Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాన్ పాట ఎర్రగా పండింది కానీ… ఖైకే పాన్ బనారస్ వాలా తెరవెనుక కథ…

December 20, 2023 by M S R

శంకర్ జీ….   ఖైకే పాన్ బనారస్ వాలా (డాన్) పాట తెరవెనక కథ * * *

‘‘ఖైకే పాన్ బనారస్ వాలా, ఖులీ జాయే బ్యాండ్ అకల్ కా తాలా’’ అంటూ కిళ్లీ తింటూ హిందీ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాడిన పాట ఆనాటి నుండి ఈనాటి వరకూ దేశ వాసులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. పవిత్ర నగరమైన వారణాసి సందర్శించిన ప్రతీ ఒక్కరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బనారస్ పాన్‌వాలాలు చుట్టే పాన్ రుచి చూడాల్సిందే..

1978లో వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమా డాన్ సూపర్ హిట్ మూవీ. ఇది 1979లో ఎన్టీఆర్ హీరోగా యుగంధర్ పేరుతో తెలుగులో, 1980లో రజనీకాంత్ హీరోగా తమిళంలో, 1986లో మోహన్ లాల్ హీరోగా మళయాళంలో రీమేక్ చేయబడింది. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో మరోసారి రీమేక్ చేశారు. అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది.

Ads

సంగీతపరంగా కూడా విజయం సాధించిన ఈ సినిమాలో ఖైకే పాన్ బనారస్ వాలా పాట సంగీత దర్శకులు కళ్యాణ్ జీ, ఆనంద్ జీ ద్వయానికి, గాయకుడు కిషోర్ కుమార్ కీ మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఈ పాటని సినిమా అంతా పూర్తయ్యాక చిత్రీకరించి ఇరికించారు. మొదట రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఈ పాట లేదు.

ఈ చిత్రం దర్శకుడు చంద్ర బారోత్ కి కథానాయకుడు మనోజ్ కుమార్ జడ్జిమెంట్ మీద మంచి గురి. అందుకే ఎడిటింగ్ పూర్తయిన ఫైనల్ కాపీని మనోజ్ కుమార్ కి స్పెషల్ షో వేసి చూపించాడు. “అంతా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ చాలా వేగంగా ఉంది. నేను బాత్ రూమ్ కి వెళ్ళాల్సి వచ్చినా పోకుండా ఆగి సినిమా చూశాను. కొంచెం స్లో చేస్తే బాగుంటుంది” అన్నాడు మనోజ్ కుమార్ సినిమా పూర్తయ్యాక.

సెకండ్ హాఫ్ లో ఒక పాట పెట్టాలని సంగీత దర్శకులు కళ్యాణ్ జీ ఆనంద్ జీ లకు చెప్పాడు దర్శకుడు. 1973లో వచ్చిన దేవానంద్ సినిమా బనారసి బాబు సినిమా కోసం చేసి వాడకుండా ఉన్న ఒక ట్యూన్ వినిపించారు వారు. అది దర్శకుడుకి బాగా నచ్చింది. గీత రచయిత సమీర్ అప్పటికప్పుడు పాట రాశాడు.

“ఇదసలు హిందీ పాటేనా?” అన్నాడు కిషోర్ కుమార్ పాట విన్న వెంటనే. “ఖైకే అన్న పదం హిందీ పదం కాకపోయినా ఉత్తర ప్రదేశ్ లో విరివిగా వాడుకలో ఉంది. హీరో అమితాబ్ బచ్చన్ ఉత్తర ప్రదేశ్ వాడు కాబట్టి ఆయన మీద బాగానే ఉంటుంది” అని సర్ది చెప్పాడు సమీర్. “నేను ఈ పాట పాడలేనేమో, ఇంకెవరినైనా చూసుకోండి” అన్నాడు కిషోర్ కుమార్. దర్శకుడు, సంగీత దర్శకులు ససేమిరా అన్నారు. కిషోర్ తప్ప మరెవరూ ఆ పాటకి న్యాయం చేయలేరని వారికి నమ్మకం.

” ఒకే ఒక్క టేక్. బాగా వస్తే సరి. లేదంటే మరొకరితో పాడించుకోవాలి” అని కండీషన్ పెట్టి ఒప్పుకున్నాడు కిషోర్ కుమార్. రికార్డింగ్ సమయంలో కిళ్లీలు, ఉమ్ము వేసుకునే తొట్టి రికార్డింగ్ స్టూడియోలో అరేంజ్ చేశారు. నోటిలో కిళ్లీ నములుతూ, మధ్య మధ్యలో ఉమ్ముతూ పాట పాడాడు కిషోర్ కుమార్. ఒక్క టేక్ లో ఓకే అయిపోయింది.

పాట చిత్రీకరణ సమయంలో హీరో అమితాబ్ బచ్చన్ కూడా పెదవులు, నాలుక ఎర్రగా కనిపించాలని అదేపనిగా కిళ్లీలు నమిలాడు. పాట బాగా వచ్చినా అందులోని సున్నం దెబ్బకి ఆ తరువాత కొన్ని రోజులు నోటి మంటతో బాధ పడ్డారు… (ఓ అసందర్భ ప్రస్తావన… ఈ పాన్ పాట స్పూర్తితో అదేదో సినిమాలో చిరంజీవి చాయ్ పాట రాయించుకున్నాడు… అది ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions