సలార్ టికెట్ల కోసం కొట్టుకుంటున్న ఫ్యాన్స్… పలుచోట్ల పోలీసుల లాఠీఛార్జి… ఇలాంటి వార్తలు, వీడియోలు, ఫోటోలు వస్తున్న తరుణంలో… ఈ సినిమా అనుకోని పరిణామాలతో ఏకంగా సౌత్, నార్త్ ఇండస్ట్రీ ఘర్షణగా పరిణమిస్తోంది… అసలే పాన్ ఇండియా సినిమాలు నార్త్ సౌత్ పోటీగా మారాయి… బాలీవుడ్‌ను దాటేసి సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతోంది… వసూళ్లలో… హిట్లలో…
సలార్ హైప్ బాగా క్రియేటైంది… హొంబలె ప్రొడక్షన్స్ చిత్రం కావడం… కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ దీనికీ దర్శకుడు కావడం… ఆల్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో బాగా బజ్ ఏర్పడింది… పాన్ ఇండియా కాబట్టి దేశవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు… దీనికి పోటీగా షారూక్ ఖాన్ సినిమా డంకీ కూడా రిలీజవుతోంది… ఐతే..?
ప్రముఖ మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ నార్త్‌లో డంకీకి ప్రయారిటీ ఇచ్చి, ప్రభాస్ సినిమా సలార్‌కు థియేటర్లు సరిపడా ఇవ్వకపోవడంతో ఈ వివాదం మొదలైంది… నిజానికి ముందస్తు చర్చలు, ఒప్పందాల మేరకు సగం సగం పద్ధతిలో థియేటర్లను ఇవ్వాలి… కానీ పీవీఆర్ దాన్ని ఉల్లంఘించి షారూక్‌కు కొమ్ము కాయడం మొదలెట్టింది… షారూక్ టీం చాలా తెలివిగా పావులు కదుపుతూ డంకీ వసూళ్లు పెంచుకునేలా సలార్‌కు ధమ్కీ ఇవ్వడానికి పూనుకుంది…
Ads
ఇది అర్థమైంది హొంబలె వాళ్లకు… అదిప్పుడు సౌత్ ఇండియాలో ఫేమస్ నిర్మాణ సంస్థ… ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీస్ సలార్ రిలీజ్ బాధ్యతల్లో ఉంది… తెలుగు ఇండస్ట్రీలో సిండికేట్‌గా ఉన్న నలుగురు డిస్ట్రిబ్యూటర్లకు ఈ మైత్రి కంటగింపుగా మారింది కదా… అందుకే దొరికింది కదా సందు అనుకుని షారూక్ డంకీకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… ఇది సహజంగానే హొంబలెకు, మైత్రికి చిరాకెత్తించింది… దీంతో కొంతమేరకు వసూళ్లు పడిపోయినా సరే, ఈ సిండికేట్, షారూక్ టీం, పీవీఆర్‌ల పెత్తందారీ పోకడలను వ్యతిరేకించాలనే నిర్ణయించుకున్నాయి…
పీవీఆర్‌తోపాటు మిరాజ్ సినిమాస్ కూడా సేమ్ సలార్‌కు చెయ్యిస్తూ డంకీ కొమ్ము కాస్తోంది… అందుకని ఇక తప్పనిసరై ఆ థియేటర్లలో తమ సినిమా సలార్‌ను రిలీజ్ చేయబోవడం లేదని సంచలన ప్రకటన చేశారు హొంబలె బాధ్యులు… షారూక్‌తో మాట్లాడినప్పుడు అంతా సజావుగా స్పందించారు తప్ప ఫీల్డ్‌లో పక్షపాతం చూపిస్తున్నారనేది హొంబలె విమర్శ… ఆరోపణ… ఈ అన్‌ఫెయిర్ పద్ధతుల్ని ఆమోదించలేమని ధైర్యంగా ప్రకటించింది…
నిజానికి నార్త్‌లో పీవీఆర్ మల్టిప్లెక్స్ థియేటర్లు ఎక్కువ… సౌత్‌లో కూడా బాగానే ఉన్నాయి… వీటిల్లో సలార్ రిలీజ్ లేదంటే ప్రభాస్ సినిమా ప్రాథమిక వసూళ్లు దెబ్బతినే ప్రమాదముంది… అసలే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, ప్రిరిలీజ్ బిజినెస్‌లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్‌కు ఈ వరుస పరిణామాలు దెబ్బే… ఐనా సరే నార్త్ పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా హొంబలె నిర్మాతలు స్థిరంగా నిలబడుతున్నారు… గుడ్… పనిలోపనిగా తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురి సిండికేట్‌ను కూడా తొక్కితే ఓ పనైపోతుంది…!! ప్రస్తుతం జాతీయ స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చ…
Share this Article