తెలుగు సినిమాలకు సంబంధించి ‘‘ఆ నలుగురు’’ అని ఓ సిండికేట్‌కు పేరు… అదొక మాఫియా… ప్రొడ్యూసర్స్ కమ్ బయర్స్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్ థియేటర్ ఓనర్స్… అన్నీ… వాళ్లు అనుకున్న సినిమాలే నడుస్తాయి… లేదంటే పడుకుంటాయి… కాదు, పడిపోతాయి… అలా తొక్కుతారు… ఆ మాఫియాను బ్రేక్ చేయడానికి వేరే శక్తులేమీ రంగంలోకి రావడం లేదు… ఈ నేపథ్యంలో…
ఒక సినిమా ఆకర్షిస్తోంది… దాని పేరు హను-మాన్… హీరోగా మారిన ఓ బాలనటుడి సినిమా… పేరు సజ్జా తేజ… నిజానికి దాన్ని తేజ కోణంలో చూడొద్దు… తను ఓ బడ్డింగ్ యాక్టర్, అంతే… ఆ సినిమాతోపాటు మరో నాలుగు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి సంక్రాంతి బరిలోకి… నిజానికి ఎవరికి ఎవరూ పోటీ కాదు, ఎవడి సరుకులో దమ్ముంటే అదే నిలబడుతుంది…
ఐదు స్ట్రెయిట్ సినిమాలతో పాటు మూడు డబ్బింగ్ సినిమాలు పోటీపడబోతున్నాయి… హను-మాన్‌తోపాటు మహేష్‌బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ, రవితేజ ఈగల్ కూడా ఉన్నాయి… నిజానికి ఆ స్టార్ హీరోల స్టేటస్‌తో పోలిస్తే తేజ ఎంత..? కానీ ఒక కోణంలో అప్పుడే తేజ ఆ నలుగురు స్టార్లను దాటేశాడు… సింపుల్‌గా చెప్పాలంటే…
Ads
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్‌బుక్ మై షోలో స్టార్ హీరోల కంటే హనుమాన్‌కు ఎక్కువగా క్రేజ్ ఉండటం గమనార్హం… (ఎట్‌లీస్ట్ ఈ కథనం రాసే సమయానికి…) బుక్ మై షో ఇంట్రెస్ట్ లిస్ట్‌లో హనుమాన్ సినిమాకు 182.2 కే లైక్స్ ఉన్నాయి… మహేష్‌బాబు గుంటూరు కారం సినిమాకు 182.1 కే లైక్స్ మాత్రమే… కాకపోతే మహేశ్ సినిమాకు ఉండే క్రేజు వేరు కదా, సో, హనుమాన్‌ను గుంటూరు కారం త్వరలో దాటేయడం ఖాయం… కానీ ఒక్కటి మాత్రం నిజం… చిన్న సినిమా అంటూ హను-మాన్‌ను తొక్కేయడానికి సినీమాఫియా ప్రయత్నిస్తూనే ఉంది…
సరే, మహేశ్ బాబు వోకే… మరి మిగతా ముగ్గురు హీరోల కథేమిటి..? ఎవడికీ పెద్ద ఆసక్తి లేదు వాళ్లపై… నిజంగా సరుకులో పంచ్ ఉంటే నిలబడతాయి, ఇప్పటికైతే సోయిలో లేవు వ్యూయర్స్ ఇంట్రస్ట్ కోణంలో… గుంటూరు కారం, హనుమాన్‌లకు దరిదాపుల్లో కూడా లేవు.. వెంకటేష్ సైంధవ్ సినిమాకు 65.7 కే లైక్స్, నా సామి రంగకు 43.6 కే లైక్స్ ఉన్నాయి… అతి తక్కువగా రవితేజ ఈగల్ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉన్నట్లు 20.1 కే ఆడియెన్స్ మాత్రమే లైక్స్ చేశారు…
మహేశ్ బాబు సినిమాకు ఎక్కువ థియేటర్లు అడ్జస్ట్ చేస్తున్నారు… కాస్తోకూస్తో ఇతర ముగ్గురు స్టార్లకూ ఎలాగోలా కాస్త చెప్పుకోదగిన సంఖ్యలోనే థియేటర్లను అడ్జస్ట్ చేస్తున్నారు… ఎటొచ్చీ హను-మాన్‌కే థియేటర్లు తక్కువ… పదే పదే సినిమా రిలీజును వాయిదా వేసుకోవాలని సిండికేట్ బెదిరిస్తోంది… ఐనా సరే, నిర్మాతలు మొండిగా నిలబడ్డారు… మహా అయితే దిల్ రాజు ఏం చేయగలడు…? ఇండస్ట్రీ నుంచి తరిమేస్తాడా..?
నిజానికి గుంటూరు కారం ట్రాక్ కూడా సజావుగా ఏమీ సాగలేదు… ఎవరో వచ్చి చేరారు, ఎవరో వదిలి వెళ్లిపోయారు… పాటలపై, ప్రత్యేకించి కుర్చీ పాటపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది… (యూట్యూబ్ వ్యూస్, లైక్స్ వదిలేయండి, అది మరో దందా…) కాకపోతే త్రివిక్రమ దర్శకత్వం కాబట్టి, అదీ ప్లస్ మహేశ్ స్టార్‌డం దానికి ఆకర్షణ… ఎలా చెబితే అలా ఎగిరే శ్రీలీల హీరోయిన్… వినిపించే వార్తలు, టీజర్ల ప్రకారం… మిగతా సినిమాల మీద నిజంగానే ప్రేక్షకులకు పెద్ద ఆసక్తేమీ లేదు… ప్రస్తుతానికి…!
చివరగా… హను-మాన్‌ను తెలుగు ఇండస్ట్రీ తొక్కవచ్చుగాక… కానీ అది పాన్-ఇండియా సినిమా… నార్త్‌లో ఈ టైపు ఫిక్షన్, ఫాంటసీకి ఇప్పుడు ట్రెండ్… పైగా గ్రాఫిక్ వర్క్ బాగా వచ్చిందని చెబుతున్నారు… ఒకవేళ తెలుగులో కూడా క్లిక్కయి, మన ఇండస్ట్రీ మంచి కోసం హిందీలో కూడా హిట్టయితే… సోకాల్డ్ టాలీవుడ్ మాఫియా మొహాలు మాడిపోతే చూద్దామని సగటు తెలుగు ప్రేక్షకుడికి బలంగా ఉంది… ఏమో, హనుమంతుడు ఏం చేస్తాడో…!!
Share this Article