ఉన్నదే పిడికెడంత దేశం… నిజానికి అదొక పెద్ద దీవి… సముద్రమట్టం ఒక మీటర్ పెరిగితే ఆనవాళ్లు కూడా కనిపించదు… దాని బతుకే టూరిజం… వచ్చీపోయే అతిథులకు సేవ చేసుకుంటేనే దాని ఎకానమీ… అవును, మాల్దీవుల గురించే చెబుతోంది… చెప్పుకోవాల్సి వస్తోంది… ఇప్పుడక్కడ భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటైంది తెలుసు కదా…
భారత బలగాలను వెనక్కి పోవాలంటూ ఉరుముతోంది… చైనా ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతోంది… చివరకు ఓ మంత్రి మొన్నటి ప్రధాని లక్షద్వీప్ యాత్రను తిట్టిపోసింది… ప్రధాని మోడీ చేసిన తప్పేమిటయ్యా అంటే… లక్షద్వీప్ టూరిజానికి మంచి డెస్టినేషన్, ఎంజాయ్ చేయండి అని తన యాత్ర ఫోటోలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడమే… అసలే ప్రధాని మోడీ, ఆపై లక్షద్వీప్‌కు ప్రమోషన్… దీంతో తమ బీచ్ టూరిజం భ్రష్టుపట్టిపోతామేమోనని మాల్దీవుల ప్రభుత్వానికి దడ పుట్టింది…
ఆ అసహనం, ఆ ద్వేషం ఓ మంత్రి ట్వీట్‌లో కనిపించగానే మన దేశ సెలబ్రిటీలు ఇక అందుకున్నారు… సచిన్ టెండూల్కర్, అక్షయకుమార్, వెంకటేశ్ ప్రసాద్ సహా అనేక మంది లక్షద్వీప్ టూరిజాన్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్లు మొదలుపెట్టారు… ఒకరిని చూసి మరొకరు… చివరకు మాల్దీవులకు కూడా అంత వెటకారం అయిపోయామా అనే ఫీలింగ్ ప్రబలింది… ట్విట్టర్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది… దాంతో ఒకేరోజు 8000 బుకింగ్స్ వాళ్ల టూరిజం సైట్ నుంచి కేన్సిలైపోయాయి… 2000 ఫ్లైట్ టికెట్స్ కేన్సిల్ అయ్యాయట…
Ads
ఎవడైనా నేను మాల్దీవులకు వెళ్లొచ్చాను, అని సగం సగం బరిబాతల ఫోటోలు గనుక సోషల్ మీడియాలో పెడితే… ఇండియాకు వచ్చాక జనం తన్నేట్టు ఉన్నారు… మాల్దీవుల మాజీ అధ్యక్షుడు కూడా ప్రస్తుత ప్రభుత్వ ధోరణిని ఖండించాడు… ఇండియాతో సత్సంబంధాలు లేకపోతే మట్టిగొట్టుకుపోతాం అని నీతివాక్యాలు ప్రబోధించాడు… అటు చైనా నవ్వుతూ ఇదంతా గమనిస్తోంది…
నిజానికి బీచ్ టూరిజానికి మన ఇండియాకు మించిన మంచి ప్లేస్ ఏముంది..? అటు లక్షద్వీప్, అటు అండమాన్ నికోబార్ దీవులు, తోడుగా అరేబియా, బంగాళాఖాతం సముద్రాల సుదీర్ఘ తీర ప్రాంతాలు… సో, ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన ‘వ్యూహాత్మకం’… సహజంగానే మన దేశంలోని మోడీ వ్యతిరేకులు తన ఫోటోలపై ట్రోలింగ్‌తో విరుచుకుపడ్డారు… అంతేకదా, వాళ్లకు దేశం, దేశప్రయోజనాలకన్నా మోడీని తిట్టడమే ప్రధానం… ఏమో, మాల్దీవుల మంత్రులు భలే తిడుతున్నారు మనల్ని అని ఆనందపడతారేమో…
సోషల్ మీడియాలో భారీగా వ్యతిరేకత, బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ మాత్రమే కాదు… మన ఎథికల్ హ్యాకర్స్ కూడా సైబర్ అటాక్ చేసి, మాల్దీవుల అధికారిక వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు… చివరకు వాళ్ల అధ్యక్షుడి వెబ్ సైట్ కూడా పనిచేయడం లేదు… మాల్దీవుల ప్రభుత్వం ధోరణి పట్ల సెలబ్రిటీల ప్రస్తుత వైఖరి ఇలాగే ఇంకొన్నాళ్లు సాగాలి… సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం ఏమిటో అర్థమైంది… కొంప మునిగిపోతున్నదనే నిజం అర్థమైంది… దాంతో వెంటనే హడావుడిగా అధికారికంగా ఆ ప్రభుత్వం లెంపలేసుకుంది…
మోడీ పేరును, ఇండియా పేరును తీసుకోకుండా… ‘‘ఫారిన్ లీడర్లను, హైప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ గా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తున్నాం… అవి మా ప్రభుత్వ అభిప్రాయాలు కావు, అవి వాళ్ల వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే… అవసరమైతే మా ప్రభుత్వం అలాంటి దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటాం’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది… అఫ్‌కోర్స్, వాళ్ల ప్రభుత్వంలోని కేరక్టర్లే ఇలాంటి భాషను, ఇలాంటి వ్యాఖ్యలకు దిగితే వాళ్ల మీద ఏం చర్య తీసుకోగలదు..?
సో, #boycottmaldives హ్యాష్‌ట్యాగ్ టెంపో ట్రెండింగ్ ఇంకొన్నాళ్లు సాగాలి… అవునూ, మాల్దీవుల్లో దిగిన బికినీలు, నిక్కర్ల ఫోటోలతో సోషల్ మీడియాలో ఆనందపడే మన తెలుగు సెలబ్రిటీ గాడిదలు ఏమైనా స్పందించాయా..? ప్చ్, ఎప్పుడూ ఆ సోయి లేదు, ఇప్పుడూ లేదు…!! తాజా అప్‌డేట్… భారత విదేశాంగ శాఖ సీరియస్ అయ్యింది, మాల్దీవుల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది… దాంతో ఆ ప్రభుత్వం మంత్రి మరియం షియూనా, మరో ఇద్దరు మంత్రులపై వేటు వేసింది…
Share this Article