సౌండ్ పార్టీ… ఈ చిన్న సినిమా కూడా నిన్న థియేటర్లలోకి వచ్చింది… వీజే సన్నీ హీరో… తను బిగ్‌బాస్ ఫేమ్… అంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు… ఏదో టైమ్ పాస్ పల్లీ కథ… జబర్దస్త్ స్కిట్‌కు కాస్త ఎక్కువ, ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… సో, ఆ సినిమా కథాకాకరకాయ జోలికి వెళ్లడం లేదు కానీ… ఒకటీరెండు చెప్పుకోదగిన పాయింట్లున్నయ్…
వీజే సన్నీ అంతా కొత్త కొత్తే… ఓ నటుడిగా తప్పటడుగులే… చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది… తనను వదిలేస్తే ఈ సినిమాలో చెప్పుకోదగిన కేరక్టర్ కుబేర్ కుమార్ పాత్ర వేసిన నరిపెద్ది శివన్నారాయణ… అలియాస్ అమృతం అప్పాజీ… నిజానికి తను 150 సినిమాల దాకా చేశాడు… బోలెడు టీవీ షోలు చేశాడు…
ఇప్పటికీ గుర్తొచ్చేది, తనకు గుర్తింపు ఆనాటి అమృతం సీరియలే… ఇప్పుడు వచ్చేది వికటహాస్యం… పంచ్ డైలాగుల హాస్యం… బాడీ షేమింగుల మొరటు హాస్యం… కానీ అమృతం ఆహ్లాదకరమైన హాస్యం… ఈరోజుకూ ఈ వీడియోలకు వీక్షణాలు ఉంటయ్… ఆ సీరియల్‌లో అప్పాజీ పాత్రకే అధిక ప్రాధాన్యం… ఆ పాత్ర చేసింది ఇదుగో ఈ శివన్నారాయణే…
Ads
ఆ పాత్రకు తగినట్టు సటిల్డ్, మంచి టైమింగ్ కామెడీతో తను రాణించాడు… మెప్పించాడు… కానీ అన్ని సినిమాలు చేస్తే ఏ ఒక్కటీ తనకు పెద్ద గుర్తింపు తీసుకురాలేదు… అవకాశాలొస్తున్నయ్, కానీ తను గట్టిగా ప్రయత్నించి మెప్పించాల్సిన గట్టి పాత్రలు పడటం లేదు… అంతెందుకు, అమృతం సీక్వెన్స్ కూడా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు… అమృతాన్ని రిపీట్ చేయడం కష్టం…
ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమాలో శివన్నారాయణకు ఫుల్ లెంగ్త్ పాత్ర దొరికింది… మంచిగా వాడుకున్నాడు… సినిమాలో కాస్త బాగుంది అనిపించే ఫ్యాక్టర్ ఇదొక్కటే.., తనకు ఇంకా ఇలాంటి ఫుల్ లెంగ్త్ రోల్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది… ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన చదువుకున్నది హైదరాబాద్… బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొలువు చేస్తూ నాటకాలకు, ఆ తరువాత అమృతం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు…
సినిమాలో చిన్న విశేషం ఏమిటంటే… హీరోయిన్! ఈమె పేరు హృతిక… నాటి హీరోయిన్ ఆమని ఈమెకు మేనత్త… బహుశా ఇది తనకు రెండో చిత్రం… ప్లజెంట్ లుక్… పెద్ద ప్రాధాన్యమున్న పాత్ర ఏమీకాదు… కాకపోతే దొరికినంతలో బాగానే చేసింది… పెద్ద సినిమాల్లో పాత్రలు దొరికితే తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశముంది… సినిమా గురించి ఏమిటి అంటారా..? సో సో… ఈ బిగ్‌బాస్ ఫేమ్‌లతో సినిమాలు నడవవు సోదరా…!
Share this Article