అబ్బే, పోటీ చేయలేం, చేయబోం… నో, నో, బరిలో ఉంటాం… సింగరేణి (కాలేరు) కార్మికుల్లో బీఆర్ఎస్ నేత అంటే ఆమే… పోటీపై కవిత ఇదీ తడబాటు, తొట్రుపాటు… సింగరేణి కార్మికుల్లో తమ పార్టీ అనుబంధ సంఘం బొగ్గు గని కార్మికసంఘం దుస్థితి ఏమిటో ఆమెకు ముందే తెలుసు… పార్టీ మీద జనంలో విపరీతమైన వ్యతిరేకత కూడా తెలుసు… సో, ఫలితం కూడా తెలుసు…
అందుకే పోటీలో ఉండటం లేదని ప్రకటన… విచిత్రంగా… ఇదేం ప్రజాస్వామిక స్పూర్తి..? తెల్లారిలేస్తే బోలెడు నీతులు చెప్పే పార్టీ, రెండు టరమ్స్‌గా పదేళ్లుగా తమదే గుర్తింపు సంఘం… అలాంటిది ఈసారి పోటీకే వెనుకంజా..? అని విమర్శలు వెల్లువెత్తడంతో తప్పనిసరై నిలబడుతున్నట్టు ఏదో ప్రకటించింది గానీ అప్పటికే సంఘం బాధ్యులంతా కాంగ్రెస్, సీపీఐ సంఘాల పక్షాన చేరిపోయారు… బేషరతుగా ఎఐటీయూసీకి మద్దతు ప్రకటించారు కొన్ని డివిజన్లలో…
Ads
పదేళ్ల పెత్తనం పగిలిపోయింది… అసలు పలు డివిజన్లలో గులాబీ జెండా కనిపించలేదు… బాణం గుర్తు విరిగిపోయింది… మొత్తానికి పదేళ్ల పెత్తనం, అరాచకం బద్ధలైపోయింది… ఒక్కసారి ఆ రిజల్ట్ చూడండి… సోదిలోకి లేకుండా పోయింది బీఆర్ఎస్… అంత వ్యతిరేకత… అబ్బే, కేసీయార్ మస్తు చేశాడు గనులకు, గని కార్మికులకు… కానీ ఆ సంఘం నేతలే బ్రోకర్లుగా మారి, అవినీతికి పాల్పడ్డారు అని ఫేక్ సమర్థనలు కనిపించాయి సోషల్ మీడియాలో… ఒక ఉన్నతాధికారి ఏ బదిలీకి నోచకుండా అక్కడేఏళ్లుగా ఎలా తిష్ట వేసుకున్నాడు… దానికి బాధ్యులు ఎవరు..? కారణాలు ఏమిటి..? ఆ సంఘం తరఫున అనేక అక్రమాలు… ఎలా కొనసాగాయి..?
మొత్తం 37,468 వోట్లకు గాను బీఆర్ఎస్ గెలుచుకున్నది జస్ట్ 947 మాత్రమే… మరి ఎక్కడా సాధారణ ఎన్నికల్లో జాడాపత్తా ఉండని సీపీఐ ఇక్కడ ఎలా విజయఢంకా మోగించింది..? సేమ్, వామపక్షమే అయిన సీఐటీయూ ఇజ్జత్ కూడా పోయింది దేనికి..? దానికి ఆయా సంఘాల పనితీరు, గత ట్రాక్ రికార్డు కారణం… అవకాశం వచ్చింది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంఘం ఐఎన్‌టీయూసీని కూడా దాటేసింది… ఆరు డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరినా, మొత్తం వోట్లలో సీపీఐ ఆధిపత్యం కారణంగా ఇప్పుడిక అదే గుర్తింపు సంఘం… ఒక్క మణుగూరు డివిజన్‌లో మాత్రమే బీఆర్ఎస్ ఉనికి కనిపించింది… సీపీఐ
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్ఎస్‌కు ఇదీ పెద్ద షాకే… ఆరేడు జిల్లాల్లో ఆ పార్టీ దురవస్థకు ఇదీ సూచిక… పార్టీ పనితీరు, ఆ కుటుంబం వ్యవహారశైలి పట్ల ఆత్మపరిశీలన అవసరమని ఈ ఫలితాలు చెబుతున్నాయి… ఎస్, ఎన్నికలన్నాక గెలుపూ ఉంటుంది, ఓటమీ ఉంటుంది… కానీ పవర్‌లో ఉన్నప్పుడు మనమెలా ఉన్నామనే మథనమే అవసరం… దాని కోసమే అప్పుడప్పుడూ పరాజయం పలకరిస్తుంది… ఇప్పుడు బీఆర్ఎస్ కర్తవ్యమేమిటో ఈ పరాజయాలు, ఈ పరాభవాలే చెబుతున్నాయి…
ఈ సంఘాలే కాదు, బీజేపీ సహా పలు ఇతర పార్టీలకు చెందిన ఇతర ట్రేడ్ యూనియన్లు కూడా పోటీలో ఉన్నాయి… అది డెమొక్రటిక్ స్పిరిట్, మేం ఓడిపోతాం, పారిపోతాం, పోటీలో ఉండబోం అని ఖడ్గతిక్కనలు కాలేదు వాళ్లు… సింగరేణిలో ప్రస్తుత సిట్యుయేషన్ మీద ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కందుకూరి రమేశ్ బాబు రాసిన స్టోరీ లింక్ ఇదుగో… ఆసక్తి ఉన్నవాళ్లు మరోసారి చదవడం కోసం… బీఆర్ఎస్ ఎందుకు చతికిలపడిందో తెలుసుకోవడం కోసం… కాకపోతే చాలా పెద్ద స్టోరీ…
ఇది సింగరేణి కార్మికుల స్వేదపత్రం… పదేళ్ల పాలనలో ‘కాలేరు’ కథ…
(అవునూ, ఆర్టీసీ కార్మికులతో కేసీయార్ అప్పట్లో కబడ్డీ ఆడుకున్నాడు కదా… ఇప్పుడు ఆ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతాడా సీఎం రేవంత్ రెడ్డి సాబ్…) నవ్వొద్దు సుమా… ప్రజాపక్షం అనే ఓ సీపీఐ పత్రిక ఉంటుంది… ప్రింట్ స్థితి ఏమిటో గానీ ఈపేపర్ మాత్రం రెగ్యులర్‌గా వస్తుంటుంది… తమ పార్టీకి అద్భుత విజయం కదా, సెలబ్రేట్ చేసినట్టుగా ప్రజెంటేషన్ ఉండాలి కదా… ఈ క్లిప్పింగ్ చూడండి, ఏదో మొక్కుబడిగా, ఈ విజయం తమకు పెద్ద ఇష్టమేమీ లేదన్నట్టుగా…. ఫాఫం… (అవునూ, ఈ ఎన్నికలతో సీపీఎం ఏం నేర్చుకున్నట్టు..? బీఆర్ఎస్‌తో లోపాయికారీ వ్యవహారాలు జనానికి ఇష్టం లేదన్నట్టు…)
Share this Article