Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విప్పండి ఆ పాత కట్లు… ఆమెను అలా తిరగనివ్వండి స్వేచ్ఛగా…

December 22, 2023 by M S R

ఉచితప్రయాణంతో సరికొత్త అవకాశాలు….. తెలంగాణాలో ఆర్ టీ సీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం మీద సామాజిక మాధ్యమాల నిండా జోకులే జోకులు. సరదా, కాలక్షేపం కబుర్లను పక్కనపెట్టి… సామాజిక కోణంలో నిజంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణలో అన్నిటినీ లాభనష్టాలతో చూడ్డానికి వీల్లేదు. అలా లాభనష్టాల తాత్కాలిక ప్రయోజనాలు దాటి మహిళల పురోగతికి… దీర్ఘకాలంలో సమాజ పురోగతికి ఉపయోగపడే పథకమిది.

దేశవ్యాప్తంగా ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటకలో ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టడానికి ముందు జరిపిన శాస్త్రీయ అధ్యయనాల్లో తేలిన అంశాలివి:-
1. పట్టణాలు, నగరాల్లో చిరు ఉద్యోగాలు చేసే పురుషులు ఇంటి నుండి సగటున 15 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లి వస్తుంటే…మహిళలు 5 కిలో మీటర్ల దూరం వరకే వెళ్లి వస్తున్నారు.
2. సగటున నెలకు 800 నుండి వెయ్యి రూపాయల వరకు ఉద్యోగం చేసే చోటుకు వెళ్లి రావడానికే ఖర్చవుతోంది.
3. మహిళలు ఎక్కువగా లేని బస్సుల్లో ఎక్కడానికి మహిళలు భయపడుతున్నారు.

ఈకోణంలో చూసినప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంత అవసరమో అర్థమవుతుంది. మహిళలకు దూరం ఒక భారం కాకుండా, ఒక భయం కాకుండా చేయగలిగితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతిమంగా అది సమాజం స్థిరంగా నిలబడడానికే ఊతమవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఒక సామాజిక పెట్టుబడిగా చూడాలన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణను కొందరు వ్యతిరేకిస్తూ… ఇలా ఇస్తూ పోతే… దేశం ఏమయిపోతుందని గుండెలు బాదుకుంటున్నారు.

Ads

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు- విల్ఫుల్ డిఫాల్టర్లు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలు ఒక పదేళ్లలో పాతిక లక్షల కోట్లు. ప్రభుత్వం రైట్ ఆఫ్ పేరిట నువ్వులు నీళ్లు వదులుకున్న కట్టని రుణాలు పది వేల కోట్లకు పైనే. వీటితో పోలిస్తే మహిళామణుల ఉచిత ప్రయాణానికి అయ్యే వ్యయభారం సముద్రంలో ఆవగింజంత కూడా కాకపోవచ్చు.

తరతరాలుగా వంటింటి కుందేళ్లని, అబలలని… అవమానించి కట్టి పడేశాము. విప్పండి కట్లు. తిరగనివ్వండి స్వేచ్ఛగా. వెతుక్కోనివ్వండి తగిన ఉద్యోగాలను. చేసుకోనివ్వండి ప్రయత్నాలను. నిలబడనివ్వండి వారి సొంత కాళ్లమీద. అందుకు ఈ ఉచిత ప్రయాణం ఉపయోగపడితే… అలక్ష్ములు మహాలక్ష్ములు అయితే… అంతకంటే కావాల్సిందేముంటుంది? -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions