ఎందుకలా అనిపించిందో తెలియదు కానీ… అనిపించింది…! ఆమధ్య నితిన్ హీరోగా నటించిన ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ ఓ చెత్తా సినిమా వచ్చింది కదా… ఫాఫం, హీరో ఇంకా నటన బేసిక్స్ దగ్గరే ఆగిపోయాడు… విలన్ కూడా సేమ్ సేమ్… డబుల్ ఫాఫం, శ్రీదేవి ఎందుకు అంగీకరించిందో ఈ సినిమా, తనూ చెడ్డ పేరు మూటగట్టుకుంది… ప్రేక్షకులు కూడా ఛీత్కరించారు… అడ్డగోలు ఫ్లాప్… నితిన్ మొహం మాడిపోయింది… అయితే..?
అందులో ఓ పాట ఉంది… నా పెట్టే తాళం… పచ్చి వెగటు… కంపు… బూతు… దానికి ఓ పోలీస్ స్టేషన్‌లో నితిన్‌తోపాటు తారలు సత్యశ్రీ, సోనియా సింగ్ చిల్లర గెంతులు, అనగా కొన్ని జాతర్లలో రికార్డింగ్ డాన్సుల్లో వేస్తుంటారు కదా, అలాంటి అసభ్య భంగిమలు… ఒకరిద్దరు జబర్దస్త్ యాక్టర్లు కూడా ఆ సీన్‌లో ఉంటారు…
(ఆ ఒరిజినల్ లిరిక్స్ ఇక్కడ జతచేయడం లేదు… టైప్ చేయడానికే గలీజుగా అనిపించి…) నిజానికి పదీపదిహేను రోజులైందేమో… పెద్దగా ఫాలో కాలేదు… కానీ ఏవో వేరే సంగతులు నెట్‌లో చెక్ చేస్తుంటే ఈ పాటకు సంబంధించిన వార్తలు కనిపించాయి… ట్రోలింగ్ కూడా భారీగా సాగింది… తెలుగు నెటిజనం పెద్ద ఎత్తున తిట్టిపోశారు… సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యుల విచక్షణకు ఓ వందనం… కానీ పబ్లిక్ సెన్సార్… గుడ్…
Ads
నిజానికి ఆ సోనియా సింగ్‌ను కాసేపు పక్కన పెట్టేయండి, తాను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు… తింగరి… కానీ సత్యశ్రీ వేరు… బూతులు జబర్దస్త్ షోలో చేసినా, అదీ చమ్మక్ చంద్ర టీంలో చేసినా ఎప్పుడూ ఓ మర్యాదరేఖను, అనగా లక్ష్మణరేఖను దాటలేదు… అలాంటిది ఒకేసారి ఇంతటి వెకిలి, వెగటు డాన్స్ ఎలా చేసిందని అందరూ విరుచుకుపడ్డారు…
ఏం, యాంకర్ యాంటీ బూతు డాన్సులు, పాత్రలు చేయలేదా..? రష్మి ఏం తక్కువా..? అని తిరగబడి తింగరి వ్యాఖ్యలతో ఎదురుదాడి ఏమీ చేయలేదు… ఏదో ఇంటర్వ్యూలో ‘‘నిజంగా ఆ పాట కంటెంట్ మొదట నాకు తెలియదు, తీరా చదివాక తెల్లారే షూటింగ్… ఆ బాపతు ఎక్స్‌ప్రెషన్స్ చేతకాలేదు, 15 టేకులు తిన్నాను… ఒప్పుకున్నాక తప్పేదెలా..? శేఖర్ మాస్టర్ వచ్చి అంగీకరించాక చేయకతప్పదు, పాత్రతోపాటు పాట రావడం నీకు గొప్పే కదా అన్నాడు…’ అని బాధపడిపోయింది…
తప్పే… పాట కంటెంట్ తెలియదనడం తప్పు… ఆమెకు ముందే తెలుసు… శేఖర్ మాస్టర్ నిజంగా అలా అని ఉంటే తనదీ శుద్ధ తప్పు… ఎలాగూ హీరోకు, దర్శకనిర్మాతలది వెగటు టేస్ట్… ఏదో సమర్థించుకోవడానికి ఇలా సాకులు చెప్పాల్సిన పనిలేదు, కానీ బాగా ఫీలైనట్టుంది… ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తాడేమో అని చూశాను… కనిపించలేదు… ఎందుకంటే..?
తన మాటలకు వాల్యూ ఉంటుంది… పంచ్ ఉంటుంది… గతంలో బన్నీ ఏదో ర్యాపిడో యాడ్ చేస్తూ సిటీ బస్సులకు నెెగెటివ్ మాటలు పలికితే సజ్జనార్ సీరియస్‌గా స్పందించాడు… వెంటనే ఆ యాడ్ నుంచి ఆ మాటలు కట్… మొన్నటి బిగ్‌బాస్ పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్‌లో కూడా సజ్జనార్ సీరియస్‌గా స్పందించాడు గనుకే పోలీసులు సీరియస్ యాక్షన్‌లోకి దిగారు… సరే, ఈ రెండు అంశాల్లోనూ తమ సంస్థ బస్సులకు నష్టం, దాడి అనే అంశాలున్నయ్… మరి ఈ పెట్టే, తాళం సంగతి ఎందుకంటారా..?
లేడీ కానిస్టేబుళ్లను మరీ చిల్లరగా చూపించారు… సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా ఉన్నా సరే, ఒరిజినల్‌గా పోలీస్ సర్వీస్ కదా… తమ విభాగానికి చెందిన లేడీ పోలీసులను అలా వెగటుగా చిత్రీకరిస్తే తను స్పందిస్తాడేమో అనిపించింది… అంతే… పోలీస్ అధికారుల సంఘమైనా స్పందిస్తే బాగుండేది… సరే, సినిమా డిజాస్టర్, ఇంకెవడూ చూడడు… కానీ ఓటీటీ, టీవీ ప్రసారాల్లో ఆ పాటను తీసివేయడం బెటర్… నిజానికి అది ఈ సినిమా టీం క్రియేషన్ ఏమీ కాదు… చాలా పాత పాట… యూట్యూబ్ వీడియోలు బోలెడున్నయ్… కానీ దాన్ని మరీ మహిళా పోలీసుల పట్ల ఎబ్బెట్టుగా చిత్రీకరించడం ఏమాత్రం బాగోలేదు…!!
Share this Article