అప్పట్లో ఏమైంది..? లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు కాలేశ్వరం ప్రాజెక్టు మీద… కాంగ్రెస్ సీరియస్‌గా విమర్శలు చేస్తే, బీజేపీ మొదట్లో విమర్శించి తరువాత సైలెంటయిపోయింది… మన కేసీయారే కదా అనుకుని…! నాన్సెన్స్, ఈ ప్రాజెక్టే 80 వేల కోట్లు, లక్ష కోట్ల అవినీతి ఏమిటి..? కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలకాయలున్నాయా అన్నట్టుగా బీఆర్ఎస్ పెద్దలు ఎదురుదాడి చేసేవాళ్లు…
2019 వరదల్లోనే బరాజులు, ప్రాజెక్టు భాగాలు దెబ్బతింటే 500 కోట్లు అడ్జస్ట్ చేశారనీ నిన్న డెక్కన్ క్రానికల్ బయటపెట్టింది కదా.., సొంత పరిశోధన కాకపోవచ్చు కానీ కాగ్ రిపోర్టును ముందే పట్టుకుని స్టోరీ రాయడం ఎక్స్‌క్లూజివే… అబ్బే, మొన్నటి బరాజ్ కుంగుబాటు భారం ప్రజలపై పడబోదు, కంట్రాక్టర్లే భరిస్తారని బీఆర్ఎస్ క్యాంపు యథేచ్చగా అబద్ధాలు చెప్పి జనం కళ్లకు గంతలు కట్టిన తీరు దీంతో బహిర్గతమైంది…
నిన్నటి స్టోరీ ఫాలోఅప్ కూడా డెక్కన్ క్రానికల్‌లో కనిపించింది… అదీ ఫస్ట్ పేజీలోనే… పదే పదే 80 వేల కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ వ్యయం అంటూ బీఆర్ఎస్ చెబుతోంది కదా… సాక్షాత్తూ కాగ్ దీని అంచనా వ్యయం లక్షన్నర కోట్లు దాటిపోనుందని వెల్లడించిందట… అంతేకాదు, ఆల్‌రెడీ 5 వేల కోట్ల మేరకు కంట్రాక్టర్లకు అధిక చెల్లింపులు జరిపినట్టు కూడా కాగ్ లెక్కలు కట్టిందట… కాగ్ పరిశీలన అధికారికం… మరి అంచనా వ్యయాల పెంపులో జరిగిన బాగోతాల మాటేమిటి..? డిజైన్లు, నిర్మాణాల్లోని నాసిరకం పద్ధతులతో జరుగుతున్న భారీ నష్టం మాటేమిటి..?
Ads
ప్రభుత్వం మారింది… సహజంగానే పాత ప్రభుత్వం బాపతు లోపాలు, నిర్వాకాలు బయటికొస్తాయి… రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా తవ్వకాల్లోకి వెళ్లి, బాధ్యులను ఫిక్స్ చేయాలంటే తన పదవీకాలం దానికే సరిపోతుంది… సరే, కాలేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ అడుగుతామని మళ్లీ చెప్పాడు, వోకే… సిట్టింగ్ జడ్జికి కూడా తన విచారణ ఈజీయే, కాగ్ ఆల్‌రెడీ కొంత చేసిపెట్టింది రెడీగా… ఐతే… బాధ్యులైన ఈఇన్‌సీ సహా పలువురు ఇంజినీర్లను ఇంకా ఎందుకు అక్కడే కొనసాగిస్తోంది… ప్రశ్నే…
పొరపాటున రేవంత్ గనుక సీబీఐ విచారణ అడిగితే మాత్రం ఇక కథ కంచికే… బాధ్యులందరూ బచాయించినట్టే… బీజేపీ- బీఆర్ఎస్ బంధం అదీ… పైగా ఇప్పుడు అధికారికంగా పొత్తు పెట్టుకునే చాన్సులు కూడా ఉన్నాయంటున్నారు… బీజేపీ క్యాంపులో గానీ, ఎన్డీయేలో గానీ చేరితే బారా ఖూన్ మాఫీ స్కీం అమల్లో ఉంది కదా… గతంలో చాలా ఉదాహరణలున్నాయి కదా…
భగీరథ స్మిత, గెజిటెడ్ మమత, సచివాలయ రవీందర్, కరెంటు ప్రభాకర్‌రావు వంటి గత ప్రభుత్వ మచ్చల్ని చాలావరకు శంకరగిరి మాన్యాలకు తరిమేశారు కదా… మరి జయేష్ రంజన్ అలాగే ఉన్నాడేమిటి..? ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ముఖ్యులు అక్కడే ఉన్నారేమిటి..? ఈ ప్రశ్నలు సహజంగానే వస్తాయి… ఒకసారి పాత్రికేయ కోణంలోకి వద్దాం… కాలేశ్వరంపై కాగ్ పరిశీలన, బయటపడుతున్న నిజాలు అనేది పాత్రికేయ కోణంలో ఇంపార్టెంటే కదా…
ఎవరు ముందుగా బయటపెట్టినా సరే, మిగతావాళ్లు ఫాలోఅప్ చేసుకోవాలి కదా… నెవ్వర్… సాక్షి కేసీయార్ మీద ఈగ వాలనివ్వదు, అది నమస్తే సాక్షి… నమస్తే సరేసరి… ఈనాడు వెన్నెముక దెబ్బతిని చాన్నాళ్లయింది… మరి ఆంధ్రజ్యోతికి ఏమైంది..? ఇంకా తెల్లవారలేదా..? బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంపిన వెలుగుకు కూడా ఈ చీకటి కనిపించడం లేదా..?
Share this Article