రాజస్థాన్ లో మరో యోగి? Yes! రాజస్థాన్ లో మరో యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లాగానే ‘నాథ్’ పరంపరకి చెందిన ‘మహంత్ బాలక్ నాథ్’ రాజస్థాన్ బీజేపీ లో ఉన్నారు… మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని ఆళ్వార్ లోకసభ స్థానానికి బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు!
అయితే రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించే నిమిత్తం బీజేపీ అగ్ర నాయకత్వం మహంత్ బాలక్ నాథ్ గారికి శాసనసభ టికెట్ ఇచ్చింది! రాజస్థాన్ లోని మేవాత్ ప్రాంతం హర్యానా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడే తిజారా అసెంబ్లీ స్థానం ఉంది. ఈ తిజారా అసెంబ్లీ టికెట్ ఇచ్చింది బీజేపీ అగ్ర నాయకత్వం బాలక్ నాథ్ గారికి!
తిజారా అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు! కాంగ్రెస్ తరపున ఇమ్రాన్ ఖాన్ పోటీ చేసాడు. మహంత్ బాలక్ నాథ్ 6000 ఓట్ల మెజారిటీతో ఇమ్రాన్ ఖాన్ ని ఓడించారు! ఇదీ నేపథ్యం…
Ads
ఇప్పటి వరకు బీజేపీ అగ్ర నాయకత్వం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరి పేరూ ప్రకటించలేదు! అంటే మహంత్ బాలక్ నాథ్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం సాగుతోంది..! మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజే స్థానంలో మహంత్ బాలక్ నాథ్ ని ప్రకటించడం వలన రాజస్ధాన్ లో బీజేపీ మరింత బలపడడానికి దోహదం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!
వసుంధర రాజే ఒంటెద్దు పోకడల వలన రాజస్ధాన్ బీజేపీలో సమస్యలు తలెత్తుతున్నాయి. వసుంధర రాజే ఇప్పటికి తనని తాను మహారాణిగా భావిస్తూ ఉంటుంది! చాలా కేడర్ ఆమెకు దూరమయ్యారు… ఢిల్లీతోనూ ఆమెకు పెద్దగా సయోధ్య లేదు…
మహంత్ బాలక్ నాథ్ ని ముఖ్యమంత్రిని చేస్తే వరుసగా రెండో సారి అధికారం ఇవ్వని రాజస్థాన్ ప్రజల మనసు మార్చే విధంగా పాలన చేస్తారు అనే నమ్మకం పార్టీలో ఉంది! యోగి ఆదిత్యనాధ్ లాగానే మహంత్ బాలక్ నాథ్ కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నది బీజేపీ అధిష్టానం! అయితే మహంత్ బాలక్ నాథ్ యోగి ఆదిత్యనాధ్ కంటే మరింత కఠినంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు!
మహంత్ బాలక్ నాథ్ యోగి ఆదిత్యనాధ్ ని తన పెద్ద సోదరుడు అని సంబోధిస్తాడు! ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో యూపీ యోగి మహంత్ బాలక్ నాథ్ కి మద్దతుగా ప్రచారం చేశారు కూడా! అలాగే నామినేషన్ వేయడానికి కూడా ఉత్తరప్రదేశ్ నుండి తరలి వచ్చారు యోగీ…!
ఇంతకీ ఎవరీ మహంత్ బాలక్ నాథ్ ?
39 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ 12 వ తరగతి వరకు చదువుకున్నారు! యాదవ కుటుంబానికి చెందిన బాలక్ నాథ్ తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం! 1984 లో జన్మించిన బాలక్ నాథ్ కి 6 వ ఏట తల్లితండ్రులు సన్యాసం ఇప్పించారు మహంత్ ఖేథానాథ్ ద్వారా! తరువాత మహంత్ వాంద్ నాథ్ దగ్గర శిష్యరికం చేశారు బాలక్ నాథ్! మహంత్ వాంద్ నాథే బాలక్ నాథ్ అనే పేరుని ఇచ్చారు. మహంత్ వాంద్ నాధ్ తన వారసుడిగా బాలక్ నాథ్ ని ప్రకటించారు 2016 లో!
హర్యానా లోని రోహతక్ లో ఉంది మస్థాన్త్ మఠం! మస్థాన్త్ మఠానికి బాలక్ నాథ్ 8వ మహంత్! రోహతక్ లో మస్థాన్త్ మఠం చాలా పెద్దది. ఈ మఠం కింద పలు విద్యా సంస్థలు, హాస్పిటల్స్ నడుస్తున్నాయి! సో, దేశంలో మరో యోగి రాబోతున్నాడా..? అందులోనూ అదే నాథ్ పరంపరకు చెందిన సన్యాసి… ఇంట్రస్టింగు కదా…!!….. పొట్లూరి పార్థసారథి
Share this Article