రెడ్ల రాజ్యంలోనే వెలమలు ఎక్కువ… కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో చెప్పినట్టు ‘‘పాయింట్ ఫైవ్ జనాభా’’ కావచ్చు గాక… కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 10.92 పర్సెంట్… గత ప్రభుత్వంలో 11 ఇప్పుడు 13 మంది…
పాలిటిక్స్ అంటేనే ప్రాంతం, మతం, కులం… కులంలో మళ్లీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ… బీసీలలోనూ మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ… ఇలా చాలా…! ఓసీల్లోనూ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వేరు… పాలిటిక్స్‌లో చివరి రెండు కులాలది చిన్న పాత్రే… సామాజిక న్యాయం, సమీకరణలు అని ఏ మాటతో ముచ్చటించుకున్నా తెలంగాణలో ఇప్పటికీ సీఎం సీటు పంచాయతీ రెడ్డి, వెలమ మధ్యలోనే ఉన్నది.
కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ. బీఆర్‌ఎస్ వెలమ కుటుంబ వ్యవస్థ… బీఆర్‌ఎస్ లో, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వెలమ ఎమ్మెల్యేలు నెంబర్ ఎక్కువని, కాంగ్రెస్ లో అయితే రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువనే ఒపీనియన్ ఉన్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌లో చాలా వాటిలాగే మరో అసాధారణ విషయం కనిపించింది…
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న ఈ ఎన్నికల్లోనే వెలమ వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, బీజేపీ ఒక్కరు చొప్పున వెలమ సామాజికవర్గానికి చెందిన 13 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు…
పాల్వాయి హరీష్ బాబు (సిర్పూరు), కొక్కిరాల ప్రేంసాగర్ రావు (మంచిర్యాల), కె.మదన్ మోహన్ రావు (ఎల్లారెడ్డి), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల), మాకునూరు సంజయ్ కుమార్ (జగిత్యాల), చింతకుంట విజయరమణరావు (పెద్దపల్లి), కల్వకుంట తారకరామారావు (సిరిసిల్ల), తన్నీరు హరీష్‌రావు (సిద్ధిపేట), మైనంపల్లి రోహిత్ రావు (మెదక్), కల్వకుంట చంద్రశేఖరరావు (గజ్వేల్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి) ఈసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు…
తెలంగాణ శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుత అసెంబ్లీలో వెలమ ఎమ్మెల్యేలు 10.92 పర్సెంట్… 2018 ఎన్నికల కంటే ఇది ఎక్కువ… గత ప్రభుత్వంలో 11 మంది వెలమలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు… అంటే అప్పుడు వెలమ ఎమ్మెల్యేల వాటా 9.25 పర్సెంట్ మాత్రమే… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పర్సెంట్ మరింత పెరిగింది…
Ads
అప్పుడు కేసీఆర్ (గజ్వేల్), కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్ రావు (సిద్ధిపేట), ఎరబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), నడిపెల్లి దివాకర్ రావు (మంచిర్యాల), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్ గిరి), మాధవరం కాంతారావు (కూకట్ పల్లి), కల్వకుంట విద్యాసాగర్ రావు (కోరుట్ల), చెన్నమేనని రమేశ్ బాబు (వేములవాడ), మాకునూరు సంజయ్ కుమార్ (జగిత్యాల), మాధవనేని రఘునందన్ రావు (దుబ్బాక) ఎమ్మెల్యేలు… కామెంట్స్‌లో పాయింట్ ఫైవ్ పర్సంట్ అంటారు గానీ రాజకీయాల్లో ఈ లెక్క వేరే ఉంటది… – ప్రహ్లాద్…
Share this Article