ఓ మిత్రుడు పంపించిన యూట్యూబ్ షార్ట్ కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… అందులో రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఎంపీ దీపేందర్ హుడా ఇంటికి వెళ్లడం, ఇంట్లో వాళ్లు ఆశీస్సులు అందించడం, హుడా రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకుని అభినందించడం వంటి సీన్స్ ఉన్నయ్… హుడా సహకారంతోనే రేవంత్ ఢిల్లీలో నెగ్గుకొచ్చాడన్నట్టుగా ఉంది… ఐతే…
కాంగ్రెస్ వంటి పార్టీల్లో హైకమాండ్ దగ్గరకు మంచి రూట్స్ కావాలి… వాళ్లు నమ్మాలి… కోర్ కమిటీలు సాయం చేయాలి… ఇవన్నీ అవసరమే… ఐతే ఎటు నుంచి నరుక్కొస్తే మన పని వర్కవుట్ అవుతుందో తెలియాలి… సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోవాలి… అది తెలిసినవాళ్లే కాంగ్రెస్‌లో రాణిస్తారు… ఈ దిశలో రేవంత్, హుడా దోస్తీ పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయినట్టే… తప్పుపట్టాల్సింది ఏమీలేదు… పైగా తప్పదు కూడా…
Ads
రేవంత్ కష్టం వేరు… ప్రయాస వేరు… కానీ చివరలో సీనియర్లు సీఎం గాకుండా అడ్డుతగలడానికి ప్రయత్నించారు… అదీ కాంగ్రెస్ వంటి పార్టీల్లో సహజమే… ఆశలు అందరికీ ఉంటాయిగా… కానీ హుడా సహకారం రేవంత్‌కు బాగానే లభించినట్టుంది… ఆ కుటుంబంతో తన సాన్నిహిత్యం కనిపిస్తూనే ఉంది… ఐతే మరి నిజంగానే ఈ దీపేందర్ హుడా ఎవరు..? హైకమాండ్ దగ్గర అంత గ్రిప్ ఉందా..?
ఉంది… తన నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే… తనది రోహ్‌తక్ నియోజకవర్గం… హుడా ఇప్పుడు హర్యానా నుంచి రాజ్యసభ సభ్యుడు… గతంలో మూడుసార్లు లోకసభ ఎంపీగా గెలిచాడు… అప్పట్లో పిన్న వయస్కుడైన ఎంపీ… తనది బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యమే… తండ్రి భూపేందర్ సింగ్ హుడా రెండుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా చేశాడు…
రణబీర్ సింగ్ హుడా… ఈయన దీపేందర్ తాత… ఆయన రెండుసార్లు ఎంపీ… అదే రోహ్‌తక్ నియోజకవర్గం… అప్పటి పంజాబ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి కూడా…! ఈయన తండ్రి చౌదరి మాతు రామ్… ఫ్రీడం ఫైటర్, మహాత్మాగాంధీతో కలిసి పనిచేశాడు… ఇంకా ఉందండోయ్… రాజస్థాన్‌లో నాథూరామ్ మిర్దా అనే ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన మనమరాలు శ్వేతా మిర్దా… ఆమెనే దీపేందర్ పెళ్లి చేసుకున్నాడు…
శ్వేత అక్క జ్యోతి మీర్దా… రాజస్థాన్, నగౌర్ నుంచి ఎంపీ ఒకసారి… ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వైస్ చైర్మన్ నరేంద్ర గెహ్లాట్ ఈ శ్వేత మిర్దా భర్త… అనగా దీపేందర్ బావ… అన్నట్టు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా డీఎల్ఎఫ్ స్కాం బాపతు భూములన్నీ ఉన్నవి హర్యానాలోనే కదా… ఐనా అవన్నీ ఇప్పుడెందుకు లెండి…
మొత్తానికి దీపేందర్ పవర్ ఫుల్ పొలిటిషియన్… కాంగ్రెస్ పార్టీలో… అప్పట్లో రాహుల్ గాంధీ తమ ‘క్విక్ రెస్పాన్స్ టీం’’లో చేర్చాడు దీపేందర్‌ను… బాగా కావల్సినవాడు కదా… పార్టీ అత్యున్నత వేదిక ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’లో కూడా దీపేందర్ స్పెషల్ ఇన్వైటీ… రేవంత్‌కు ఢిల్లీ ఫుల్ సపోర్ట్… దీపేందర్ కూడా ఫుల్ సపోర్ట్… అందుకే సీనియర్ల ఆటలు సాగలేదు… ‘‘మార్గాలు’’ తెలియాలండీ.,.!!
Share this Article