తెలంగాణలో మరీ ఎక్కువేమీ కనిపించవు కానీ… ఏపీ రాజకీయాల్లో మొత్తం కులం బురదే…! చాన్నాళ్లు కమ్మ వర్సెస్ కాపు… అప్పట్లో రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసం, దహనకాండలు తెలిసిందే కదా… వైఎస్, చంద్రబాబు హయాంలో కూడా రాజకీయాల్లో కులం ప్రధానపాత్ర పోషించినా సరే మరీ ఘోరంగా దిగజారలేదు…
జగన్ సీఎం అయ్యాక రెడ్డి వర్సెస్ కమ్మ ఉధృతమైంది… జగన్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది… ఊళ్లల్లో రెడ్ల ఆధిపత్యం కూడా బాగా పెరిగింది… ఈ స్థితిలో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది… అదేమిటంటే..? వైఎస్ షర్మిల కొడుకు పేరు రాజారెడ్డి… తను అట్లూరి ప్రియ అనే అమ్మాయిని పెళ్లిచేసుకోనున్నాడు అనేది వార్త…
పొలిటికల్ ఫ్యామిలీ, వైఎస్ మనమడు, జగన్ మేనల్లుడు, షర్మిల కొడుకు కావడం వల్ల సహజంగానే ఈ ప్రేమ, ఈ పెళ్లి వార్త ఆసక్తికరంగానే ఉంటుంది ప్రజలకు… ఈ వార్త, ఈ ఫోటో కనిపించగానే ఇక తెలుగు నెటిజన్ల చర్చకు ఓ పాయింట్ దొరికింది… ఎందుకంటే..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉప్పునిప్పుగా ఉంటున్న… కనీసం బయటికి అలా కనిపిస్తున్న కమ్మ, రెడ్డి నడుమ ఓ పెళ్లి కాబట్టి… ఆ అమ్మాయి కమ్మ కాబట్టి…
Ads
వీళ్లిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారనీ, ఆమె అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నదనీ ఆ వార్త చెబుతోంది… ఇద్దరూ చర్చిమేట్లట… అంటే ఒకే చర్చికి వెళ్లేవాళ్లట… ఈ పెళ్లి వార్త తెలియగానే ఇక నెటిజనం రెడ్డి వెడ్స్ కమ్మ అని రాస్తున్నారు… నో, నో, రెడ్డి వెడ్స్ కమ్మ ఏమిటి..? ఇద్దరూ క్రిస్టియన్లే, ఇక కులమేముంది అని కొందరు… నో, నో, క్రిస్టియన్లే అయినా సరే వాళ్లు కులాన్ని ఎప్పుడు విడిచిపెట్టారు అని మరికొందరు…
జగన్ కుటుంబం కూడా క్రిస్టియన్లే… కానీ కులాన్ని విడిచిపెట్టిందెక్కడ..? ఎదుటి కులాన్ని వదిలిందెక్కడ..? ఈ వాదన కొందరిది… ఇది కాస్తా ఇంకో చర్చకు వెళ్లింది… మనది పితృస్వామ్య వ్యవస్థ… రాజారెడ్డి తల్లి షర్మిల బ్రదర్ అనిల్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంది… వాళ్లదీ ప్రేమవివాహమే… ఇద్దరూ క్రిస్టియన్లే… కానీ కులం కోణంలో వాళ్లది రెడ్డి, బ్రాహ్మణ వివాహం… అలాంటప్పుడు పేరులో రాజారెడ్డి ఉన్నా సరే, నిజానికి తను బ్రాహ్మణుడే కదా అని ఇంకొందరి వాదన…
నో, నో… ఆమె వైఎస్ షర్మిల… చాలామంది రాజకీయ నేపథ్యమున్న మహిళల్లాగే… నందమూరి సుహాసిని, కల్వకుంట్ల కవిత తరహాలో షర్మిల ఇంటి పేరు కూడా మార్చుకోలేదు… జనానికి పరిచితమైన తమ పుట్టింటి పేర్లనే కొనసాగిస్తున్నారు… సరే, ఇంటి పేరు కొనసాగింపు ఎలా ఉన్నా ఆమె బ్రాహ్మణుల ఇంటి కోడలు కదా… సో, రాజారెడ్డి, ప్రియల పెళ్లిని కమ్మ, బ్రాహ్మణ వివాహంగానే పరిగణించాలని నెటిజనంలో చర్చ…
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా సరే, సదరు రాజారెడ్డికి తెలుగు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేనట్టుంది… సదరు ప్రియ కుటుంబ నేపథ్యమూ పెద్దగా ఎవరికీ తెలియదు… (Chutneys అధినేత ప్రసాద్ మనవరాలు అని జగన్ సోషల్ మీడియాలో కనిపించింది… కానీ డౌటే..)… సో, వాళ్ల కులాలకు పెద్దగా రాజకీయ ప్రాధాన్యమూ లేదు… అందుకని ఎంచక్కా పెళ్లిచేసుకొండి, హేపీ మేరీడ్ లైఫ్ అని ఆశీస్సులు అందించడమే…!! అవునూ, రాజారెడ్డి పాస్‌పోర్టులో ఇంటిపేరు ఏమని ఉందో…!!
Share this Article