ఏదో చెప్పుకున్నారు కదా… ఈ సీజన్ ఇంతకుముందులా కాదు… అంతా ఉల్టా పుల్టా అని… ఏమీ లేదు… అదే రొడ్డుకొట్టుడు, తెలుగు సినిమా ఫార్ములా కథలాంటి షోయే ఈసారి కూడా…! గత సీజన్లకు దీనికి తేడా ఏమీ లేదు… నిజానికి గత సీజన్లకు మించిన దరిద్రం ఈ షో… కంటెస్టెంట్ల ఎంపిక పెద్ద ఫెయిల్యూర్… కనీసం ఎక్కువ మంది సభ్యుల ఎంపిక రాంగ్…
సరే, ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేశారు… ఉంచితే అలాగే ఏడుగురినీ ఉంచేస్తే అయిపోయేది… ఎలాగూ సెవన్త్ సీజన్ కదా… పదే పదే ఈ షోలో ఆ ఏడు అనే పదానికి ప్రాధాన్యం ఇచ్చారు కదా… పోనీ, గతంలోలాగా అయిదుగురిని ఉంచేసినా బాగుండేది… ఎటూ గాకుండా ఆరుగురిని ఫైనలిస్టుల్ని చేశారు… శివాజీకి తలొంచి చేసినట్టున్నారు…
ఆ శోభాశెట్టిని అలాగే ఉంచేస్తే ఆ ఏడు నంబర్ అలాగే ఉండేది… ఏమయ్యేది..? మహా అయితే ఆమెకు ఇచ్చే మరో వారం రెమ్యునరేషన్ అదనం… అంతేకదా… రెండు లక్షల చిల్లర… ఆమె ఉండాల్సింది… ఏడుపు, ఆనందం, ఆగ్రహం… అన్ని ఉద్వేగాలను ఆటలో ప్రదర్శించింది ఆమె… మిగతా సోది ఉత్సవ విగ్రహాలతో పోలిస్తే ఆమె మహా యాక్టివ్…
Ads
కావచ్చు… కొన్నిచోట్ల ఉడుకుమోత్తనం ప్రదర్శించవచ్చు… ఎక్కువ వాగి ఉండవచ్చు… కానీ అది ఆమె తత్వం… అయితే ఫైనలిస్టులుగా ఉన్న కన్నింగ్ శివాజీకన్నా… అపరిచితుడు ప్రశాంత్‌కన్నా… వెగటు సైగల వెక్కిరింపుల యావర్‌కన్నా చాలా నయం… అందుకే వోటింగు తక్కువ ఉన్నా సరే బిగ్‌బాస్ టీం ఆమెను కాపాడుతూ వచ్చింది… ఆమె లేక ఆటలో థ్రిల్, లైఫ్ లేదు… రేటింగ్స్ లేవు…
ఎస్… మధ్యలో వచ్చిన అర్జున్ గానీ, మొదటే వచ్చిన ప్రియాంక గానీ బ్యాలెన్స్‌డ్… ఎక్కడా తమ హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోలేదు… వాళ్లు అర్హులే… కానీ శివాజీ, ప్రశాంత్, యావర్‌లతో పోలిస్తే శోభ చాలా బెటర్… ఈ ఒక్క వారం దగ్గర బిగ్‌బాస్ ఎందుకు కక్కుర్తి పడ్డట్టు… ఇక్కడ ఓ విషయం చెప్పాలి…
ఇండియన్ ఐడల్ షో తెలుసు కదా… గత సీజన్‌లో మన షణ్ముఖ ప్రియ మొదటి నుంచీ ఇరగ్గొట్టేసింది… వచ్చీపోయే అతిథులు మెచ్చుకున్నారు… కానీ నార్త్ ఇండియన్ వోటర్లు (వాళ్లే కదా ఆ హిందీ పాటల షో చూసేది) ఆమెను టార్గెట్ చేశారు… ఫలితంగా వోట్లలో డౌన్ అయిపోయింది… ఐనాసరే ఆ షో నిర్వాహకులు అయిదుగురు బదులు ఆ సీజన్ షోలో ఆరుగురు ఫైనలిస్టుల్ని ఎంపిక చేశారు… అది షణ్ముఖ మెరిట్‌కు వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం…
అర్థమైంది కదా… ఈ సీజన్‌లో ఏడుగురు ఫైనలిస్టుల్ని ఎంపిక చేస్తే బాగుండేదని ఎందుకన్నానో… శివాజీ వంటి కేరక్టర్ చెప్పినట్టు సీజన్ నడవడం అంటేనే ఈసారి సీజన్ ఎంత నాసిరకమో అర్థమైంది… నిన్న కాస్త మందలించిన నాగార్జున ఈరోజుకు మళ్లీ శివాజీ ఆహా ఓహో అని కీర్తనకు దిగాడు… అంతగా శివాజీకి దాస్యం చేయాలా బిగ్‌బాస్ టీం… పోనీ, తనేమన్నా శుద్ధపూసా..? సోఫాజీగా పేరొందిన నాసిరకం ఆటగాడు… ఎస్, తను ఫైనలిస్టు కావడంకన్నా శోభాశెట్టిని అలాగే కొనసాగిస్తే బాగుండేది… ఆమె టెంపర్‌మెంట్ అదీ…! శివాజీని కూడా కడిగి పారేసింది… ఈ ఆటలో అసలైన విజేత ఆమే…!!
Share this Article