మన ఆంధ్రా నుంచి తమిళనాడు, మధురై ప్రాంతానికి వలస వెళ్లిన కుటుంబం అంటారు విజయకాంత్ పేరు చెప్పగానే… నిజానికి తను ఎన్ని సినిమాల్లో చేశాడు వంటి వివరాలు పెద్ద ఆసక్తికరమేమీ కాదు… ఓ సగటు సాదాసీదా టిపికల్ తమిళ హీరో టైపు… ఆ కథలు, ఆ ఫైట్లు, ఆ ఓవరాక్షన్, ఆ మొనాటనీ ఎట్సెట్రా తమిళనాడులో కాబట్టి చెలామణీ అయ్యాడు… అది లైట్ తీసుకుని, ఒక్కసారి తన రాజకీయ జీవితాన్ని పరికిస్తే మాత్రం కొంత ఇంట్రస్టింగ్ కంటెంట్ కనిపిస్తుంది…
తనకు మొదటి నుంచీ పొలిటికల్ యాంబిషన్స్ ఎక్కువ… తనను వెండి తెర చాన్నాళ్లు భరించలేదని తనకూ తెలుసు… అప్పట్లో సినిమా వాళ్ల ప్రభావం రాజకీయాలపై బాగా ఉండేది… ప్రత్యేకించి తమిళనాడులో జయలలిత, కరుణానిధి, అంతకుముందు ఎంజీఆర్… (అఫ్ కోర్స్, ఇప్పుడు సినిమావాళ్లను వోటర్లు దేకడం లేదు, అది వేరే సంగతి, ఆ కారణాల్లోకి వెళ్తే ఒడవదు, తెగదు… రీసెంట్ సంవత్సరాల్లో చేతులు, మూతులు కాల్చుకున్న సినిమా బడా హీరోల కథలు మనకు తెలిసిందే కదా… భవిష్యత్తు కూడా భిన్నంగా ఏమీ ఉండదు…)
విజయకాంత్ 2005లో పొలిటికల్ పార్టీ పెట్టాడు… దాని పేరు డీఎండీకే… 2006 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్లలోనూ పోటీచేశాడు… గెలిచింది ఎన్నో తెలుసా..? జస్ట్, ఒకటి… కేవలం ఒకే ఒకటి… కానీ లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పది శాతం వరకూ వోట్లు వచ్చాయి… విశేషమే… ఓ అధ్యయనంలో తను పొందిన వోట్లు అన్నాడీఎంకేకన్నా డీఎంకే నుంచే చీల్చినట్టు తేలింది…
Ads
2011 ఎన్నికలు వచ్చాయి… ఈసారి విజయకాంత్ చో రామస్వామి వంటి తన సన్నిహితుల సూచనల మేరకు కొన్ని ప్రయత్నాలు చేశాడు, ఏకంగా అన్నాడీఎంకే పొత్తు కుదిరింది… 41 సీట్లలో పోటీచేశాడు… డీఎంకే మీద అప్పట్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది వోటర్లలో… ఫలితంగా 41 సీట్లకు గాను ఏకంగా 29 స్థానాలు గెలుచుకున్నాడు… తన పొలిటికల్ కెరీర్‌లో పీక్ స్టేజ్ అది… తను డీఎంకేను మించి సీట్లు సాధించాడు… ఫలితంగా ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది…
ఎన్నికల తరువాత జయలలితకూ విజయకాత్‌కూ నడుమ విభేదాలు వచ్చాయి… రాకపోతేనే ఆశ్చర్యం… దాంతో అన్నాడీఎంకే నుంచి విడిపోయాడు… తరువాత 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో తను అన్నాడీఎంకే, డీఎంకేలు గాకుండా చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు… నరేంద్ర మోడీ కూడా ప్రోత్సహించాడు… కానీ ఆ ఎన్నికల్లో సాధించింది ఏమీ లేదు… కొందరు తన ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయింది…
ఇక 2016 ఎన్నికలకు వస్తే… డిపాజిట్లను కూడా కోల్పోయాడు.. ఒకచోట తను స్వయంగా 34 వేల వోట్లను మాత్రమే సాధించాడు… తరువాత సినిమా వాళ్ల ప్రభావం జనంపై లేకుండా పోయింది… విజయకాంత్ ప్రభ కూడా మాసిపోయింది… ఆరోగ్యం కూడా దెబ్బతింది, చివరకు చాన్నాళ్లు అవస్థపడి ఈరోజు కన్నుమూశాడు…
బహుశా విజయకాంత్ పరాజయాలు, కమల్ హాసన్ పరాభవాలు కళ్లారా చూస్తున్నందుకే కావచ్చు… రజినీకాంత్ సైతం రాజకీయాల్లోకి రాకుండా అవే కమర్షియల్, రొటీన్ ఫార్ములా వేషాలు వేస్తూ కాలం గడిపేస్తున్నాడు… తమిళనాడే కాదు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ… ఎక్కడా సినిమావాళ్లు సాధించిందేమీ లేదు రీసెంట్ ఇయర్స్‌లో… విజయకాంత్ రాజకీయ పతనం కూడా ఆ ధోరణిలో సాగిందే…!!
Share this Article