సరే, ఏబీపీ-సీవోటర్ సర్వే చేసింది… ఎగ్జిట్ పోల్సే ఫ్లాపవుతున్నయ్, ఒక ఒపీనియన్ పోల్స్ నమ్మేదెలా అంటారా..? నిజమే… జస్ట్, ఒక మూడ్ చెప్పగలవేమో గానీ, అది సరైన శాస్త్రీయ ఫలితాన్ని సూచిస్తుందని ఎవరూ చెప్పలేరు… మరీ ప్రత్యేకంగా ఈ సంస్థ సాగించిన సర్వే పూర్తిగా నమ్మబుల్ కాదు…
బీజేపీ కూటమికి 295 నుంచి 335 సీట్లు… అంటే మినిమమ్ మ్యాగ్జిమమ్ నడుమ ఏకంగా 40 సీట్ల తేడా… ఇండి కూటమికి 165 నుంచి 205… సేమ్ లివరేజ్… వోకే, మూడ్ మాత్రమే చెప్పగలవు ఈ సర్వేలు అనుకున్నాం కాబట్టి సంఖ్యను కాసేపు వదిలేద్దాం… బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇండి కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని లేదా బెటర్ సీట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది…
బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ కలయిక బీజేపీ వోట్లను డామినేట్ చేస్తుందని నమ్ముదాం, తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఊపు కొనసాగుతుందనీ అనుకుందాం… (కానీ పార్లమెంటు వోట్లను ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటయ్)… మహారాష్ట్రలో షిండే, అజిత్ పవార్‌లను ముందుపెట్టి బీజేపీ ఆడుతున్న ఆట జనానికి నచ్చడం లేదనేదీ నిజమే అనుకుందాం… పంజాబ్‌లో కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయా..? డౌటే… అక్కడ ఖలిస్థానీ శక్తులు సపోర్ట్ చేసే ఆప్‌కే ఎక్కువ సీట్లు…
Ads
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే, ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 52 శాతం దాటిన వోట్లతో 22, 24 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 43 శాతంతో 4, 6 సీట్లు సాధించవచ్చునని ఈ సర్వే ఫలితం… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీన్ని జాగ్రత్తగా పరిగణనలోకి పెట్టుకోవాలి ఎప్పుడూ… ఇండి కూటమి ఎన్నికల నాటికి ఇలాగే కలిసి ఉంటాయని మెజారిటీ వోటర్లు నమ్మడం లేదనేది ఓ ఇంట్రస్టింగ్ పాయింట్… అయితే ఇవన్నీ నమ్మబులేనా..?
ఎందుకంటే..? ఈ సర్వే CATI Inteviews పద్దతిలో చేశారు… అంటే Computer Assisted Telephone Interviewing… అనగా కంప్యూటర్ ఈజీగా క్రోడీకరించుకునేలా, ఫోన్లలో సాగించిన ‘‘ఒకటి నొక్కండి, రెండు నొక్కండి’’ తరహా ఇంటర్వ్యూలు… సరే, వోటర్లుగా నిర్ధారించుకున్నవాళ్లకే ప్రశ్నలు వేశారు… కానీ 543 స్థానాల్లో కలిపి కేవలం 13,115 శాంపిల్ మాత్రమే… అంటే ఒక సీటుకు 24 మంది… ఆరో ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలు కాబట్టి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జస్ట్ 3 లేదా 4 మంది… ఇక అర్థం చేసుకోవచ్చు, ఎంత నాసిరకం సర్వే చేశారో… నిజానికి ఖచ్చితత్వం కావాలంటే పెద్ద శాంపిల్ కావాలి… ఆ శాంపిల్ కూడా రకరకాల కేటగిరీల మిక్స్ ఉండాలి… అంటే..?
కనీసం మూడు వయస్సులు, స్త్రీ, పురుష, పల్లె, పట్టణం, నగరం కవర్ కావడంతో పాటు దేశంలోని అన్ని ఏరియాలూ కవర్ కావాలి, పలురకాల వృత్తులు కవర్ కావాలి… విద్యార్హతలూ చూడాలి… 91 కోట్ల వోటర్లున్న ఈ దేశంలోని ఒక్కో అసెంబ్లీ సీటుకు ముగ్గురో నలుగురో కవరయ్యారంటే ఇన్నిరకాల కేటగిరీల అభిప్రాయంగా ఈ సర్వే ఫలితాన్ని చెప్పుకోవచ్చా..? పైగా కంప్యూటర్ ఆధారిత ఫోన్ సర్వేలను వోటర్లు పెద్దగా సీరియస్‌గా తీసుకోరు… అందుకే ఈ ఫ్లాష్ సర్వేలు జస్ట్, ఓవరాల్ మూడ్ మాత్రమే చెప్పగలవు… అంతే… ఇదీ అంతే…!! (ఒక్క మెతుకు చాలదా అనే సూత్రం ఇలాంటి సర్వేలకు వర్తించదు…)
Share this Article