యాడ్స్‌తో ఊదరగొట్టే తెలుగుదేశం బరిలోనే లేదు… మజ్లిస్ అసలు యాడ్స్ పట్టించుకోదు… పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, సభలు, రోడ్ షోలు ఇతర యాడ్స్ కోణంలో చూస్తే బీజేపీ ఆ రెండు ప్రధాన పార్టీలకన్నా తక్కువే… నిజానికి ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ సాగింది… జనసేన యాడ్స్ నిల్… సీపీఎం సోసో… విశేషం ఏమిటంటే..? అనేక పార్టీలు బరిలో ఉన్న గత ఎన్నికలకన్నా ఈసారి యాడ్స్ దుమారం ఎక్కువ…
సరే, ప్రచారం ముగిసింది… మోతెక్కించిన మైకులు సహా యాడ్స్ ఈరోజుతో సరి… కానీ ఓ మార్కెటింగ్ నిపుణుడు విశ్లేషణ ఆశ్చర్యపరిచింది.,. నిజమే చెప్పాడు… కానీ ఆ కోణంలో విశ్లేషణ తొలిసారి విన్నాను… ‘‘స్థూలంగా చూస్తే ఈసారి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార వ్యూహం విస్తుగొలిపింది… ఖర్చు ఎక్కువ, రీచ్ ఎక్కువ… కానీ ఓ పర్‌ఫెక్ట్ వ్యూహం అనిపించలేదు… అదే సమయంలో కాంగ్రెస్ ప్రతి యాడ్ వెనుక కొంత హోం వర్క్ చేసింది… బహుశా సునీల్ కనుగోలు ఎఫర్ట్ కావచ్చు…
నిజానికి మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం బీఆర్ఎస్‌కు బాగా మైనస్ అయిపోయింది… ఏ ప్రాజెక్టును ఈసారి ఆకాశానికెత్తి, కోటి ఎకరాల మాగాణం అని ఉధృతంగా ప్రచారం చేయాలనుకున్నారో, ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ చాన్స్ లేకుండా పోయింది… కాలేశ్వరం పేరు ఎత్తితే మైనస్ అయిపోయే ప్రమాదం ఉండి, దాన్ని అనివార్యంగా తమ ప్రచారాంశాల నుంచి రిమూవ్ చేసుకున్నారు… టీఎస్పీఎస్సీ లీకేజీలు, ప్రవలిక ఆత్మహత్య, ఉద్యోగ నియామకాల మీద కూడా డిఫెన్స్‌లో పడిపోయింది బీఆర్ఎస్…
Ads
నిజానికి కాంగ్రెస్ గ్యారంటీల్లాగే బీఆర్ఎస్ కూడా అలవికాని హామీలను ఇచ్చింది… ఐనా సరే, ఎన్నికల్లో గెలిస్తే ఏమేం చేస్తామో చెప్పుకునే ప్రయత్నమే కనిపించలేదు… పాజిటివ్ వోటు కోసం గాకుండా, ఎంతసేపూ కొన్ని తప్పులు జరిగాయి, సరిదిద్దుకుంటాం, గెలిపించండి అని ఫుల్ డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు… అదీ మైనసే… పదే పదే కర్నాటకను ఉదహరిస్తూ కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మితే మోసపోతాం అనే ప్రచారంతో ఒకరకంగా కాంగ్రెస్ గ్యారంటీలను తాము కూడా పరోక్షంగా జనంలోకి తీసుకెళ్లినట్టయింది… కాంగ్రెస్ పాత దురాగతాలు అనే పాయింట్స్ కూడా జనంలోకి వెళ్లలేదు… ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనే పాజిటివ్ యాడ్స్ కొన్ని చేసినా సరే, వాటిల్లో పంచ్ లేదు…
అంతెందుకు…? కేసీయార్ ప్రసంగాల్లో లైఫ్, పంచ్ బలంగా ఉండేవి గతంలో… ఈసారి పేలవంగా ఉన్నయ్… చివరకు ‘‘70 ఏళ్లొచ్చినయ్, నాకు ఇంకా ఏం కావాలె’’ అనే ధోరణికి దిగిపోయాడు ఆయన… ఏ కుటుంబ పాలన అనే విమర్శ ఎదుర్కుంటున్నారో… దానికే బలం చేకూరేలా కేసీయార్, కేటీయార్, హరీష్… ఈ ముగ్గురే బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించారు… మరీ ప్రధానంగా కేసీయార్ బొమ్మే… ఎందుకోగానీ, మొదట్లో కవితను దూరం పెట్టినా, చివరకు ఆమె కూడా తెర మీదకు వచ్చేసింది… యాడ్స్‌లో పార్టీకన్నా కుటుంబం హైలైట్ అయ్యింది… కానీ కాంగ్రెస్ ఒకవైపు కేసీయార్, కేటీయార్ వ్యాఖ్యల్ని కౌంటర్ చేస్తూనే పాజిటివ్ వైబ్స్ కోసం ప్రయత్నించింది… గ్యారంటీలను సమర్థంగా జనంలోకి తీసుకెళ్లింది…
యాడ్స్‌లో పెద్దగా సోనియా, రాహుల్, ప్రియాంకలు కాదు… అంటే, ఢిల్లీ హైకమాండ్ కాదు… రేవంత్, భట్టి… ఒక రెడ్డి, ఒక ఎస్సీ… సోషల్ బ్యాలెన్స్… వాళ్లనే ప్రముఖంగా ప్రొజెక్ట్ చేశారు… వాళ్ల ఫోటోలతోనే యాడ్స్… పైగా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్ బాగా పేలింది… బీజేపీ అంటారా..? జనానికి కనెక్ట్ చేయగల ఏ స్లోగనూ లేదు… యాడ్స్‌లో మోడీ పాపులారిటీని ప్రొజెక్ట్ చేసుకోవాలనే సోయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం…!!
కాంగ్రెస్ కు ఓటేస్తే సచ్చిపోతారు, కళ్ళు పోతాయ్ అనే విచిత్ర ప్రసంగ ధోరణికి brs వెళ్ళిపోయింది చివరకు… మరీ ఒకరైతే ఓడిపోతే కుటుంబం మొత్తం సామూహికంగా సూసైడ్ చేసుకుంటాం అని బెదిరించాడు ఓటర్లను… కాంగ్రెస్ గెలిస్తే నెత్తురు, మతకలహాలు అని brs భయపెడితే… కాంగ్రెస్ కూడా కెసిఆర్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసింది… గట్లుండే దొర, గిట్లయిండు దొర అని ఫుల్ పేజ్ యాడ్ వేసింది… Situation బాగాలేక కెసిఆర్ తనే కష్టపడి 96 సభల్లో పాల్గొన్నాడు… అదీ విశేషమే… సీనియర్స్ పిచ్చి కూతల్ని కంట్రోల్ చేయడం కాంగ్రెస్ కు కాస్త ప్లస్సే…
Share this Article