Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ డేగ ఎందుకు భయపడింది..? ఫిబ్రవరి వైపు ఎందుకు ఎగిరిపోయింది..?

January 6, 2024 by M S R

రవితేజ సినిమా విడుదలను వాయిదా వేశారు… సంక్రాంతి తేదీ అనుకున్నది కాస్తా దూరంగా, అంటే ఫిబ్రవరి 9కు వెళ్లిపోయింది… అవును, ఎన్నాళ్లుగానో సంక్రాంతి బరిలోనే ఉంటామని చెబుతున్న ఆ సినిమా మేకర్స్ ఎందుకు రాజీపడ్డారు… దూరంగా ఎందుకు వెళ్లిపోయారు..?

హనుమాన్, నాసామిరంగ, సైంధవ్, గుంటూరుకారం సినిమాలతోపాటు రవితేజ సినిమా ఈగల్ కూడా బరిలో ఉండాల్సింది… కానీ అన్ని సినిమాలకూ థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమని నిర్మాతల మండలి చెప్పడంతో… ఈగల్ సినిమాను ఇండస్ట్రీ క్షేమం కోసం లేట్ రిలీజ్‌కు ఒప్పుకున్నారని వార్తలు రాయించేస్తున్నారు… రవితేజ ఔదార్యమని కూడా చప్పట్లు కొడుతున్నారు కొందరు… ఇండస్ట్రీలో ఔదార్యాలు వంటి మాటలకు చోటుండదు… ఇదంతా ఓ దందా, ప్రతి అడుగుకు డబ్బుల లెక్కలే ఉంటాయి…

ఫిబ్రవరిలో రిలీజ్ సెంటిమెంట్ పరంగా రవితేజకు కరెక్టు కాదు, గతంలో నాలుగు సినిమాలు ఢమాల్ అన్నాయి, మళ్లీ ఈ నిర్ణయం ఏమిటని ఫ్యాన్స్ బాధపడుతున్నారని మరికొన్ని వార్తలు…

Ads

అసలు విషయం అది కాదు… ఈ పోటీలో పడితే సినిమా ఇంకా నలిగిపోవడమే అనుకున్నట్టున్నారు… అసలే ప్రేక్షకుల ఆసక్తి కనిపించడం లేదు, బజ్ లేదు… బహుశా ఔట్‌పుట్ చూసుకున్నాక హీరోకు, నిర్మాత దర్శకులకే సినిమా ఏదో తేడా కొట్టినట్టు అనిపించినట్టుంది… అనుపమ, నవదీప్ కూడా రవితేజకు తోడుగా ఉన్నా సరే, ఈ నాణ్యతతో ఆ నాలుగు సినిమాలతో పోటీపడగలమా అనుకున్నట్టున్నారు… అందుకే కాస్త దూరం వెళ్లి, వేరే పెద్ద సినిమాలు లేని వాతావరణంలో రిలీజ్ చేసుకుని, గట్టెక్కవచ్చునని ఆశ… లేకపోతే పండుగ పోటీలో కొట్టుకుపోతాం అనే సందేహాలతో డ్రాప్…

పోనీ, సంక్రాంతి రోజులు పోయాక వారానికి రిలీజ్ చేసుకోవచ్చు కదా అంటారా..? నిజమే, అప్పుడు సోలో రిలీజ్… వేరే సినిమాలు లేవు, కానీ ఆ పెద్ద సినిమాలే నడుస్తుంటయ్, ఆ నాలుగులో ఏ రెండు హిట్టయినా జనం అటే వెళ్తారు… అందుకని ఫిబ్రవరి 9కు వెళ్లిపోయారు… అప్పుడు టిల్లు స్క్కేర్ మాత్రమే పోటీ… జొన్నలగడ్డ సిద్ధూతో ఫైట్ చేయడం రవితేజకు ఈజీ కదా…

తెలుగు సినిమా సిండికేట్ హనుమాన్‌ను ఎంత తొక్కడానికి ప్రయత్నిస్తున్నా సరే, థియేటర్లను ఇవ్వడం లేకపోయినా… వాళ్లకు తమ సినిమా మీద మాంచి నమ్మకం ఉంది… నార్త్‌లో కూడా వాళ్లకు బిజినెస్‌పరంగా ఉత్సాహం కనిపిస్తోంది… అందుకే వాళ్లు నిలబడ్డారు… దిల్ రాజును సైతం ఢీకొట్టడానికి రెడీ అయిపోయారు… అదీ టెంపర్‌మెంట్… నాసామిరంగ బిజినెస్ బాగానే జరిగింది గానీ నాగార్జున ఒక హిట్ కొట్టి ఎన్నేళ్లయింది..? పైగా తను చేస్తున్నవి టైంపాస్ పల్లీబఠానీ సినిమాలే కదా…

తోడుగా అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ వచ్చారు… కానీ వాళ్ల రేంజ్ చిన్నదే… పోనీ, హీరోయిన్లు..? కొత్త కొత్త వాళ్లు… ఐనాసరే, సంక్రాంతిపూట జనం ఖాళీగా ఉంటారు, సినిమాలు చూస్తారు, నాలుగు డబ్బులొస్తాయి, గట్టెక్కొచ్చు అనుకున్నారు ఆ మేకర్స్… రవితేజ సినిమా మేకర్స్ కనీసం ఆ దిశలో కూడా ఆలోచించలేకపోయారు… మరోవైపు వెంకటేష్ సినిమా మీద కూడా పెద్ద బజ్ లేదు… అదేదో దిక్కుమాలిన బూతుల వెబ్ సీరీస్ చేశాక వెంకటేశ్ తన ఇమేజీని చెడగొట్టుకున్నాడు…

చెప్పాల్సింది గుంటూరుకారం గురించి… ఫస్ట్ నుంచీ బోలెడు వివాదాలు, వార్తలు… చివరకు ఫ్యామిలీ ప్రేక్షకులు అభిమానించే మహేశ్ బాబు సైతం ‘కుర్చీ మడతబెట్టి…’ బాపతు బూతులు, ఆ స్టెప్పుల్లో ‘‘అదే’’ స్పురించేలా బాడీ లాంగ్వేజీ… వెకిలిగా ఉంది… ఐనా సరే, స్టార్ హీరో, త్రివిక్రమ్ దర్శకుడు, డిమాండ్‌లో ఉన్న శ్రీలీల హీరోయిన్… పైగా సిండికేట్ మద్దతు… ఐనా సరే… ఈరోజుకూ బుక్‌మైషో ‘‘ఇంట్రస్టుల’’ లెక్కల్లో హనుమాన్ కన్నా గుంటూరుకారం వెనుకబడి ఉంది…

ప్రస్తుతం ఈ సినిమాల ‘‘ఇంట్రస్టింగ్ రేటు’’ చూస్తే… హనుమాన్ 223.4 కే, గుంటూరుకారం 220.3 కే, సైంధవ్ 79.2 కే, నాసామిరంగ 50.4 కే, ఈగల్ 23 కే… అంటే రవితేజ సినిమా బజ్ మరీ ఎక్కడ కొట్టుకుంటున్నదో తెలుస్తోంది కదా… చివరకు సిద్ధూ సినిమా టిల్లు స్క్కేర్ కూడా 55.9 కే చూపిస్తోంది… (ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాని తేజ ఎక్కడ..? టాప్ స్టార్ మహేశ్ బాబు ఎక్కడ..?) అఫ్‌కోర్స్, సినిమాలో దమ్ముండాలే గానీ, అంతిమంగా మౌత్ టాకే సినిమాను నిలబెట్టాలి తప్ప ఈ లెక్కలన్నీ వేస్ట్… ఆ దమ్ముంటే పోటీపడే దమ్ము కూడా ఉంటుంది… ఈగల్‌కు లోపించింది అదే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
  • తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
  • బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
  • బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..
  • జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
  • వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions