సందేహించిందే జరిగిపోయింది… ఇద్దరు ఆంధ్రా అధికారులకు కేంద్రం ఐఏఎస్ హోదా కట్టబెట్టింది… మరి కేసీయార్ చేసిన దగా ఏమిటీ అంటారా..? ఆ పెద్ద దొర పంపించిన పది మంది జాబితాలో ముగ్గురు ఏపీ వాళ్లే… తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనేమో… ఆ ముగ్గురిలో ఇద్దరికి మోడీ ప్రభుత్వం టిక్ పెట్టింది… ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ అని మళ్లీ మార్చి, తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కడతాడట…
ఇదీ గెజిట్… అసలు విషయం ఏమిటీ అంటారా..? ఇదుగో… మొన్నామధ్య చెప్పుకున్నదే… మరోసారి చదివితే సరి…
Ads
తెలంగాణ గోచీ గొంగడి అంటూ తెల్లారిలేస్తే… తెలంగాణ ప్రయోజనాలు అని పాటపాడుతూ ఇన్నేళ్లూ పబ్బం గడుపుకున్నది కేసీయార్ పార్టీ, ప్రభుత్వం… బయటికి చెప్పేది ఒకటి, ఆచరణలో జరిగేది మరొకటి… అలా బాధపడుతున్న అనేక సెక్షన్లకు ఇప్పటి కొత్త సీఎం రేవంత్ మీద బోలెడు నమ్మకం, ఆశలు… అందులో సీనియర్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు… రేవంత్ రెడ్డి గనుక తక్షణం దృష్టి పెడితే, కేసీయార్ చేయబోయిన దగాను గనుక సరిదిద్దితే రాష్ట్ర అధికార యంత్రాంగం మెప్పు పొందే చాన్స్ ఉంది…
వివరాల్లోకి వెళ్తే… రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులోని అధికారుల మెరిట్ పరీక్షించి దాదాపు ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వాళ్లకు ఐఏఎస్ హోదా ఇస్తుంది… (కన్‌ఫర్డ్ ఐఏఎస్)… రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నవాళ్లకు ఐఏఎస్ అనేది ఓ కల… కనీసం నాలుగు రోజులు ఆ హోదాలో పనిచేసి రిటైర్ అయినా సరే ఓ గౌరవంగా భావిస్తారు… దాని విలువ అలాంటిది… పోయినసారి రాష్ట్రం నుంచి 25 మంది పేర్లను కేంద్రానికి పంపించారు… 1ః5 పద్ధతిలో అయిదుగురు ఎంపికయ్యారు…
ఈసారి జాబితా ప్రిపేర్ చేసినప్పుడు అలా మిగిలిపోయిన ఆ 20 మంది పేర్లను కూడా కన్సిడర్ చేయాలి… చేయడం న్యాయం… ఎందుకంటే… ఎంపిక కాకపోతే మెరిట్ లేనట్టు కాదు, ఒకటీరెండు మార్కులతో అవకాశం తప్పిపోవచ్చు… కానీ ఈసారి రెండు ఐఏఎస్ పోస్టుల కోసం (హోదా మార్పిడి) పది మందితో జాబితా రూపొందితే… అందులో కొన్ని కొత్త పేర్లు వచ్చి చేరాయి… మెరిట్ లేదని కాదు… కానీ ఇలాంటి కీలకమైన పోస్టుల కోసం రూపొందించబడిన జాబితాలో కనీసం ఆంధ్రా, తెలంగాణ స్థానికతను, మూలాల్ని చూడాలనే సోయి కూడా లేదు పాత కేసీయార్ ప్రభుత్వానికి…
ఈ పది మందిలో ఒకరు గుంటూరు, మరొకరు కృష్ణా, ఇంకొకరు సీమలోని ఏదో జిల్లా… మిగతా ఏడుగురు తెలంగాణ… రేపు ఇంటర్వ్యూలు ఢిల్లీలో… ఆల్‌రెడీ చీఫ్ సెక్రెటరీ ఢిల్లీ వెళ్లినట్టే… బహుశా పొలిటికల్ సెక్రెటరీ కూడా వెంట ఉంటాడేమో… నిజానికి ఇక్కడ రేవంత్‌ను తప్పుపట్టేదేమీ లేదు… తన దాకా వెళ్లనట్టుంది ఈ ఇష్యూ… ఈ జాబితా పాత కేసీయార్ ప్రభుత్వ హయాంలో రూపొందిందే…
(ఇది పాత లిస్టు…)
ఒకవేళ ఆ ముగ్గురు తెలంగాణేతరుల నుంచే ఇద్దరు సెలక్టయితే ఇక తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ సీనియర్ అధికారులు తలలు ఎక్కడ పెట్టుకోవాలి… అందుకే రేవంత్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు… ఇప్పుడైనా అడ్డుపడే చాన్స్ ఉంది… చివరి క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇంటర్వ్యూలు ఆగిపోయిన ఉదాహరణలూ బోలెడు… బలమైన ఆంధ్రా లాబీయింగుకు చెక్ పడాలంటే కొత్త సీఎం మాత్రమే పూనుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులోని తెలంగాణ ఉన్నతాధికారుల భావన, ఆశ… కీలకమైన పదవుల్లో సర్వీస్ చేసే తెలంగాణ ఉన్నతాధికారుల విశ్వాసాన్ని చూరగొనడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఓ చాన్స్ ఇది…
ఆ ముగ్గురు తెలంగాణేతరుల నుంచే ఇద్దరు సెలక్టయ్యారు… జై తెలంగాణ… కాదు, కాదు… జై ఆంధ్రా… తెల్లారిలేస్తే తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని దీర్ఘాలు తీసి, గొప్పలు చెప్పే కేసీయార్ నిర్వాకం ఇది…
Share this Article