గుడ్… తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉమ్మడి పాలనలో అనేక అవమానాలకు గురై, ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని దోమకొండ గురించి ఈమధ్య అందరమూ చదువుతున్నాం, ఆమె వర్తమానం ఏమిటో కూడా తెలుసుకున్నాం… కేసీయార్ శకంలో ఆమె అడ్రస్ లేదు,
ఆమెలో నెలకొన్న వైరాగ్యం ఆమెను ఆధ్యాత్మిక మార్గం పట్టించింది… ఆమెకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నాడు… కానీ ఆమె వద్దంది… మళ్లీ ఆ పోలీస్ లాఠీ పట్టేది లేదని మర్యాదగానే తిరస్కరించింది… కానీ ఈ సొసైటీ కోసం ఒక కోరిక కోరతాను, నెరవేర్చండి అని ఓ బహిరంగలేఖలో సీఎంను కోరింది…
సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు టైమ్ ఇచ్చాడు, ఆమె చెప్పింది విన్నాడు… ఆమె ఇచ్చిన విజ్ఞాపనల్ని తీసుకున్నాడు… సరే, తరువాత ఫలితం ఏమిటనేది వేరే సంగతి… ఆమె చెప్పింది సావధానంగా వినడాన్ని అభినందిద్దాం… ఇంతకీ ఆమె తన గురించి ఏం అడిగింది..? డిపార్ట్‌మెంట్ గురించి ఏం అడిగింది..?
Ads
ముందుగా ఆమె తన గురించి ఏం అడిగిందో ఈ లేఖలు మీరే చదివి తెలుసుకోవచ్చు… విడిగా టైప్ చేయడం దేనికి..? ఆమె దస్తూరీ, శైలిలోనే చదవండి… (కాస్త జూమ్ చేసుకుంటే చదవొచ్చు, ప్రాబ్లం లేదు…)
‘‘ఓమ్ నమస్తే. మీడియా మిత్రుల కు ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గారిని కలిసి వేద కేంద్ర ఏర్పాటుకు సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు.
ఉద్యమ సమయంలో ప్రహసనంగా మారిన నా ఉద్యోగం పోలీస్ సంస్కరణలు అవసరం అని తెలియజేస్తుంది. అందుకే నాకు గతంలో జరిగిన అన్యాయాన్ని మరొకసారి తెలుపుతూ 16 పేజీల అంతరంగిక ( confidential ) రిపోర్ట్ కూడా వారికి అందజేయడం జరిగింది.
ఇది వారికి దిక్సూచిలా ఉపయోగపడగలదని భావిస్తున్నాను. నాలా సిస్టమ్ లో మరెవరూ బలి కావద్దు అని నా ఉద్దేశ్యం.అందుకే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది… వారికి కొన్ని వైదిక పుస్తకాలను బహూకరించడం జరిగింది…’’ అని తన ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేసింది ఆమె… ఆమె కోరిక నెరవేరాలని, హైదరాబాద్ సమీపంలోనే ఓ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, వేద కేంద్రం ఏర్పాటు కావాలనీ ఆశిద్దాం…
Share this Article