Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…

December 4, 2023 by M S R

వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా…

సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి నాటకాలో, అబద్ధాలో గుర్తించారు… చీరి చింతకు కట్టారు… ఆ నాటకానికి తెరలేపిన కేసీయార్‌ను ఫామ్ హౌజుకు పంపించేశారు… ఇన్నేళ్ల కెరీర్ కదా, కనీసం తెరపైకి వచ్చి ఇన్నేళ్ల తన రాజకీయ జీవితానికి, అపారమైన సాధన సంపత్తికి కారకులైన వోటర్లకు క‌ృతజ్ఞతలు చెప్పలేదు… సైలెంటుగా ప్రగడీ భవన్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు… అది కరెక్టు కాదు… జనం పట్ల ఆ తేలిక భావం పనికిరాదు…

మరొకటీ చెప్పుకోవాలి… కేసీయార్ తన సిట్టింగులను మార్చిన దాదాపు ప్రతిచోట కొత్త అభ్యర్థులు గెలిచారు… ఎస్… నయా దేశ్‌ముఖ్‌లుగా మారిన మరో 20, 30 మందిని ఇంటికి పంపించేసి, ఏ మకిలీ లేని కొత్తవాళ్లకు గనుక అవకాశం ఇచ్చి ఉంటే కేసీయార్ పార్టీ మెజారిటీకి దగ్గరగా వెళ్లి ఉండేది… ఏమైనా తక్కువ పడితే బీజేపీయో, మజ్లిసో, లేకపోతే ఇద్దరూ కలిసో సాయం పట్టేవాళ్లు… ఎలాగూ 80, 90 సభలకు వెళ్లినవాడు, ఆ కొత్త వాళ్లను గెలిపించుకుని ఉండేవాడు కదా… ప్చ్, తెలంగాణ అనే పదాన్నే నువ్వు కాదనుకున్నావు… ఆ తెలంగాణ నన్నే కాదనుకుంది… ‘‘క్విడ్ ప్రోకో…!!

షోలాపూర్‌కు 600 వాహనాల కాన్వాయ్‌తో వెళ్లిన అట్టహాసం, ఆడంబరం, పటాటోపం… ఫామ్ హౌజుకు వెళ్తున్నప్పుడు కేవలం రెండు కార్లు… ఏ పోలీస్ హడావుడి లేదు… అధికారాంతమున చూడవలె అన్నట్టుగా… ఏ నాయకుడైనా సరే దీన్ని గుర్తుంచుకోవాలి… అదేదో పాట ఉంది కదా… సాగినంత కాలమూ నాఅంత వాడు లేడందురు అని… దర్పాలు, భోగాలు, హోదాలు, జేజేలు, కీర్తనలు, పాదాభివందనాలు జస్ట్, బుద్భుదప్రాయం నాయకా… సాధించిన ఘనతలన్నీ చరిత్రలో కలిసిపోలేదా ఒకేసారి… రాజకీయాల్లో ఓటమి అనేది భరించడానికి భయంకరమైంది ‘‘బాపూ’’…

దేశ రాజకీయాల్లో గిరగిరా చక్రాలు తిప్పిన అంతటి చంద్రబాబే మొన్న రెండు నెలలపాటు జైలులో గడిపి రాలేదా..? రేవంత్ మహా ముదురు… కేసీయార్‌కే దగ్గులు నేర్పగలడు… ఇప్పుడు కుర్చీ దక్కింది… ఏం చేస్తాడో… సరే, అవన్నీ వదిలేస్తే… కాస్త లైటర్ వీన్‌లోకి వద్దాం… కాంగ్రెస్ గెలిచింది 64 సొంతంగా… అంటే 119 సీట్లకు గాను మేజిక్ మార్కుకు నాలుగు మాత్రమే ఎక్కువ… సీపీఐ సీటు కూడా కలిపితే 65…

Ads

కానీ కేసీయార్ మళ్లీ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్‌కు చీలిక ప్రమాదం తప్పదు… చేజిక్కిన అధికారం గల్లంతు కాకతప్పదు… ప్రజాభిప్రాయం, గౌరవం వంటి మాటలు పట్టించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అహోబిలం మఠమేమీ కాదు… ఫక్తు రాజకీయ పార్టీ… కేసీయార్ అంతకన్నా ఫక్తు రాజకీయ బేహారీ… సో, కాంగ్రెస్‌కు కొన్ని అదనపు సీట్లు కావాలి… సుస్థిర ప్రభుత్వం కోసం తప్పదు… పైగా కేసీయార్ నేర్పిన విద్యయే కదా… ఆల్‌రెడీ భద్రాచలం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు వెంటనే వచ్చేసి రేవంత్‌ను కలిశాడు…

తెల్లం

తను ఇప్పుడు బీఆర్ఎస్ కాదు… తనే చివరి ఎమ్మెల్యే కాకపోవచ్చు కూడా… ఇంకొందరు కాంగ్రెస్ గూటికి రావచ్చు… అసలు తెల్లం ఒరిజినల్‌గా కాంగ్రెస్ మనిషే… అక్కడ పొడెం వీరయ్య కోసం తెల్లంను కాదనుకుంటే, బీఆర్ఎస్ టికెట్టు తెచ్చుకుని గెలిచాడు… దీంతో ఖమ్మం క్లీన్ స్వీప్ జరిగిపోయింది… ఇక ఇప్పుడు బీఆర్ఎస్‌లోని కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు కూడా ఇటువైపు చూస్తారేమో… సపోజ్, ఒక సబిత, ఒక కౌశిక్, ఒక మల్లారెడ్డి ఎట్సెట్రా… ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి నాయకులు… అంటే, వచ్చేస్తున్నారని కాదు, వచ్చేస్తారేమో అని…!!

 

అప్పుడు వాళ్లు ఏమంటారు..? ఓ మిత్రుడి వ్యాఖ్య ఏమిటంటే…

  1. సొంత గూటికి చేరుకున్నా…
    2. తల్లి గారింటికి వచ్చినట్టుంది…
    3. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత, ఆమె రుణం తీర్చుకుంటా…
    4. నియోజక వర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశా, రాజకీయాలు చర్చించలేదు…
    5. ఇన్నాళ్లు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బతికా, ఈ రోజే విముక్తుడినయ్యా…
    6. ప్రజా తెలంగాణలో భాగస్వామినవుతా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions