ఎగ్జిట్ పోల్స్, అంచనాలు, జోస్యాలు, బెట్టింగులు గట్రా కాసేపు వదిలేస్తే… అరయగ కర్ణుడీల్గె ఆరువురి చేతన్ అనే విశ్లేషణలు 3 తేదీన చెప్పుకుందాం… కానీ ఒకసారి తొలి వోటు గురించి చెప్పుకోవాలి… యువత దీనికి ఎంత ప్రాధాన్యమిచ్చారంటే… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… రేవంతరెడ్డి, కేసీయార్, బీజేపీ వెంకటరమణారెడ్డి బలంగా పోటీపడిన కామారెడ్డి స్థానంలో ఆమెకు వోటు ఉంది…
పేరు గజ్జె శ్రీలేఖ… ఆమె బెంగుళూరులో శ్యాంసంగ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… తొలి వోటు తప్పకుండా వేయాలని ఆమె సంకల్పం… గుడ్… కాదు, గ్రేట్… హైదరాబాద్‌లో సగం మంది ఇళ్ల నుంచి కదల్లేదు… వాళ్లతో పోలిస్తే ఈమె ఎంతో ఎంతో నయం… టైమ్‌కు బస్సు, రైలు టికెట్లు దొరకలేదు… దాంతో ఫ్లయిట్ టికెట్ ఎక్కువ రేట్లకు తీసుకుని మరీ వచ్చింది… కేవలం తన తొలి వోటు వేయడం కోసం… వోటు అనే ప్రజాస్వామిక స్పూర్తికి, హక్కుకు, బాధ్యతకు ఇదే నిదర్శనం… అభినందనలు తల్లీ…
మునుపటి రోజులకన్నా ఈసారి మరో విశేషం కనిపించింది… రకరకాల కొలువుల్లో హైదరాబాద్‌లో బతికే లక్షల మంది… నిజమే, లక్షల మంది తెలంగాణ పల్లెలకు తరలారు… బస్సులు, ట్రెయిన్లు… ఫుల్ కిటకిట… అవీ దొరక్కపోతే షేర్ బేసిస్‌తో కార్లు మాట్లాడుకుని వెళ్లారు… వీరిలో కూడా తొలి వోటు వేయాలనుకున్న యువత అధికం… మేల్, ఫిమేల్ తేడా ఏమీ లేదు… పోలింగ్ బూత్ చేరాలి, ఎడమ చేయి చూపుడు వేలి మీద సిరా గీత పడాల్సిందే…
Ads
ఎక్కడెక్కడి నుంచో వచ్చి నగర శివారు ప్రాంతాల్లో… అల్వాల్, ఉప్పల్, మేడ్చల్ ఎట్సెట్రా శివారు ప్రాంతాల్లో రోడ్లు వెలవెలబోయాయి… నిజంగా తొలి వోటుకు ఇంత ప్రాధాన్యముందా..? ఉంది… యువత అదే అనుకుంది… అనుకోవడమే కాదు… తండ్రులను, సోదరులను కాదు గానీ, తల్లులు, అక్కాచెల్లెళ్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు… అది బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారబోతోంది… మరో ఉదాహరణ చెప్పుకుందాం…
అదే కామారెడ్డి నియోజకవర్గంలో ఓ యువతి… మూడు నెలల బిడ్డ… 10, 15 వేల స్టడీ మెటీరియల్ తెచ్చి సీరియస్‌గా చదువుకునేది… ఒకవైపు గర్భం, మరోవైపు చదువు, ఐనా ఓ పట్టుదల… కానీ హఠాత్తుగా పరీక్షలు రద్దు… హతాశురాలైంది… అధికార పార్టీ మీద విపరీతమైన కోపం ఆమెలో… ప్రవళిక ఆత్మహత్య గుర్తుంది కదా… దాన్ని మసిబూసి మారేడు కాయ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నించేకొద్దీ అది వ్యతిరేకం అయిపోయింది… అంతేకాదు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు కూడా యువతలో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి… వంద మంది దాకా అరెస్టు చేసి కూడా అబ్బే, అది చిన్న విషయం అని ప్రజల కళ్లకు గంతలు కట్టింది అధికార పార్టీ…
బీజేపీ గెలుస్తది అనేచోట బీజేపికి, కాంగ్రెస్ గెలిచే చాన్సుంది అనుకున్నచోట కాంగ్రెస్‌కు యువత వోట్లు అధికంగా పడ్డట్టు ఫీల్డ్ సమాచారం చెబుతోంది… గతంలో వోటర్లు గుంభనంగా ఉంటూ తాము వోటు ఎవరికి వేశామో చెప్పకపోయేవాళ్లు… కానీ ఈసారి బహిరంగంగానే చెబుతున్నారు… అదీ ఆగ్రహతీవ్రత… ఈ ప్రభావంతో పలువురు బీజేపీ అభ్యర్థులు అనూహ్యంగా బయటపడబోతున్నారు… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు సీట్లు బీజేపీకి రానున్నాయని ప్రాథమిక అంచనా… అదీ విశేషం… అవునూ, గజ్వెల్‌పై డౌటుతో కామారెడ్డికి వలస పోయాడు కదా కేసీయార్… ఏ స్థానంలో ఉంటాడో మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలరా..?
చివరగా… కామారెడ్డిలోనే మీడియా ప్రతినిధులు మరో ఇంట్రస్టింగ్ విశేషం గమనించారు… చాలామంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు డబ్బు తీసుకున్నారు తప్ప వోటర్లకు పంచలేదు… అంతేకాదు, పైకి చూడటానికి బాగా కష్టపడుతున్నట్టుగా సతీమణులను కూడా ప్రచారంలోకి దింపారు… కానీ ఇళ్లల్లోకి వెళ్లి, మేం చేసిన పనులకు బిల్లులు రాలేదు, మునిగిపోయాం, బీఆర్ఎస్‌కు మాత్రం వేయవద్దని గుసగుసగా చెప్పడం ప్రింట్, టీవీ మీడియా ప్రతినిధులనే ఆశ్చర్యానికి గురిచేసింది…
Share this Article