Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి ధైర్యం తెచ్చుకుని… దిల్‌రాజుకు తమలపాకుతో అంటించాడు…

January 8, 2024 by M S R

అంతటి మెగాస్టారుడు చిరంజీవి కాస్త ధైర్యం అరువు తెచ్చుకున్నాడు… సినిమాలకు థియేటర్ల సర్దుబాట్ల తీరు మీద నేరుగా తన అసంతృప్తిని చెప్పలేక, ఇండస్ట్రీ బలమైన గ్రూప్ మీద పదునైన వ్యాఖ్యలు చేయలేక… (మరి సొంత బావమరిది కూడా ఉన్నాడు కదా అందులో… పైగా చిరంజీవి మెగాస్టార్ అయితే దిల్ రాజు మెగా ప్రొడ్యూసర్…) పరోక్షంగా దిల్ రాజుకు ఓ చురక వేశాను అనిపించుకున్నాడు… ఖతం… అంతే ఇక…

తెలివైన వ్యాపారి దిల్ రాజుకు అర్థం కాలేదా ఏమిటి..? ఓ నవ్వు నవ్వి ఊర్కుని ఉంటాడు… విషయం ఏమిటంటే..? ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజుకు వస్తున్నాయి కదా… నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు, రవితేజ సినిమాలతో పాటు టీనేజీ నటుడు తేజ కూడా… వీటిల్లో ఓ పెద్ద సినిమాకు పంపిణీదారు దిల్ రాజు… సహజంగానే ఎడాపెడా థియేటర్లను ఆ సినిమాకు సర్దుబాటు చేసేశాడు…

దిల్ రాజుతో గోక్కోవడం దేనికి అనుకుని రవితేజ సినిమా ఫిబ్రవరికి పారిపోయింది… మీది చిన్న సినిమా, వాయిదా వేసుకొండి అని హుకుం జారీ చేశాడు హనుమాన్ సినిమా నిర్మాతను… నో, మాకు ఆల్‌రెడీ నార్త్‌లో బిజినెస్ అయిపోయింది, తెలుగులో వాయిదా వేసుకోలేను అంటూ మొండిగా నిలబడ్డాడు సదరు నిర్మాత… నా సినిమాకే పోటీ వస్తారా అని దిల్ రాజు కోపం… మరి థియేటర్లన్నీ తన చేతిలో ఉన్నవాయె, తద్వారా ఇండస్ట్రీని శాసిస్తున్నాడాయె…

Ads

పాపం, హనుమాన్ టీం చిరంజీవిని ఆశ్రయించింది… ప్రిరిలీజ్‌కు రమ్మన్నారు… థియేటర్ల సర్దుబాటులో దిల్ రాజుకు నేరుగా ఓ మాట చెప్పలేక… ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మాత్రం పాత ముచ్చట ఒకటి ప్రస్తావించి, తమలపాకుతో సున్నితంగా మమ అనిపించేశాడు… అదేమంటే… ఇదే చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి పోటీ పడుతున్నప్పుడు శర్వానంద్‌తో తీసిన శతమానం భవతి కూడా రిలీజుకు వచ్చింది… మరి అదేమో దిల్ రాజు మద్దతు బాపతు…

వాయిదా వేసుకోమంటే… అబ్బే, ఎవరి సినిమాలో కంటెంటు బాగుంటే ప్రేక్షకుడు అదే చూస్తాడు, చిన్న- పెద్ద సినిమా అనే విభజన రేఖలు మనకెందుకు అని దిల్ రాజు అప్పట్లో ఇదే చిరంజీవికి బోలెడు నీతులు చెప్పాడు… మరి అదే సూత్రం ఇప్పుడెందుకు వర్తించదు…? నో, దిల్ రాజు చెప్పిందే శాసనం, తను మేల్ శివగామి… తను డిసైడ్ చేసిందే సూత్రం… ఈ గోల తమకెందుకు అనుకుని తమిళ ధనుష్ తన సినిమా తెలుగు రిలీజును వాయిదా వేసుకున్నాడు… శివకార్తికేయన్ వస్తున్నాడు కానీ థియేటర్లు లేవు, దిల్ రాజు ఇస్తాడా..? కంటెంటు బాగుంటే దాన్నీ చూస్తారు అనే సూత్రంతో దానికీ ఓ పది థియేటర్లు ఇవ్వొచ్చుగా… ఇవ్వడు… చివరకు అదే వాయిదా…

ఈ నేపథ్యంలో చిరంజీవి ఆ ఫంక్షన్‌లో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకి ఒక పరీక్షాకాలం. ఈ సినిమాని మొదటి రోజు కాకపోతే ఏంటి రెండో రోజు, కుదరకపోతే మూడో రోజు చూస్తారు. కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది” అన్నాడు… అది తనేమిటి చెప్పేది… ఎవరైనా చెబుతారు…

‘దిల్ రాజుకి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. ఆయనకు ఏ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు. కాబట్టి థియేటర్స్ దొరకలేదని భయపడకండి…’’ అంటూ తనను ఆశ్రయించినవాళ్లకే సర్దిచెప్పినట్టయింది…

‘అయోధ్య గుడికి నాకు ఆహ్వానం అందడం శుభపరిణామం, కుటుంబంతో సహా వెళ్తున్నాను’’ అంటాడు… తనకు ఆహ్వానం అందితే శుభం ఏమిటి..? బాలరాముడి ప్రాణప్రతిష్ఠ శుభం అవుతుంది గానీ… పైగా ఆ వేదికపైకి అందరూ చెప్పులు విడిచి వస్తే చిరంజీవి మాత్రం చెప్పులతోనే వేదిక ఎక్కాడు… అక్కడికి ప్రోగ్రామ్ హోస్ట్ సుమ చెబుతూనే ఉంది అందరికీ… దర్శకుడి పేరు కూడా సరిగ్గా చెప్పలేదు… సరే, అయోధ్య గుడికి ప్రతి టికెట్టు ధరలో 5 రూపాయలు చందా ఇస్తామని అక్కడే ప్రకటించారు… మేం అనుకున్నదానికన్నా అయిదారు రెట్లు ఎక్కువ చందాలు వచ్చాయని ఆ ట్రస్టు చెబుతూనే ఉంది, సో, టికెట్ ధరనే తగ్గించుకుంటే పోలా…! ఎక్కువమంది సినిమా చూస్తారు, దిల్ రాజుకు సరైన జవాబు చెప్పినట్టు కూడా అయ్యేది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
  • తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
  • బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
  • బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..
  • జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
  • వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions