మలయాళ వెటరన్ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త పోస్టర్ చూశారు కదా… భ్రమయుగం అనే సినిమా తాలూకు పోస్టర్… అందులో తన పాత్ర ఆహార్యం అదిరిపోయింది… మెడలో రుద్రాక్షలు… తలపై కొమ్ములతో కూడాన కిరీటం… దేవతావతరంలో కళ్లు… అన్నీ మమ్ముట్టిని చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి…
ఇక ఆ పాత్ర కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు… ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నాటి కేరళ స్టోరీ… నాగరికత అంతగా లేని ఆ రోజుల్లోని ఓ కథ… అందులోనూ నెగెటివ్ షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు ఈ పాత్రకు… (పాత్ర తత్వం గురించిన క్లారిటీ లేదు, కావాలనే ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ కంటిన్యూ చేస్తున్నారు…) కాంతార ప్రీక్వెల్‌కు సంబంధించి రిషబ్ శెట్టి పోస్టర్ ఒకటి ఈమధ్య రిలీజ్ చేశారు కదా… ఇదీ దానిలాగే కనిపిస్తోంది… అంతెందుకు, కాంతార సినిమాలో ఇదే రిషబ్ శెట్టి ఓ జానపద దేవత రూపంలో వేసిన పాత్ర ఎంత సూపర్ హిట్టో తెలుసు కదా…
ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మమ్ముట్టి భ్రమయుగం సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారట… అంటే తెలుసు కదా… మలయాళం- తమిళం- తెలుగు- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల… కీలకమైన షూటింగ్ పార్ట్ పూర్తయిందట… ఈ పోస్టర్ కొత్తది తప్ప ఈ పాత్ర పరిచయం కొత్తదేమీ కాదు… గత ఆగస్టు నుంచీ వార్తల్లో ఉన్నదే… మమ్ముట్టిని కొత్తగా ఆవిష్కరించే ఆ పాత్ర అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది… సీన్ కట్ చేద్దాం…
Ads
ఒక్కసారి, జస్ట్, ఒక్కసారి మన తెలుగు వెటరన్ స్టారాధిస్టార్లను ఈ వేషాల్లో ఊహించుకొండి… చేస్తారా..? ఈ ప్రయోగాలు చేతనవుతాయా..? ఈ వేషం వేసినా సరే, సమాంతరంగా మరో పాత్ర ఉండాల్సిందే… డాన్సులు, వెగటు డైలాగులు, ఫైట్లు ఉండాల్సిందే… ఉదాహరణ, అఖండ… చిరంజీవి, వెంకటేష్, నాగార్జున… ఎవరైనా సరే, ఈ వేషం వేయగలరా..? సరిగ్గా పాత్రలో ఇమిడిపోగలరా..? నో, అంతటి బ్రహ్మయుగపు కేరళ దేవతైనా సరే, దెయ్యమైనా సరే… ఓ పోరిని హీరోయిన్‌గా వెతుక్కుని అమ్మడూ లెట్స్ డు కుమ్ముడూ అని గానీ, కుర్చీ మడతపెట్టీ అని గానీ స్టెప్పులేయాల్సిందే… మృగరాజులూ డాన్సాడాల్సిందే… అంజిలు ‘అమ్మో నీయమ్మ గొప్పదే’ అని పాడాల్సిందే… కుర్రతనంలోనే అన్నమయ్యలు, రామదాసుల్ని ఆవాహన చేసుకున్న నాగార్జున కూడా వయస్సు మీద పడేకొద్దీ ‘‘మడత నలగని హీరో’’ అవుతున్నాడు… నారప్పల్ని, దృశ్యాల్ని చూపించిన వెంకటేష్ సైతం ఎఫ్2, ఎఫ్3 వంటి తిక్క కామెడీకి మళ్లిపోయాడు…
అంతటి శివుడినే నేలకు దింపి మంజునాథలో సినిమా స్టెప్పులు వేయించారు కదా… స్టెప్పులు, ఫైట్లు, వెగటు స్పూఫులు, దిక్కుమాలిన పంచులు… ఇవి తప్ప మనకింకేమీ చేతకావు… పాత్ర ఏదైనా సరే మోడరన్ బ్రాండెడ్ వేషం వేయాల్సిందే… బండలు పగులగొట్టే గన్నులు పట్టుకుని రౌడీలను ఖగోళానికి దంచాల్సిందే… నరుకుడు, గుద్దుడు, కోసుడు… నెత్తురు… వాళ్లదాకా ఎందుకు..? సోకాల్డ్ పాపులర్ స్టార్లు నాని, విజయ్ దేవరకొండ, జూనియర్, రాంచరణ్, బన్నీ వంటి హీరోలకూ చేతకాదు… (బన్నీ, ఆర్ఆర్ఆర్ కాస్త నయం…) ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉండండి, రాబోయే మంచు కన్నప్ప ఎలా ఉండబోతోందో..?
అబ్బే, మన ఫ్యాన్స్ ఒప్పుకోరండీ, కమర్షియల్ బిజినెస్ వర్కవుట్ కాదండీ అని పిచ్చిసాకులు చెబుతారు… ఏం..? మలయాళంలో ఒక మోహన్‌లాల్‌కు, ఒక మమ్ముట్టికి ఫ్యాన్స్ లేరా..? ఆ సినిమాల బిజినెస్ జరగడం లేదా..? వాళ్లు చేసేదీ వినోదదందాయే కదా… కాకపోతే వాళ్లు ప్రయోగాలకు, భిన్నపాత్రలకు సాహసిస్తారు… వాళ్లు హీరోలు కాదు, నటులు… మనవాళ్లు నటులు కాదు, జస్ట్, హీరోలు… అంతదాకా ఎందుకు..? అమితాబ్‌ను మించిన స్టార్ ఉన్నాడా మన దేశంలో… ఈరోజుకూ ఏదైనా భిన్న వేషం ఇస్తానంటే పరుగెత్తుకొస్తాడు… దటీజ్ ప్యాషన్… నటన పట్ల కమిట్మెంట్…!!
Share this Article