— అభ్యర్థుల ఖరారుపై వైసీసీ అధినేత జగన్ ఫోకస్
— ఇన్‌ఛార్జుల మార్పుపై నేరుగా నేతలతోనే చర్చలు
— సీఎం జగన్‌తో ఉభయ గోదావరి జిల్లాల నేతల భేటీ
— సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్
— సీఎంను కలిసిన వారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..
— కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్
— జగన్‌తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్…
— రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి
— పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, మంత్రి గుమ్మనూరు జయరాం
— సజ్జల, మిథున్‌రెడ్డితో భేటీ అయిన సీమ జిల్లాల ఎమ్మెల్యేలు
— కాపు రామచంద్రారెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్ , రఘురాంరెడ్డి…
— శంకర్ నారాయణతో చర్చలు జరిపిన సజ్జల, మిథున్‌రెడ్డి
— త్వరలో సీమ జిల్లాల్లోనూ పలువురు అభ్యర్థుల మార్పు
.
ఇదీ ఓ వాట్సప్ గ్రూపు వార్త… ఒక్కసారి నిన్నటి ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ స్టోరీ చూస్తారా..? ఇదుగో…
Ads
ఏందయ్యా జ్యోతి ఉద్దేశం అంటే… సారు గారు ఎవరికీ అందుబాటులో ఉండడు… గతంలో వైఎస్ గానీ, చంద్రబాబు గానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు అందుబాటులో ఉండేవాళ్లు… మధ్యలో ఎవరూ దళారులు ఉండరు… ఏ సమస్య వచ్చినా అటెండయ్యేవారు… కానీ జగన్ అలా కాదు, ఎవరికీ దొరకడు, చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలకూ దొరకడు… ఈ నాలుగున్నరేళ్లలో సగం మంది ఎమ్మెల్యేలు కూడా తనను కలవలేకపోయారు… ఇదీ వార్త…
తెలంగాణలో కుర్చీ దిగిపోయిన నియంత కేసీయార్ కూడా సేమ్ ఇలాగే… ఎవరికీ దర్శనం దొరికేది కాదు… జనానికి కూడా అంతే… చివరకు ఏమైంది..? అధికారానికి దూరమైపోయాడు… కాస్తోకూస్తో తమ పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులకు కేటీయార్ దొరికేవాడు… సేమ్, ఏపీలో ఇప్పుడు ఎవరు ప్రయత్నించినా సజ్జల మాత్రం దొరుకుతాడు… అంతే… సో, జగన్ కూడా కేసీయార్‌లాగే నష్టపోతాడు… చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే సీన్ లేదు…
దాదాపు 80 మంది వరకూ ‘‘టికెట్లు చించేసినట్టే’’… ఇదీ ఆంధ్రజ్యోతి భావన… ఆశ… ఆ కోణంలోనే నిన్న చంద్రబాబు ఎక్కడో అన్నాడు… 40, 50 మంది నాతో టచ్‌లో ఉన్నారు అని… ఈ టచ్‌లో ఉన్నారు అనే మైండ్ గేమ్ మూణ్నాలుగు దశాబ్దాల క్రితంది బాబూ… పైగా జగన్ వద్దనుకున్న కేరక్టర్లు నీ దగ్గరకు వస్తే నువ్వేం చేసుకుంటావ్… జనానికి దూరమైన వాళ్లనే కదా జగన్ ఏరేస్తున్నది… ఆ సరుకు నీకెందుకు..? ఇదంతా సరే, కానీ జనానికి గానీ, తన పార్టీ లీడర్లకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ దొరక్కపోవడం కరెక్టేనా..? ఈ ప్రశ్నకు జవాబు… ‘‘కరెక్ట్ కాదు’’… కానీ ఒక కేసీయార్, ఒక జగన్ ఎవరు చెప్పినా వినే బాపతు కాదుకదా… అదీ అసలు పాయింట్…!!
జగన్ నుంచి ఎప్పుడూ ఓ పలకరింపు లేకపోయినా సరే, కానీ ఇప్పుడు జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందీ అంటేనే ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు… పిలుస్తున్నారు, జగన్ లేదా సజ్జల ఎట్సెట్రా ఎవరో కౌన్సిలింగ్ చేసి, నో టికెట్ అని చెబుతున్నారు… సిట్టింగుల టికెట్లు మార్చడం జగన్‌కు రాజకీయ అవసరమే కావచ్చుగాక… కానీ ఇన్నాళ్లు అందరినీ జిల్లాల వారీగా పిలిచి, కూర్చోబెట్టి, ఎక్కడెక్కడ లోపాలున్నాయో ఎందుకు చెప్పలేదు..? ఎందుకు సమీక్షించలేదు..? ఒకేసారి తలలు ఎగురగొట్టేయడమేనా..? మరి నిన్ను నమ్ముకున్నందుకు ఫాయిదా ఏమున్నట్టు..?! ఖచ్చితంగా ఇది వైఎస్ బాపతు ఆలోచనాధోరణి కానే కాదు…!!
Share this Article