన్నట్టు ఈ ఫైర్ బ్రాండ్ జాతిలో అప్పట్లో కవిత అనే నటి కనిపించేది… ఏమైంది..? ఎక్కడుంది..? తరువాత మరో మెరుపు… వానపాటల వాణి విశ్వనాథ్… మెరుపులాగే మాయం… వస్తుంటారు, పోతుంటారు… అసలు జయప్రదతో పోలిస్తే వీళ్లెంత..? ఆమెకే ఏ దిక్కూ లేదు ఇప్పుడు… కొన్నాళ్లు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు చేసి, తెలుగు పుట్టింటికి వచ్చింది గానీ అందరూ లైట్ తీసుకున్నారు…
ఇదే తెనాలి దివ్యవాణి టీడీపీని వదిలేసిన తరువాత తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసింది… బీజేపీ ఈటల రాజేందర్‌ను కలిసింది… ఎక్కడా ఏమీ వర్కవుట్ కాలేదు… చివరకు కాంగ్రెస్ దిక్కయింది… అది సముద్రం కదా… నిజానికి అక్కడెక్కడో ఉన్న స్మృతి ఇరానీ, ఇక్కడ ఉన్న రోజా తప్ప ప్రస్తుతం సక్సెసయిన ఫైర్ బ్రాండ్లు ఎవరూ కనిపించడం లేదు… పైగా సినిమావాళ్లను చూసి వోట్లేసి, నెత్తికెక్కించుకునే రోజులు ఏనాడో పోయాయి…
కన్నడనాట దివ్యస్పందన చాన్నాళ్లు ఇదే కాంగ్రెస్‌లో అధికార ప్రతినిధిగా, సోషల్ మీడియా హెడ్‌గా హవా చెలాయించింది… ఖుష్బూ, నగ్మాల జాడలేదు మళ్లీ రాజకీయాల్లో… ప్రతి తెలుగింటికీ తెలిసిన జయసుధే ఇప్పుడు ఏ పార్టీలో ఉందో చాలామందికి తెలియని స్థితి… ఐనా ఇప్పుడు ఫైర్ బ్రాండ్లు అంటే బర్రెలక్కలు… ఈ మేకప్పుల వృద్ధమాతలు కాదు… ఠాక్రే గారూ వింటున్నారా..?!
Share this Article