తెలంగాణ ఎన్నికల్లో వేడి పెరిగేకొద్దీ సహజంగానే టీవీ రేటింగ్స్ పెరుగుతుంటయ్… పెద్దగా టీవీ వార్తలను పట్టించుకోని జనం కూడా ఎన్నికల వేళ అప్పుడప్పుడూ న్యూస్ చానెళ్లను ట్యూన్ చేస్తుంటారు… ఆ ప్రజెంటేషన్ల తీరును అసహ్యించుకుంటూనే చూస్తారు… జనం చూస్తున్నారు కదాని న్యూస్ చానెళ్లు మరిన్ని వెధవ పోకడలకు పోతాయి… ఇది మరీ సహజం… జనం మా ప్రయోగాల్ని మెచ్చుకుంటున్నారనే భ్రమ అది…
సరే, ఎలాగైతేనేం… రేటింగ్స్ మాత్రం పెరిగాయి… అంతకుముందు వారంకన్నా గత వారం టీవీ రేటింగ్స్ ఉవ్వెత్తున ఎగిసిపడ్డయ్… సహజమే కదా… కానీ ఈసారి విశేషం ఏమిటంటే… నానాటికీ దిగజారిపోతున్న టీవీ9 రేటింగ్స్ హఠాత్తుగా పీటీ ఉష వేగాన్ని అందుకుని, ఇన్నాళ్లూ తనను కిందకు తొక్కి అగ్రస్థానాన్ని అనుభవిస్తున్న ఎన్టీవీని కూడా దాటేసి మళ్లీ నంబర్ వన్ స్టేజీకి వచ్చేసింది… అబ్బే, ఈ రేటింగ్స్ అన్నీ బోగస్ అని కొట్టిపడేస్తారా..? పైగా ఈ నంబర్ వన్, నంబర్ టూ అటూ ఇటూ మారుతుంటయ్, పెద్ద విశేషం ఏముంది అంటారా..?
అంతకుముందువారంకన్నా గతవారం టీవీ9 ఉద్దరించిందేముంది అంటారా..? టీవీ రేటింగ్స్ హేతువుకు అందవు… అదంతే… ఓసారి ఈ చార్ట్ చూడండి…
Ads
అంతకుముందు వారం, అనగా 48వ వారం… టీవీ9 75 అయితే ఎన్టీవీ 83… అంటే 8 పాయింట్లు ఎక్కువ… కానీ ఒకేసారి టీవీ9 106 జీఆర్పీలకు ఎగబాకింది… అంటే అంతకుముందు వారంతో పోలిస్తే ఏకంగా 31 పాయింట్లు అధికం… అంటే ఒకేవారంలో దాదాపు 40 శాతం దాకా వృద్ధి… నమ్మొచ్చా అంటారా..? ఏమో, మీ ఇష్టం… ఇదేసమయంలో ఎన్టీవీ మాత్రం కేవలం 13 పాయింట్లు అదనంగా సంపాదించుకుంది… ఇదే రేటింగ్ భాషలో చెప్పాలంటే ఎన్నికల కవరేజీలో ఎన్టీవీకన్నా టీవీ9 కవరేజీ బాగుందని అనుకోవాలా..?
అఫ్‌కోర్స్, అన్ని చానెళ్ల రేటింగ్సూ పెరిగాయి… ఐతే ఎవరి రేటింగ్స్ ఎంతలా పెరిగాయనేదే పరిశీలనాంశం… కేసీయార్ మీద విపరీతమైన వ్యతిరేకత కనబడుతున్న వాతావరణంలో కూడా, ఆయన సొంత భజన చానెల్ టీన్యూస్ కూడా ఒక పాయింట్ అదనంగా సంపాదించుకుంది… ఈ పోటలో ఫాఫం, టీవీ5 పెద్దగా రేటింగ్స్ వృద్ధిని సంపాదించలేకపోయింది… చాలా నాసిరకం కవరేజీ, ప్రజెంటేషన్… ప్రత్యేకించి ఒక డిబేట్ ప్రజెంటర్ మాట తీరు, ఆలోచన ధోరణి ఆ చానెల్ రేటింగ్స్‌కు తీవ్రమైన దెబ్బ అంటుంటారు చాలామంది…
తెలుగుదేశం చానెల్‌గా పేర్కొనబడే మరో చానెల్ ఏబీఎన్, వైసీపీ అధికారిక చానెల్ సాక్షి టీవీ మాత్రం సేమ్ రేటింగ్స్… కాకపోతే నంబర్ వన్ స్థానంలో ఉన్న చానెల్‌కు మూడోవంతు దూరంలో…!! చెప్పనేలేదు కదా… ఈ 49 వారం అంటే ఫస్ట్ డిసెంబరు వరకే… ఎన్నికల ఫలితాలు వెలువడిన 3వ తారీఖు, కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు, కాంగ్రెస్ సీనియర్ల తిరకాసులు ఎట్సెట్రా 50 వ వారంలో వస్తాయి, అంటే వచ్చే వారం ఆ రేటింగ్స్ వెలువడుతాయి… సో, వచ్చేవారం రేటింగ్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయేమో… చూద్దాం…
Share this Article