యండమూరి వీరేంద్రనాథ్ కాపీ సాహిత్యం, నవలా వ్యాపారం మీద బోలెడు విమర్శలున్నయ్… ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, తెలుగు పాఠకులకు నచ్చేలా ఎలా మార్పులు చేసుకున్నాడనేది వదిలేస్తే… తన మొత్తం నవలల్లో కొన్ని మంచి కథలూ ఉన్నయ్… కొన్ని ప్రయోగాలూ ఉన్నయ్… నో డౌట్, తెలుగు పాఠకులను తన రచనాస్రవంతిలో ఉర్రూతలూగించినవాడు… అగ్రగణ్యుడు…
అందరూ తన రచనల్లో అంతర్ముఖం సూపర్ అంటారు గానీ… పర్ణశాల ఇంకా బెటర్ అనుకోవచ్చు… కథకు కమర్షియల్ వాసనలేవీ అద్దకుండా లైఫ్ రియాలిటీస్‌ను చిత్రీకరించుకుంటూ పోయాడు… అవును, తరువాత చెడిపోయాడేమో గానీ మొదట్లో యండమూరి మంచి సెన్సిబుల్ రైటర్… తన ప్రతీ నవలలో ఏదైనా కొత్త సబ్జెక్టును చెప్పడం తనకు అలవాటే కదా, ఇందులో రొయ్యల అంతర్జాతీయ వ్యాపారం…
అన్నింటికీ మించి మానవ సంబంధాలన్నీ అవసరాల ఆధారితమేననీ… అవసరాల ఆధారంగానే మనిషిని మనిషి దోచుకోవడం, వాడుకోవడం, ముంచేయడం గట్రా అన్నీ… అవన్నీ ఈ కథలో రిఫ్లెక్టవుతాయి… మనిషికి ఎంత బుర్ర ఉన్నా, ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా, కాస్త అదృష్టం కూడా తోడుండాలి, ఒక్క చిన్న తప్పు (మన ప్రమేయం లేనిదైనా సరే) జీవితాన్ని, కాదు, జీవితాల్ని ఎలా కాల్చేస్తుందో, ఎలా కూల్చేస్తుందో చెబుతుంది ఈ కథ…
Ads
దీని ఆధారంగా ఓ టీవీ సీరియల్ కూడా నిర్మితమైనట్టు గుర్తు (Subject to Correction)… కానీ నవలలోని ఇంటెన్సిటీని కాస్తయినా ప్రజెంట్ చేయలేకపోయారు అందులో… Subbarao Bharthepudi ఫేస్‌బుక్‌లో ఈ నవల రివ్యూ పోస్ట్ చేస్తే, Yandamoori Veerendranath i love it. But a failure serial… అంటూ షేర్ చేసుకున్నాడు… ఒకసారి ఆ రివ్యూ చదవండి… బాగుంది…
పర్ణశాల… కొన్ని బుక్స్ ఆహ్లాదాన్ని ఇస్తాయి . . . కొన్ని బుక్స్ ఓ మధురమైన భావనను మిగులుస్తాయి . . . కొన్ని మాత్రం జీవిత కాలం నిద్రలో కూడా వదలకుండా వెంటాడుతాయి . . . కమల్ “మహానది” సినిమా . . . యండమూరి గారి “పర్ణశాల” నవల నాకు ఆ కోవలోనివి . . .
ఇక చైతన్య భార్య . . . చదివిన చాలా సంవత్సరాలు ఆ పాత్రంటే అసహ్య భావన ఉండేది . .. సమాజంలో జీవిత అనుభవాలు ఎన్నో చూసేకొద్ది క్రమేపీ అసహ్యం పోయి ఆ పాత్రంటే జాలి మిగిలిపోయింది . .. మరేం చేస్తుంది? ఓ అరిస్ట్రోక్రాట్ ఫ్యామిలీలో పుట్టి మరో అరిస్ట్రోక్రాట్ ఫ్యామిలీలో మెట్టిన ఆమె భర్త చేసిన ఓ పొరపాటుకు ఓవర్ నైట్‌లో వీధి పాలైంది . . . వైద్యం చేయించలేని పరిస్థితికి పండంటి కన్నబిడ్డను పోగొట్టుకుంది . . . భిక్షాటనతో సహా అన్నీ చేసింది . . . అలాంటి పరిస్థితుల్లో భర్త డ్రైవర్ ఉద్యోగం పేరుతో కొద్దిపాటి కూడు, నీడ దొరికాయి . . . భర్త యొక్క ఆత్మ గౌరవానికి మళ్ళీ అది కూడా పోయే పరిస్థితికి భయపడి భర్త పనిచేసే ఓనర్‌కి లొంగి పోయి శాశ్వతంగా అతని స్వంతమై పోయింది . . .
తెలుగు వాళ్ళ మనస్తత్వం ట్రాజెడీ ఎండింగ్ అసలు తట్టుకోలేరు… మరో చరిత్ర దేవదాసు లాంటి అతి కొన్ని ఎక్సెప్షనల్… నా మటుకు నాకే ఈ నవల బాగా నచ్చింది. కానీ ఈ ఇద్దరి పాత్రలు గుర్తుకు రాగానే మనసంతా చేదు అయిపోతుంది. చెల్లెలు పాత్ర ఏం కోల్పోకుండా తిరిగి ప్రవేశించక పోతుందా అని ఆశ పడ్డాను. మీకూ అనిపించి ఉంటుంది కానీ వాస్తవికతకే కట్టు పడ్డారు రచయిత…
Share this Article