అశ్విని ఔట్… శనివారం నాడే ది కింగ్ నాగార్జున వచ్చేసి, శివాజీకి తమలపాకుతో నాలుగు అంటి, మిగతావాళ్లను తలుపుచెక్కతో బాది… చివరకు అశ్వినిని ఎలిమినేట్ చేస్తాడట… నిజానికి ఈమె అర్థంతరంగా ఆటలోకి వచ్చింది… మిడిల్ ఎంట్రీ… అప్పటి దాకా ఆటను చూసి ఉంది కాబట్టి, ఎవరి ఆట తీరు ఏమిటో కాస్త అవగాహన ఉండే ఉంటుంది కాబట్టి, ప్రత్యేకించి రెండు బ్యాచుల నడుమ సాగుతున్న పోరాటం కాబట్టి తనకంటూ ఓ స్ట్రాటజీని వర్కవుట్ చేసుకుని ఉండాలి…
కానీ అదేమీ లేదు… పైగా ప్రతి దానికీ ఏడుపు ఒకటి… ఆత్మన్యూనత భావం ఎక్కువ అమ్మాయిలో… అందరూ తనను కావాలని తీసిపారేస్తున్నట్టు ఫీలయ్యేది… ఆటల్లో కూడా పెద్ద ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు… పైగా మొన్న ఓ తప్పు చేసింది… సిల్లీ రీజన్స్‌తో ఎవరినీ నామినేట్ చేయలేను అని తలెగరేసింది… దాంతో బిగ్‌బాస్ ‘నువ్వు ఎవరినీ నామినేట్ చేయకపోతే, నేరుగా నువ్వే నామినేట్ అయిపోతున్నావ్’ అంటూ లిస్టులో చేర్చేశాడు..,. అప్పుడే అనిపించింది చచ్చింది గొర్రె అని…
నిజంగానే అదే జరిగింది… తీరా రనవుట్ అయ్యాక, అరెరె, ఇలా ఎందుకు చేశాను, ఈసారి ఎలిమినేషన్ తప్పదేమో అని బాధపడింది ఎవరి దగ్గరో… అదే జరిగింది… ఆకారపుష్టి… నైవేద్య నష్టి… అందం ఉంది గానీ ఆమె దగ్గర స్ట్రాటజీ లేదు… అదే ఆమె కొంప ముంచింది… ఆట నడుమ ఎలా క్రీజులోకి వచ్చిందో అంతే అర్థంతరంగా బయటికి వెళ్లిపోయింది… ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు… లీస్ట్ వోట్లతోనే ఔటయిపోయింది…
Ads
అసలే పాపులారిటీ లేదు… అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా ఉండాల్సింది… సరే, అయిపోయింది… మరి ఈసారి డబుల్ ఎలిమినేషన్ కదా… ఇంకెవరు ఎలిమినేట్ అయ్యారు… అందరూ వెంటనే చెప్పే పేరు రతిక… మరి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఎవరి కోసం వాడినట్టు..? రతికను నిజంగానే ఆదివారం ఎలిమినేట్ చేస్తున్నారా..? చేసేశారట… ఎలా అనేది కాస్త సస్పెన్స్… ఆమె లీస్ట్ వోట్ల జాబితాలో ఉన్నదే… ఆమె గనుక సేవ్ అయి ఉంటే శివాజీ నెత్తిమీద మోసిన అర్జున్ ఔటయ్యేవాడు… మొదట్లో కాస్త డీసెంట్ ఆట ఆడిన అర్జున్ ఎప్పుడైతే శివాజీ బ్యాచులో చేరిపోయాడో అప్పుడే తన పట్ల ప్రేక్షకుల్లో విరక్తి స్టార్టయింది… అర్జున్ భార్య కడుపుతో ఉంది, నేను సపోర్ట్ అని ఆమెకు మాట ఇచ్చాను వంటి సెంటిమెంట్ మాటలు చెబుతాడు కదా పెత్తందారీ శివాజీ… తను చెప్పగానే పాలేరు వంటి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ అడ్డు వేయడం, అర్జున్ బదులు రతిక బలి అయిపోవడం జరిగాయట… ఫాఫము రతిక… ఏ SPY బ్యాచ్ ను నమ్ముకుందో వాళ్ళే ముంచేశారు…
నిజానికి రతికది అశ్వినికన్నా దరిద్రపు ఆట… ఈమె మొదట్లోనే ఆటలోకి వచ్చింది… ఎవరేమిటో తెలుసు..? బయటికి వెళ్లిపోయింది… తన తప్పులేమిటో తెలుసుకుని ఉండాలి… అదృష్టం కొద్దీ, అందరూ వద్దనుకున్నా సరే ఆమె మళ్లీ ఆటలోకి వచ్చింది… అదీ బిగ్‌బాస్ పుల్టా పైత్యం వల్ల… మళ్లీ రాగానే శివాజీ బ్యాచ్ ఆధిపత్యం నడుస్తుందని భ్రమపడి తన కాళ్ల మీద పడింది… అక్కడే ఆమె దిగజారిపోవడం స్టార్టయింది… శివాజీ బ్యాచ్‌ను బతిమిలాడుతూ వాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది… అలా గాకుండా తన ఆట ఏదో తనే ఆడి ఉంటే మళ్లీ ప్రేక్షకుల ఛీత్కారానికి గురయ్యేది కాదేమో… పైగా తనను ఎలిమినేట్ చేయవద్దంటూ మొత్తుకోళ్లు, ఏడుపులు…
ప్రస్తుతం SPY బ్యాచ్, అనగా శివాజీ, ప్రశాంత్, యావర్ సేఫ్… అలాగే SAP బ్యాచ్… అనగా శోభ, అమర్, ప్రియాంక సేఫ్… గౌతమ్, అర్జున్ ఆటలో అరటి పండ్లు… ఆ రెండు బ్యాచులకూ వీళ్లిద్దరు ‘‘ఐనవాళ్లు’’ కారు… కాబట్టి వోట్లలో వీక్ అయిపోయారు… టాప్ 5 లేదా టాప్ 7 లో వీరిలో ఒకరైనా ఉంటారా..? చూడాలిక…
Share this Article