బాగనిపించింది… పాత నిజామాబాద్ జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని పుల్కల్ గ్రామం… సింగూరు రిజర్వాయర్ వెనుకపట్ల ఉంటుంది… తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు కలిసేచోట… విలేజ్ కల్చర్ కూడా ఈ మూడు రాష్ట్రాల సంస్కృతుల సంగమం… దాదాపుగా కన్నడ, మరాఠీ, తెలంగాణ భాషలు మాట్లాడుతుంటారు…
కామారెడ్డి నియోజకవర్గంలో సిట్యుయేషన్ తెలుసుకోవడం కోసం వెళ్లినప్పుడు ఓ మిత్రుడితోపాటు ఇటువైపు కూడా వెళ్తే… గోడల మీద ఈ రాతలు ఆసక్తికరంగా కనిపించాయి… ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఉంటే ఊళ్లల్లో తప్పకుండా ఇంటికి రంగులు, సున్నాలు వేయిస్తారు… ఇంటి ముందు పందిరి తప్పనిసరి… నగరాలకు వెళ్తే, ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లే కదా… ఇంటికి, అపార్ట్‌మెంట్‌కు రంగులు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు… అద్దె ఇల్లయితే చెప్పనక్కర్లేదు…
ఇది ఎన్నికల సీజన్ కదా… గోడల మీద పార్టీ ప్రచార రాతలు ఉంటాయని అనుకుంటే… అవేమీ లేవు… ఇవిగో పెళ్లిళ్లకు సంబంధించిన రాతలు కనిపించినయ్… రంగులు వేయించడం, ప్రధాన ద్వారం పక్కన గోడల మీద ‘పెళ్లి పిలుపు’ రాయించడం… కొందరు వధూవరుల పేర్లు కూడా రాయించారు…
Ads
అబ్బే, ఇందులో ఏముంది అంటారా..? నగరంలోనే ఓ పెళ్లి గుర్తుచేసుకుందాం… ఓ హోటల్‌లో చిన్న హాల్ తీసుకున్నాడు ఆయన… మామూలుగా బర్త్ డేలు, సీమంతాలు, ఎంగేజ్‌మెంట్లు జరిగే హాల్ అది… హోటల్ వాళ్లదే భోజనం… మామూలుగా కనిపించే డెకొరేషన్… ఏ ఈవెంటూ లేదు… 150 మంది మాత్రమే అతిథులు…
సాయంత్రానికి అమ్మాయి అత్తింటికి వెళ్లిపోయింది… రాత్రి ఆ వధువు తల్లిదండ్రులు తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చేసి ఎప్పటిలాగే నిద్రపోయారు… తెల్లారిలేస్తే ఆయన తన ఆఫీసుకు డ్యూటీకి వెళ్లిపోయాడు… వాళ్ల రూట్స్ కూడా మహారాష్ట్ర… ఎంత కంట్రడిక్షన్… పెళ్లిని ఓ ఫీల్‌తో చేసుకునేది నిజంగా గ్రామాలే… ఇక్కడ ఖర్చు గురించి కాదు… తెలిసిన వారినందరినీ పిలుచుకుని ఓ పండుగలాగా జరుపుకోవడం… వధూవరులకు ఆ పెళ్లి సంబరం ఓ జీవితకాలపు మెమొరీ…
విడిది ఇల్లు వేరే… అక్కడ మర్యాదలు సరేసరి… ఎదుర్కోళ్లు (స్వాగతాలు) దగ్గర నుంచి అప్పగింతల దాకా అందరూ ఇన్వాల్వ్ అవుతారు… అఫ్‌కోర్స్, అలకలు, తప్పులు తీయడాలు, సర్దిచెప్పడాలు సరేసరి… నగరాల్లో ఇవన్నీ మమ అనిపించేయడమే… అందరూ నేరుగా ఫంక్షన్ హాల్‌కే వస్తారు, భోజనాలు అయ్యాక పది మంది మిగిలితే అదే గ్రేట్… ఊళ్లల్లో మరో విశేషం… తమ కులం ఇళ్లన్నింటినీ పెళ్లికి ఆహ్వానించడం… ఎంతోకొంత కట్నం చదివించి, తాము వచ్చినట్టు రికార్డు చేసుకోవడం… అదొక కట్టుబాటు… మంచికైనా, చెడుకైనా…!
Share this Article