తెలిసిందే కదా… భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ముఖేష్ అంబానీ పట్టు ఏమిటో… బీజేపీ మద్దతుతో ఆదానీ కూడా అంబానీకి తాతలాగా ఎదుగుతున్నా సరే, వ్యాపార ఎత్తుగడల్లో ఈరోజుకూ అంబానీయే టాప్ అంటుంటారు… ప్రజానీకాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగాన్నీ ఇప్పుడు తను శాసిస్తున్నాడు…
పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీడియా, వినోదం, కమ్యూనికేషన్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు… ఏకంగా డిస్నీ హాట్‌స్టార్ మెజారిటీ వాటానే కొనుగోలు చేసి, ఆ ఫీల్డ్‌లో తనకు తానే పోటీగా మారిపోయాడు… చాలా పెద్ద డీల్… మనం గతంలో కూడా చెప్పుకున్నాం… ఇప్పుడిక సారు కన్ను పెప్సీ, కోకాకోలా మీద పడింది… అంటే సాఫ్ట్ డ్రింక్స్…
ఈరోజు దేశంలోని ప్రతి పల్లెలో, ప్రతి ఆవాసంలో తాగునీళ్లున్నాయో లేదో గానీ సాఫ్ట్ డ్రింక్ ఉన్నాయి… అదీ వాటి వ్యాప్తి తీవ్రత… పైగా ఆ దందాలో అడ్డగోలు లాభాలు… మరిక అంబానీ వదిలిపెడతాడా..? మొదలుపెట్టాడు ఆటను… చెప్పనే లేదు కదూ… తన సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ బ్రాండ్ పేరు క్యాంపాకోలా… సింపుల్‌గా క్యాంపా…
Ads
ఈ సాఫ్ట్ డ్రింక్స్‌లో ఏముంటుంది..? ఏమీ ఉండదు..? జస్ట్, చిల్ అండ్ థ్రిల్… పైగా కాలేయంపై స్ట్రెస్… ఐనా సరే పిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఈ అడిక్షన్ తప్పడం లేదు… మస్తు ప్రచారం ఉండాలి, జనంలోకి దూసుకుపోవాలి, జనానికి అలవాటు చేయాలి, ఇదే సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారం తీరు… కానీ ఇన్నాళ్లూ పెప్సీ, కోకాకోలాలకు సరైన పోటీ లేదు మార్కెట్‌లో… అంటే నేషనల్ లెవల్‌లో… అక్కడక్కడా లోకల్ డ్రింక్స్ ఉండవచ్చుగాక…
ఇప్పుడు అంబానీ దిగాడు కాబట్టి కథ వేరే ఉండొచ్చు… ముందుగా ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో దీన్ని ప్రవేశపెట్టాడు… అంటే, ఆ పోర్టుల్లోని దుకాణాల్లో ఇది తప్ప వేరే సాఫ్ట్ డ్రింక్ దొరకదు… ఇప్పుడు ఏకంగా ఇండియన్ క్రికెట్ టీంకు బ్రాండ్ అంబాసిడర్‌ను చేశాడు… అంతేకాదు, బీసీసీఐతో ఓ ఒప్పందం కుదిరింది, ఏమిటంటే..? ఇకపై అంబానీకి చెందిన ఈ క్యాంపా మన క్రికెట్‌కు అధికారిక స్పాన్సరర్…
క్రికెటర్ల జెర్సీలపైనే కాదు.., స్టేడియాల్లో, ఆటలు జరిగే అన్ని వేదికలపైనా క్యాంపా మాత్రమే పొంగుతుంది… ఇది ఒకరకంగా పెప్సీకో, కోకాకోలాకు షాక్… బీసీసీఐతో కుదిరిన డీల్ వాల్యూ ఎంతో ఇంకా స్పష్టం కావడం లేదు… ఇక రాబోయే రోజుల్లో తన సొంత రిటెయిల్ స్టోర్స్‌తోపాటు ఇతర రిటెయిల్ చానెళ్లతో ఒప్పందాలతో దూసుకుపోనుందన్నమాట… వీటికన్నా ముందు ఆ బ్రాండ్ యాడ్స్ అన్నిరకాల మీడియా వేదికల మీదా దుమ్ము దులపబోతున్నాయి…!!
Share this Article