ప్రతిచోటా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తాం… ఫ్లైఓవర్లు బంద్, ఓఆర్ఆర్ బంద్… పట్టుబడితే అక్కడికక్కడే యూరిన్ టెస్టు కూడా… వెహికిల్ సీజ్… 10 వేల జరిమానా… 6 నెలల జైలుశిక్ష… డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడితే వీసాలకు ప్రాబ్లం… పాస్‌పోర్టులకు ప్రాబ్లం… జాబ్స్‌కు ప్రాబ్లం… మళ్లీ మళ్లీ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు……. ఇదుగో ఇలా ఎంతగా ఆంక్షలు పెట్టినా… ఎన్ని బెదిరింపులు చేసినా… అడుగడుగునా గొట్టాలు పట్టుకుని పోలీసులు ఊదించి ఊదించినా… ఏమీ ఆగలేదు…
ఎవరూ ఆగలేదు… నిజంగానే ఆశ్చర్యకరం… ఒక్క రాత్రి తాగి ఊగకపోతే పోయేదేమీ లేదు… కొత్త సంవత్సరం ఏమీ రాకుండా ఉండదు… ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలంటే వేరే సందర్భాలే దొరకవా..? అసలు పార్టీలు చేసుకోవడానికి ఓ సందర్భం అంటూ ఉండాలా..? సిటీ చుట్టూ రేవ్ పార్టీలు ఎన్ని జరగడం లేదు రోజూ… కానీ కొత్త సంవత్సరం వచ్చే ఆ అర్ధరాత్రే ఎందుకీ విచ్చలవిడి సంబరాలు…
Ads
ఈ టేబుల్ చూశారు కదా… 31 డిసెంబరు రాత్రి 8 గంటల నుంచి మొదలుపెట్టి వేల మందిని పరీక్షించారు… కొత్త సంవత్సరం పొద్దున 6 గంటల దాకా విరామం లేదు… ఎడతెరిపిలేని ఈ పరీక్షల్లో ఒక్క సైబరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 1241 కేసులు… ఈ సంఖ్య తక్కువేమీ కాదు… సిటీ, రాచకొండ కమిషనరేట్లు కూడా కలిపితే గత సంవత్సరం పట్టుబడిన కేసులకు నాలుగు కేసులు ఎక్కువే గానీ తక్కువ ఉండేట్టు లేదు… అంటే ఏమిటి అర్థం..?
మీరేమైనా చెప్పండి… మేం మారం… అని నగరవాసి చెబుతున్నట్టే… తాగుడూ ఆపం, ఊగుడూ ఆపం, తాగి డ్రైవింగూ ఆపం… నిజానికి గతంతో పోలిస్తే ఇప్పుడు ఊబర్, ర్యాపిడో ఎట్సెట్రా ట్యాక్సీ సర్వీస్ ఏ రాత్రయినా సరే అందుబాటులో ఉంటోంది… ఐనా సరే, ఈ కేసులు బరాబర్ నమోదు అవుతూనే ఉన్నయ్… ఈ టేబుల్ చూడండి… ఆయా ప్రాంతాల జనాభా, రద్దీని బట్టి కేసులు పట్టుబడ్డాయి… కూకట్‌పల్లి, మియాపూర్ ఫుల్లు… ప్రస్తుతం రిచ్, ఎడ్యకేటెడ్, హైప్రొఫైల్, ఎన్‌లైటెన్, సివిక్ ఏరియాగా పిలవబడే మియాపూర్‌లో ఏకంగా 253 కేసులు…
పట్టుబడ్డ వాళ్లలో సహజంగా టూవీలర్లే అధికం… ఇది ఎప్పుడూ ఉన్నదే… 18-45 ఏజ్ గ్రూపులో ఎక్కువ కేసులు కూడా సహజమే… ఒకరిద్దరు ఆడ లేడీస్ పట్టుబడటం కూడా అసాధారణం ఏమీ కాదు… కాకపోతే ఏకంగా 300-500 దాటి ఏబీసీ కౌంట్ కేసులు కూడా దొరికాయి… అంటే సదరు వాహనదారులు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి…
నిజానికి 100 ఎంఎల్ రక్తంలో 30 మిల్లీగ్రాముల వరకూ ఆల్కహాల్ ఉంటే వోకే… పర్మిషబుల్… దాటితే కేసులు, జరిమానాలు… సరే, పోసిన బీర్ల సంఖ్య, వేసిన పెగ్గుల సంఖ్యను బట్టి గాకుండా స్టామినా, బాడీ మెటబాలిజం, అంతకుముందురోజు మనం తీసుకున్న ఫుడ్డు, వయస్సు, మందు తీసుకునే వ్యవధి వంటి చాలా ఫ్యాక్టర్స్ ఈ బీఏసీ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి… ఎటొచ్చీ మన నగరవాసుల ధోరణి… తాటతీసినా సరే, తాగుడు ఆపేది లేదు అన్నట్టుగా…. ఏమాత్రం మార్పులేదు…!!
Share this Article