నిన్ననే కదా, ఆనంది అనే తెలుగు నటిని మన తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టిన విధానం చెప్పుకున్నాం… ఇప్పుడు జాంబిరెడ్డి సినిమాతో మళ్లీ మనవాళ్లను పలకరిస్తోంది… ఘర్కీ ముర్గీ దాల్ బరాబర్, ఇంటికోడి పప్పుతో సమానం అని మాట్లాడుకున్నాం కదా… మరో తెలుగు నటి ఉంది… కానీ టీవీ నటి… మన తెలుగు నటి… గుడివాడ… మొదట్లో ఒకటీఅరా చిన్నాచితకా సినిమాల్లో చేసినా, మన పప్పు దర్శకులు ఆమె నుంచి నటనను ఎక్స్ప్లోర్ చేయలేక వదిలేశారు… తరువాత టీవీల్లో నటిస్తూ ఇరగ్గొట్టేస్తోంది… అసలు మన సినిమా ఇండస్ట్రీకేమో కేరళ, తమిళ హీరోయిన్లు కావాలి… మన టీవీ ఇండస్ట్రీకేమో కన్నడ తారలు కావాలి… ఈ పోటీలో ఈమె భలే మార్కులు కొట్టేస్తోంది… ఆమె పేరు అనుశ్రీ… (అనూష సంతోష్)… ఆఫ్టరాల్ ఒక టీవీ నటికి ఈ రేంజ్ అభినందన అవసరమా అంటారా..? అవసరమే…
ఈమె గతంలో స్వాతిచినుకులుతో పాపులర్… తరువాత చాలా సీరియళ్లలో చేసింది… నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్స్ అయితే కుమ్మేస్తుంది… కృతకంగా కాదు, తెచ్చిపెట్టుకున్న విలనీ కాదు… ఆ పాత్రలోకి దూరిపోతుంది… (స్వాతి చినుకులు సీరియల్ డైరెక్టర్ రాజును పెళ్లిచేసుకుంది ఆమధ్య..,.) టీవీ సీరియళ్లలో తెలుగు తారలు చాలామంది ఉన్నారు, కష్టపడుతున్నారు… నిజానికి టీవీ సీరియళ్లు పెద్ద నాన్సెన్స్ కేటగిరీ… చెత్తా స్క్రిప్టుల దగ్గర్నుంచి కథనం దాకా… అసలు ఒక విజువల్ క్రియేటివ్ పీస్ ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉదాహరణల్లా ఉంటయ్… ఆ చర్చలోకి వద్దు గానీ… యాక్టర్స్ మాత్రం సూపర్బ్… ఎమోషన్స్ పలికించడంలో సినిమా అగ్రతారలు ఎందుకూ పనికిరారు… ఈ ఒక్క అనుశ్రీ అని మాత్రమే కాదు… దాదాపు అందరూ…
Ads
జీటీవీలో ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ వస్తోంది… నిజానికి ఇంట్రస్టింగు కథ… ఆ దర్శకుడికి దీన్ని తెలివిగా, తెలుగు నేటివిటీకి తగినట్టు టాకిల్ చేయడం తెలియడం లేదు… (ఇది రీమేక్ సీరియల్)… కానీ యాక్టర్స్ ఏక్‌సేఏక్… మాన్సీ అనే పిచ్చి పాత్ర చేస్తున్న వర్ష మినహా మిగతావారంతా బాగా చేస్తున్నారు… ప్రత్యేకించి జిండే పాత్రలో రాంజగన్ టాప్… హీరో ఆర్య పాత్రలో శ్రీరాం, హీరోయిన్ అను పాత్రలో వర్ష సహా అందరూ టాపర్లే.,. అను తండ్రి పాత్ర చేస్తున్న నటుడు అయితే జీవించేస్తాడు… ఇక మీరా పాత్ర… హీరో కంపెనీలో వైస్ ప్రసిడెంట్… తనను లవ్ చేస్తుంటుంది… వన్‌వే లవ్… మధ్యలో అను వచ్చి చేరి, హీరోను పడేస్తుంది… అదేదో పూర్వజన్మ గట్రా వేరే కథ ఉందిలెండి… అనును దూరం చేయడానికి మీరా ప్రయత్నిస్తూ ఉంటుంది… అనుపై కోపం, అసహనం, బాసుపై లవ్వు నిన్నటిదాకా నెెగెటివ్ షేడ్స్ రక్తికట్టించిన ఈ మీరా పాత్రధారి అనుశ్రీ… నిన్నటి ఎపిసోడ్లో జస్ట్, అయిదే అయిదు నిమిషాల చిన్న సీన్లో దంచేసింది… ఫుల్ డామినేట్ చేసేసింది…
ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఆ అయిదు నిమిషాల ఎపిసోడ్లో ఆ విలనీ కేరక్టర్ మీద ప్రేక్షకుడికి జాలి కలిగేలా చేసేసింది… రాంజగన్, శ్రీరాం, వర్ష ఎట్సెట్రా అందరి నుంచీ సీరియల్‌ను అనుశ్రీ ఒకేసారి హైజాక్ చేసేసింది… బాసుపై ప్రేమ భగ్నం కావడం, తలపెట్టిన కుట్రను బాసే కనిపెట్టడం, కొలువు పోగొట్టుకునే పరిస్థితి, తెగించి తన లవ్వును బాస్‌కు చెప్పేసి, తప్పు ఒప్పుకోకుండా, తెలిసే చేశానంటూ సమర్థించుకోవడం… గుడ్… మామూలు డైలాగులకు కూడా ఎమోషన్స్ భలే పలికించేసింది… ఆఫ్టరాల్ ఓ సీరియల్ నటికి అంత అభినందనా అని మళ్లీ అడక్కండి… ఆ సీరియల్ జీవాడి టాప్ జాబితాలో నంబర్ వన్… మాటీవీలో చిరాకు పుట్టిస్తున్న కార్తీకదీపం, గృహలక్ష్మి వంటి సీరియళ్లతో పోలిస్తే ప్రేక్షకులు ప్రేమ ఎంత మధురం వైపు మళ్లుతున్నారు… అదీ, అందుకని లైట్ తీసుకోలేం కదా… అన్నట్టు… బహుశా మీరా పాత్రకు ముగింపే కావచ్చు… దాగుడుమూతలు అయిపోయాయి కదా… ఇక కథ నేరుగా ‘రాజనందిని’ అనే పూర్వజన్మ వైపు పరుగులు తీయడమే…!!
Share this Article