Pratapreddy Kasula …….. కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ (Andhra Pradesh assembly Elections 2023)కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YSR Congress) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) అనుభవాన్ని దృష్టిలో పెట్టుకని ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించినట్లు అర్థమవుతున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana assembly election results 2023) కేసీఆర్ చేసిన పొరపాటు తాను చేయకూడదని జగన్ అనుకుంటున్నట్లు అర్థమవుతున్నది. పనితీరు బాగాలేని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్యెల్యేలను మార్చేందుకు వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు.
అధికారికంగా బిజెపి (BJP)తో టిడిపి పొత్తు లేకపోయినప్పటికీ మూడు పార్టీలు ఓ కూటమిగానే జగన్‌ను ఎదుర్కుంటాయని అర్థమవుతున్నది. జనసేన, టిడిపి మధ్య అధికారికంగా పొత్తు ఉంది. బిజెపిని తన దారిలోకి తేవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి (daggubati Purandheswari) నియామకం అందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు…. – కాసుల ప్రతాపరెడ్డి
Share this Article
Ads