రెండు వార్తలు… ఒకటి నయనతార ప్రధానపాత్రలో నటించిన అన్నపూరణి సినిమాపై ఎఫ్ఐఆర్ నమోదైంది… ఆ సినిమాలో శ్రీరాముడిని కించపరిచారనీ, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి కేసు పెట్టాడు… పైగా అది లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటాడు ఆయన… నయనతారతోపాటు దర్శకనిర్మాతల్ని, సినిమా ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ మీద కేసు నడిపించాలని కోరాడు…
తన వాదన ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ సినిమా క్లైమాక్స్ మాత్రం హిందూ సమాజం విమర్శలకు గురైంది… దర్శకుడి బుర్రలేనితనం కనిపించింది… అసలు నయనతార ఈ అసంబద్ధతను ఎలా అంగీకరించిందో ఆమెకే తెలియాలి… అది హీరోయిన్ సెంట్రిక్ ప్రయోగాత్మక సినిమా కాదు, తనకు పేరు తెచ్చేదీ కాదు, పోనీ, డబ్బు తెచ్చే కమర్షియల్ మాస్ మసాలా మూవీ కూడా కాదు… హేమిటో, హయ్యెస్ట్ పెయిడ్ స్టార్‌గా చెప్పబడే నయనతారకు తను పోషించే పాత్రల తత్వం కూడా తెలియదు, తెలుసుకోదు… హేమిటో…
మరో వార్త ఏమిటంటే..? అదే నయనతార మొగడు… పేరు విఘ్నేశ్ శివన్… దర్శకుడిగా పెద్దగా క్లిక్ అయినట్టు లేడు, అప్పట్లో ‘నా పేరు రౌడీ’ వంటి రెండుమూడు సినిమాలు చేసినట్టున్నాడు… ఇప్పుడు తాజాగా ఎల్ఐసీ అనే పేరుతో సినిమా చేస్తున్నాడు… ఆ పేరు బయటికి రాగానే కుమారన్ అనే మరో దర్శకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు, అది తన టైటిల్ అనీ, ఎవరు వాడుకున్నా ఊరుకునేది లేదు అన్నాడు… అసలు అది కాదు, ఇష్యూ…
Ads
ఎల్ఐసీ అంటే, జీవిత బీమా సంస్థ… వ్యవహారంలో ఎల్ఐసీ అనే పిలుస్తాం, అదే పేరు పాపులర్… ఆ పేరుతో సినిమా తీయడాన్ని సంస్థ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు… సహజం… తీసుకోవాలి కూడా… ఆ టైటిల్ మార్చకపోతే లీగల్ గా వెళ్తామని సంస్థ అధికారికంగానే స్పందించింది… నిజంగానే ఓ జాతీయ ప్రభుత్వ బీమా సంస్థ పేరును అలా వాడుకోవడం కరెక్టు కాదు… పైగా దాని అర్థం వేరే వచ్చేలా… లవ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడం బాగోలేదు…
నిజానికి ఎల్ఐసీ బాధ్యుల స్థానంలో మన సజ్జనార్ వంటి IPS అధికారి ఉంటే హెచ్చరికలు మరింత కఠినంగా, సూటిగా ఉండేవి… గుర్తుంది కదా, ర్యాపిడో అద్దె బైకుల ప్రచారానికి సిటీ ఆర్టీసీ బస్సులను అల్లు అర్జున్ ఏదో యాడ్‌లో కించపరిస్తే ‘మర్యాదగా ఉండదు’ అన్నట్టుగా హెచ్చరించాడు ఆయన… దెబ్బకు ఆ యాడ్ మాయం…
అన్నట్టు మరో ఉదాహరణ… మంచు మోహన్‌బాబు కొడుకు హీరోగా అప్పట్లో నోకియా అనే పేరు ప్రకటించారు మొదట్లో… తరువాత ఇదేతరహా వివాదం మొదలైనట్టుంది… దాంతో వెనక్కి తగ్గి నూకయ్య అనో, మరో పేరో మార్చేసినట్టు గుర్తు… సరే యథావిధిగా ఆ సినిమా నోకియా బ్రాండ్‌లాగే… ఐనా విఘ్నేశ్‌కు ఈ ఆలోచన ఎందుకు తట్టినట్టు..? ఈమధ్య తమిళ సినిమాలకు ఏవేవో అర్థం కాని పేర్లు పెడుతున్నారుగా, వాటినే తెలుగులోకి కూడా యథాతథంగా వాడుకున్నారు కదా… అలాంటి ఏదో తిక్క టైటిల్ పెట్టుకుంటే సరిపోయేది కదా…!!
Share this Article