మసూద్ అజహర్ చచ్చాడు! 2024 ఆంగ్ల సంవత్సరం మొదటి రోజున శుభవార్త వింటున్నాము! గుర్తు తెలియని వ్యక్తి చేసిన మరో హత్య!
జనవరి 1వ తారీఖు ఉదయం 5 గంటలకి పాకిస్థాన్ లోని బహావల్పూర్ లో మసీదు నుండి తిరిగి వస్తుండగా బాంబ్ దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు మసూద్ అజహర్!
నిన్నటి నుండి బహావల్ పూర్ బాంబ్ బ్లాస్ట్ దృశ్యాలు X (ట్విట్టర్) లో మొదట వైరల్ అయ్యి తరువాత ఇతర సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి! అన్ నోన్ వ్యక్తులు చేసిన, చేస్తున్న వరుస హత్యలలో ఇది 24 వది గత మూడు నెలల కాలంలో!
*****
1.విష ప్రయోగం వలన చనిపోయిన దావూద్ ఇబ్రహీం, బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన మసూద్ అజహర్ ల హత్యల వెనుక ఒక కారణం ఉంది.
2.దావూద్, మసూద్ అజహర్ ఇద్దరూ కొత్త రాజకీయ పార్టీలు పెడతామని ప్రకటించిన కొద్ది రోజులలోపే హత్య చేయబడ్డారు!
3.ఇంతవరకు జరుగుతున్న హత్యల విషయంలో పాకిస్తానీ గూఢచార సంస్థ ISI ఎలాంటి ప్రకటన చేయలేదు RAW హస్తం ఉందని అంటూ…
Ads
*****
గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అమెరికాలో పర్యటించాడు. బజ్వా తరువాత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అశిం మునీర్ మొదటిసారిగా అమెరికాలో పర్యటించాడు. అయితే ఒక సంవత్సరం పాటు ప్రయత్నించిన మీదట అమెరికా నుండి అనుమతి లభించింది ఆశిం మునీర్ కి…
తన పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ని కలవాలని ప్రయత్నించినా మొదట కేవలం సీనియర్ అధికారులతో మాత్రమే సమావేశానికి అనుమతించింది అమెరికా. కానీ తరువాత ఆంటోనీ బ్లింకేన్ తో సమావేశం అయ్యాడు మునీర్. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ దేశం అయిన పాకిస్థాన్ తో చర్చలు జరపడం మేలని భావించి బ్లింకెన్ తో సమావేశం అవడానికి అనుమతించింది అమెరికా…
పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ తో కూడా సమావేశం అయ్యాడు మునీర్! అటు ఆంటోనీ బ్లింకెన్ కానీ ఇటు పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ నుండి కానీ ఎలాంటి హామీలను రాబట్ట లేకపోయాడు అశీం మునీర్. ఇద్దరూ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ముందు పాకిస్థాన్ లో ఉన్న టెర్రర్ గ్రూపులను అణిచవేయమని!
*********
పిక్చర్ చాలా క్లియర్ గా కనబడుతోంది! మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే దావూద్ ఇబ్రహీం విష ప్రయోగం వలన చంపబడ్డాడు. ఆశీం మునీర్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత మసూద్ అజహర్ చచ్చాడు! ISI అండ దండ లేకుండా ఇవేవీ జరగవు! అసలు వీళ్ళకి ఎప్పటికప్పుడు ఇంటెలిజన్స్ సమాచారం ఇస్తూ, అంగరక్షకులని ఏర్పాటుచేసిది ISI మాత్రమే!
********
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పాకిస్థాన్ కి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తరుణంలో తన టెర్రర్ గ్రూపులను తానే నాశనం చేయాల్సిన గతి పట్టింది ISI కి… అమెరికా కూడా గట్టిగా పట్టు పడుతున్నది కనుక తప్పనిసరి పరిస్థితులలో హత్యలు జరిగాయి! అయితే ఇది భారత్ కి లాభిస్తుంది అనుకోవడం భ్రమ. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక మళ్లీ మామూలే! అమెరికా అవసరం కోసం ఇదంతా జరుగుతున్నది! ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాక్ టెర్రర్ గ్రూపులు హమాస్ తో కానీ ఇరాన్ తో కానీ చేతులు కలపకుండా ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పాకిస్థాన్ మీద తెస్తున్న వత్తిడి ఇది!— పోట్లూరి పార్థసారథి…
Share this Article