నిజానికి తమిళ విలన్ మన్సూర్ అలీ ఖాన్ మాటల్ని ప్రేక్షకగణం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు… ఆమె సీరియస్‌గా తీసుకుంది, మరికొందరు నటీనటులు ఖండించారు… లియో టీమ్ కూడా ఖండించింది… నడిగర్ సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది… నేషనల్ వుమెన్ కమిషన్ కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించింది… ఓ కేసు కూడా నమోదైంది… ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు, తరువాత వాపస్ తీసుకున్నాడు… ఆనక పోలీసుల ఎదుట హాజరయ్యాడు… కానీ తను ఏమన్నాడు..?
‘‘ప్చ్, లియో సినిమాలో త్రిష నా కో-స్టార్… బెడ్‌రూంకు తీసుకెళ్లే రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను… కానీ లేదు… బాధేసింది… నాకు చాలా రేప్ సీన్ల అనుభవం ఉంది…’’ ఇవీ తన వ్యాఖ్యలు… తనేదో ఇంటర్వ్యూలో సరదాగా అన్నాను తప్ప ఇందులో ఆమెను వివక్షతో వ్యాఖ్యానించింది ఏముంది..? ఛస్, నేను క్షమాపణ చెప్పనుపో అన్నాడు మొదట్లో…
నిజానికి ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఓ సరుకుగా చూసే సంస్కృతి… మహిళా ఆర్టిస్టులను ఎలా వాడుకుంటారో, వాళ్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలిసిందే… చుట్టూ కెమెరాలు, లైట్లు, యాక్షన్- కట్ అంటూ అరుపులు… రేప్ సీన్ ఐనా, రొమాంటిక్ సీన్ ఐనా, మరో ఇంటిమేట్ సీన్ ఐనా అంతా నటనే… బాలయ్య వ్యాఖ్యలు, టీవీ5 యాంకర్ కూతలు, చలపతిరావు కూతలు, దానికి యాంకర్ రవి సపోర్ట్ గట్రా కొన్ని వివాదాస్పదం అయ్యాయి… తెర వెనుక వివక్షలు, వేధింపులు, వ్యాఖ్యలు గట్రా బోలెడు…
Ads
కానీ ఎప్పుడైతే తప్పనిసరై మన్సూర్ అలీ క్షమాపణ చెప్పాడో… అది ఎంత తలతిక్కగా ఉందో, అప్పట్నుంచీ మన్సూర్ పై వ్యతిరేకత ఇంకా పెరిగింది… అప్పటిదాకా లైట్ తీసుకున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు తన ధోరణిని తిడుతున్నారు… నిజంగానే అది క్షమాపణ చెబుతున్నట్టు లేదు… మరింత వెటకారం చేస్తున్నట్టుగా ఉంది… తెలుగులో చెప్పాలంటే బలుపు చూపిస్తున్నట్టుగా ఉంది… కాదు, నిజంగానే తను ఏదో మానసిక వైకల్యంతో ఉన్నట్టుంది…
‘‘నా సహ నటి త్రిషా, నన్ను క్షమించు, నీ పెళ్లిరోజు నీ మాంగళ్యం అందరి ఆశీస్సులు కోరుతున్నప్పుడు ఆ అవకాశం నాకు కూడా దక్కేలా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను… ఆమెన్… మన్సూర్ అలీ ఖాన్…’’ పెళ్లి ఏమిటి..? ఆమెన్ అనే పదం దేనికి..? మాంగళ్యం ఏమిటి..? ఇది క్షమాపణా..? ‘‘నేను కత్తి లేకుండా వారం పాటు యుద్ధం చేశాను… ఆ వార్‌లో రక్తపాతం లేకుండానే గెలిచాను… ఇంతటితో ఈ కళింగయుద్ధం ముగిసింది… అప్పట్లో లక్షల మంది చనిపోవడంతో అశోకుడి మనస్సు కరిగి అహింసను స్వీకరించాడు… ఇక్కడ నేను కూడా అహింస వైపే నిలబడ్డాను…’’ అంటున్నాడు…
నిజంగానే ఇది మెంటల్ కేసు… తమిళ ఇండస్ట్రీ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి… ఎప్పుడైనా సరే ఇలాంటి కేరక్టర్లు తోటి నటులకు ప్రమాదకరమే… ఆర్టిస్టుల అసోసియేషన్ షోకాజ్ జారీ చేయడం కాదు, రిమూవ్ చేయాలి… నిర్మాతలు తనను తమ సినిమాల్లోకి తీసుకోకుండా ఉండటం బెటర్… తరువాత ఎవరో బాధపడటంకన్నా ఇప్పుడే తనను బహిష్కరించడం మంచిది…! ఇది డీప్ ఫేక్ కన్నా ప్రమాదకరం…
Share this Article