సరే… బిగ్‌బాస్ షో ఎండింగ్‌కు వచ్చింది… ఆదివారం ఫినాలే… మహేశ్ బాబు చీఫ్ గెస్ట్… డాన్సులు, హంగామా ఉంటుంది… సాయంత్రం 7 గంటలకే స్టార్ట్… అన్నీ వోకే… ముందుగా అర్జున్‌ను ఎలిమినేట్ చేస్తారట… వోకే… తరువాత రవితేజ వచ్చి ప్రియాంకను ఎలిమినేట్ చేసి వేదిక మీదకు తీసుకొస్తాడట… వోకే…
యావర్ ఏదో 15 లక్షలకు టెంప్టయ్యాడని, తీసుకుని మధ్యలోనే నిష్క్రమించాడనీ కొన్ని వార్తలు… సరే, ఏదో ఒకటి… తనెలాగూ టాప్ త్రీ ఎలాగూ కాదు… అది తెలిసి డబ్బుకే వోటేశాడేమో… వోటింగులో చివరలో అమర్‌దీప్ శివాజీని మూడో స్థానానికి తోసేసి, తను సెకండ్ ప్లేసులో నిలిచాడట… అంటే రన్నరప్… కామన్ మ్యాన్ పేరిట హౌజులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటిస్తారట… ఇవన్నీ వోకే…
(కాదు, కాదు, అమర్, ప్రశాంత్ నడుమ టఫ్ ఫైట్ ఉంది, అది ఆదివారం షోలోనే ప్రకటిస్తారు అంటున్నారు… గుడ్.., అయితే ఇద్దరిలో ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదు… దొందూ దొందే… కాకపోతే అమర్ గెలిస్తే కాస్త బెటర్, పల్లవి ప్రశాంత్ శివాజీ అసిస్టెంట్‌గా ఆడాడు తప్ప అమర్‌లాగా ఇండిపెండెంట్ ఆట ఆడలేదు…)
నిజానికి శివాజీ తన బూతులు, పెత్తనాలతో వోటింగ్ శాతాన్ని తగ్గించుకున్నాడు… హౌజుకు తన ఎంపికే కరెక్టు కాదు… సోఫాజీగా పిలవబడ్డాడు… ఇతర కంటెస్టెంట్లకన్నా ఏజ్ గ్యాప్… పెత్తందారీ పోకడ… ఓ గ్యాంగ్ మెయింటెయిన్ చేయడం… ఇవన్నీ బిగ్‌బాస్ ఎందుకు సహించాడో తెలియదు… ప్రత్యేకించి శోభాశెట్టి, ప్రియాంక జైన్‌ల మీద విషం కక్కాడు శివాజీ… విపరీతమైన మగవివక్షను కనబరిచాడు…
Ads
సరే, ఇంకా నయం, తననే విజేతను చేయలేదు… ఏముంది..? బిగ్‌బాస్ టీం ఏదనుకుంటే అది చేయగలదు కదా… శివాజీ చేతుల్లో పడకుండా బిగ్‌బాస్ ట్రోఫీ తన ఇజ్జత్ తాను కాపాడుకుంది… గుడ్… యావర్ కొద్దివారాలుగా యాక్టివ్‌గా లేడు, శివాజీ ఏది చెబితే అది చేయడం తప్ప మరో పని లేదు… సో, తన ఎలిమినేషన్ కూడా వాజీబే… అనగా, సబబే… (పనికిమాలిన వెధవగా పదే పదే శివాజీతో బూతులు తిట్టించుకున్న అమర్‌దీప్ అదే శివాజీని కిందకు నెట్టేయడం ద్వారా శివాజీ మీద గెలుపు మాత్రం సాధించాడు అమర్…)
అమర్‌దీప్ కూడా రకరకాల షేడ్స్ చూపించాడు… అందరినీ వాడుకున్నాడు… మొత్తానికి టాప్ టు దాకా వచ్చాడు… సర్లే, తన స్ట్రాటజీ తనది… పల్లవి ప్రశాంతేమో ఓ అపరిచితుడు… రైతుబిడ్డ అనే సెంటిమెంట్ ప్రయోగిస్తూ, శివాజీ పక్కన ఓ పాలేరుగా వ్యవహరిస్తూ… అసలు తనకు ఈ సీజన్ విజేత అయ్యే అర్హత ఉందా, లేక రన్నరప్ సరిపోతుందా వంటి చర్చకన్నా… అర్జున్, ప్రియాంకలకు అన్యాయం జరిగినట్టే లెక్క… ఎందుకంటే… మిగతా నలుగురితో పోలిస్తే ఆ ఇద్దరి ఆటతీరు హుందాగా ఉంది, పద్ధతిగా ఉంది, ఒకటీరెండు సందర్భాల్లో తప్ప సంస్కారాన్ని కూడా కోల్పోలేదు…
సరే, అర్జున్ మధ్యలో వచ్చాడు కాబట్టి అంతిమ విజేత కావడం కరెక్టు కాదు అనుకుందాం… మరి ప్రియాంక జైన్..? ఎస్, ఆమె అసలైన నైతిక విజేత… జనం వోట్లు తక్కువ వేశారు గట్రా కారణాలు ఇక్కడ వేస్ట్… తోటి మగవాళ్లకు దీటుగా ఫిజికల్ టాస్కులు ఆడింది ఆమె… సీజన్ చివరి దాకా నిలిచింది… వంట బాధ్యత బాగా మోసింది… ఎక్కడా మాట తూలలేదు… వెకిలి వేషాలకూ దిగలేదు… నామినేషన్ల సమయంలో కూడా బ్యాలెన్స్ కోల్పోలేదు…
నిజానికి శోభాశెట్టి, ప్రియాంక లేకపోతే ఈ సీజన్‌లో అసలు లైఫే లేదు… వాళ్లతోనే ఆట రక్తికట్టింది… లేడీ కంటెస్టెంట్లు అయినా సరే టెంపర్ కోల్పోలేదు… ఢీ అంటే ఢీ అన్నట్టుగా నిలబడ్డారు… శోభ పలు సందర్భాల్లో ప్రేక్షకులకు చిరాకెత్తించవచ్చుగాక… కానీ ప్రియాంక డిగ్నిఫైడ్‌గా ఫినాలే చేరింది… అంతే హుందాగా నిష్క్రమించింది… ఎస్… ఈ సీజన్ అసలైన నైతిక విజేత ఆమే… ఆమే…!! అన్ని భాషల్లో కలిపి కంటెస్టెంట్లు, సీజన్లు వస్తుంటయ్ పోతుంటయ్… కొందరే తమదైన ముద్రలు వేయగలరు..!!
Share this Article