Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం… కొన్ని అబ్జర్వేషన్స్…

December 7, 2023 by M S R

Paresh Turlapati…..  అబ్సర్వేషన్స్… తెలంగాణా ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు కదా, టీవీల్లో చూసిన తర్వాత దాంట్లో నేను గమనించిన కొన్ని దృశ్యాలు !

* రేవంత్ రెడ్డి సోనియా కుటుంబంలో మంచి మార్కులే సంపాదించుకున్నారు ! * తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా..రాహుల్.. ప్రియాంకలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరేటప్పుడు హడావుడిలో జరిగిన ఒక చిన్న దృశ్యం నన్ను ఆకర్షించింది !

కారులో రాహుల్ ముందు కూర్చుంటే సోనియా.. ప్రియాంక వెనుక సీట్లో కూర్చోవడానికి రెడీ అయ్యారు.. రేవంత్ వీళ్ళకి సెండాఫ్ ఇవ్వటానికి డోర్ దగ్గర నిలబడ్డారు.. అప్పుడు రాహుల్ సడెన్ గా వెనక్కి తిరిగి రేవంత్ ను కారెక్కమనీ.. ప్రియాంకను దిగమని సైగ చేయటంతో ప్రియాంక కారు దిగి వెనక కారు ఎక్కింది.. రేవంత్ రాహుల్ కారులో సోనియా పక్కన కూర్చున్నాడు !

Ads

ఈ దృశ్యం చూశాక రేవంత్ కి బానే ప్రాముఖ్యత ఇచ్చారనిపించింది నాకు ! ( ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రులను కరివేపాకులా తీసిపడేస్తుందనే పేరు మార్కెట్లో బాగా ఉంది ) ఇక రేవంత్ ఎలాగూ వాళ్ళకే టాప్ ప్రియారిటీ ఇవ్వాలి.. ఇచ్చాడు కూడా !

ముఖ్యమంత్రి హోదాలో అధికారిక ప్రమాణ స్వీకారానికి పోలీసుల గౌరవ వందనంతో ఓపెన్ టాప్ జీపులో వస్తుంటే సోనియాను ముందు నిలిపి తాను వెనుక నించోవటమ్ చూస్తే ఆ విషయం అర్థమౌతుంది ! రేవంత్ కి ‘రాజ’ మర్యాదల విషయంలో పెద్ద పట్టింపులు ఉన్నట్టు లేదు !

సాధారణంగా సీఎం కారులో వేదిక దగ్గరికి వచ్చినప్పుడు నలుగురు నల్లకళ్ళద్దాల పిల్లులు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దగ్గర నిలబడాలి ! అప్పుడు ఒకడు డోర్ తీస్తే, రెండో వాడు డోర్ పైన తల తగలకుండా చెయ్యడ్డుపెట్టాలి ! అప్పుడు కదా సీఎం దిగాల్సింది. ఈ విషయంలో రేవంత్ పక్కా మాస్

సుబ్బరంగా డోర్ తనే తీసుకుని మర్యాదల కోసం చూడకుండా చకచకా ముందుకెళ్లిపోయాడు !

ఎటువంటి ఈగోలు.. అహంకారం లేకుండా వేదిక మీద కూడా అందరితో కలివిడిగా కల్సిపోతూ తిరిగిన రేవంత్ సింప్లిసిటీ నచ్చింది ! ముఖ్యమంత్రి అంటే ప్రజలతో కలవాల్సినవాడు కదా !

ఇక బందోబస్తు ఏర్పాట్లలో సెక్యూరిటీ వైఫల్యం సృష్టంగా కనిపించింది ! రేవంత్ కాబట్టి ఊరుకున్నాడు కానీ బాగా అహంకారం ఉన్న సీఎం అయితే అప్పటికప్పుడు పోలీసు బాసులను సస్పెండ్ చేసేవాడు ! వేదిక మీద రేవంత్ తో కలిపి ముగ్గురు సీఎం లు ఇంకా ఇతర వీవీఐపీలు ఉండగా యథేచ్ఛగా ఎవరుపడితే వాళ్ళు డయాస్ మొత్తం ఆక్రమించేశారు!

రేవంత్ మొదటి ఫైలు మీద సంతకం పెడుతుంటే జనాలు తోసుకువచ్చేశారు ! ఒక కార్యకర్త అయితే ( బహుశా తాగి ఉన్నట్టున్నాడు.. జై తెలంగాణా అంటూ స్టేజీ మీదే డాన్స్ చేస్తున్నాడు ) అప్పుడు డీజీపీ కూడా స్టేజీ మీదే ఉన్నారు !

ఇక వైఎస్ వెనుక తెల్ల జుట్టు సూరీడు ఉన్నట్టు రేవంత్ వెనుక నల్లగుండు సూరీడు ఉన్నాడు ! ఇతని హడావుడి మాములుగా లేదు… బహుశా ఇతను రేవంత్ సొంత సెక్యూరిటీ అయ్యుంటాడు (యూనిఫార్మ్ లేదు.. బ్లూ కలర్ షర్ట్ ) రేవంత్ సీఎం కాకముందు అప్పటి బీఆరెస్ ప్రభుత్వం గన్ మెన్లను తగ్గించింది.. ఉన్న ఇద్దరు గన్మెన్లు కూడా అవసరం లేదని రేవంత్ వాళ్ళని కూడా వెనక్కి పంపేసాడు !

బహుశా ఈ నల్లగుండు సూరీడుని రేవంత్ అప్పుడు తన సొంత సెక్యూరిటీగా పెట్టుకుని ఉంటారు ! ఇక వేదిక మీద ప్రమాణం చేస్తున్నప్పుడు అందరికంటే సీతక్కకు ప్రజలనుంచి స్పందన బాగా వచ్చింది ! రేవంత్.. భార్య.. కూతురు.. అల్లుడిని తీసుకుని సోనియాకు పాద నమస్కారం చెయ్యటం బావుంది !

ప్రమాణస్వీకారం అయిపోయిన తర్వాత కూడా సీఎం పెద్దగా సెక్యూరిటీ హడావుడి లేకుండానే ప్రజల మధ్య లోనుంచే వెళ్ళటం కొత్తగా ఉంది !కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయిన ఆరు గ్యారంటీల ఫైలు మీద తొలి సంతకం పెట్టటం.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ రెండో ఫైలు మీద సంతకం పెట్టటం.. ప్రగతి భవన్ కు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మారుస్తూ రేపటినుంచి ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అనౌన్స్ చెయ్యటం మంచి పరిణామాలు ! చూద్దాం, ముందు ముందు రేవంత్ మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions