వచ్చె, వచ్చె… పాయె, పాయె… ఇవేం వార్తలు ఈనాడు వారూ…? అసలు ఈనాడులో పెద్దలు తమ పత్రికను తాము పొద్దున్నే ఓసారి చదువుతున్నారా అనే డౌట్ వస్తోంది… తమ పత్రికలో ఏం వార్తలు వస్తున్నాయో, అసలు తమ లైన్ ఏమిటో కూడా అర్థమవుతున్నట్టు లేదు… ఆంధ్రా ఎడిషన్‌లో రోజూ జగన్‌ను చంద్రబాబును మించి తిడుతున్నామా లేదానేదే ప్రధానం… అంతకుమించి ఇంకేమీ ఆలోచిస్తున్నట్టు లేదు ఫాఫం…
మార్గదర్శి కేసులో హైదరాబాద్ నుంచి ఎత్తేద్దామనుకున్నారు కదా… రామోజీరావు లక్ష నాగళ్ల దోస్త్ కేసీయార్ అత్యంత ఆప్తుడయ్యాడు కదా, నో, జగన్, నో, నేనొప్పుకోను అన్నాడు… దాంతో హైదరాబాద్ బయల్దేరిన సీఐడీ టీమ్స్ కూడా పీచే ముడ్ అనుకుని వాపస్ వెళ్లిపోయారట… ఇప్పుడు రేవంత్ ఏమంటాడో మళ్లీ సీఐడీ టీమ్స్ వస్తే..?
సరే, అవన్నీ వదిలేస్తే… మొన్నటిదాకా ఈనాడు, బీఆర్ఎస్ జాన్ జిగ్రీ… ఇప్పుడేమో రేవంత్ ముఖ్యమంత్రి… రామోజీరావుకేమో కాంగ్రెస్ అంటే ఆగర్భ మంట… జగన్ చాన్స్ తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిన విషయం… సరే, అవన్నీ వదిలేస్తే జగన్‌పై విషం, ద్వేషం పత్రికకు మకిలి అనుకుందాం… మరి తెలంగాణ ఎడిషన్‌కు ఏం పుట్టింది..? దాన్నయినా కాస్త ప్రొఫెషనల్‌గా నడిపించవచ్చు కదా… ఈ వార్తలు చూడండి…
Ads
29 నాడు ఓ హెడింగ్… పూర్తి విరుద్ధంగా ఈరోజు మరో హెడింగ్… పాయె పాయె, 18 లక్షల మంది ఉపాధికి గండి అని రాస్తారు ఒకరోజు… మళ్లీ మూణ్నాలుగు రోజుకే ఓహ్, ఉపాధి ఊపందుకుంది అంటాడు… ఇదేందిర భయ్… ఇంతకీ ఉపాధి హామీ పథకం బాగా నడుస్తోందా..? నడవడం లేదా..? అనే డౌట్ రాదా పాఠకులకు..? నవ్వుకోరా..?
సరే, రోజూ లక్ష మంది కూలీలు హాజరవుతున్నారు, గుడ్, ఊందుకుంది సరే… మరి ఈ 18 లక్షల మంది కడుపులను కొట్టే స్టోరీ ఏమిటి..? రాష్ట్రంలో దాదాపు కోటిమంది దాకా ఉపాధి కూలీలు ఉన్నారట, అందరికీ ఆధార్‌తో లింక్ చేయాలనీ, బ్యాంకు ఖాతాలతో కూడా లింక్ చేయాలనీ కేంద్రం ఆదేశించిందట, కానీ ఏవో ‘‘సాంకేతిక, ఇతరత్రా’’ కారణాలతో 18 లక్షల కూలీలను వాటితో లింక్ చేయలేకపోతున్నారట… వీళ్లను చూసీచూడనట్టు వదిలేయండీ అని రాష్ట్రం కోరిందట, కానీ కేంద్రం ససేమిరా అంటోందట, దాంతో వాళ్లందరి కడుపులు కొట్టినట్టవుతోందట… ఇదీ వార్త…
ఎస్, ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్‌లో బోలెడు అక్రమాలు సాగుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి… నిజానికి చాలాచోట్ల కూలీలకు ఇది నగదు పంపిణీ పథకం… నిర్మాణాత్మక కార్యక్రమాలే లేవని ఓ విమర్శ ఉంది… సరే, పేద వర్గాల్లో క్యాష్‌ను పంప్ చేస్తున్నారు, ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుందీ అనుకుందాం… కానీ బోగస్ కూలీల జాబితాల ప్రక్షాళన అవసరమే కదా… 82 లక్షల మంది కూలీలను ఆధార్‌తో, బ్యాంకు ఖాతాలతో లింక్ చేయగలిగినప్పుడు మిగతా వారికి ఎందుకు సాధ్యం కావడం లేదు..?
ఈ ప్రశ్న కదా జర్నలిస్టు ఆలోచించాల్సింది… ఆధార్ లేకపోతే కొత్తగా ఇవ్వండి, బ్యాంకు ఖాతాలు లేకపోతే కొత్తవి తెరవండి, లింక్ చేయండి, అవసరమైతే మెటీరియల్ కంపోనెంట్ పెట్టి, చెక్ డ్యాములు, గ్రామీణ రోడ్లు వంటివి చేపట్టండి… సమాజానికి ఉపయోగం, కూలీలకు ఉపాధి… గతంలో ఈనాడులో క్వాలిటీ సెల్ అనే విభాగం ఒకటి ఉండేది… ఇలాంటి వార్తల్ని పట్టుకునేది… ఫాఫం, అదేమైపోయిందో…!!
Share this Article