పోట్లూరి పార్థసారథి…. భారత్ మాతా కి జై! మేరా భారత్ మహాన్! ఈ నినాదాలు చేసింది భారత్ లో కాదు! దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకలో!
జనవరి 4 గురువారం, 2024.
సాయంత్రం భారత్ నావీకి ఒక అత్యవసర సందేశం వచ్చింది.
దాని సారాంశం ఏమిటంటే దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న బల్క్ కారియర్ (రవాణా నౌక)ని ఎవరో హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సహాయం చేయండి అని!
Ads
ఎమర్జెన్సీ హెల్ప్ కోసం మెసేజ్ చేసింది లైబీరియా (Liberia ) జెండాతో ప్రయాణిస్తున్న రవాణా నౌక MV Lila Norfolk (ఎమ్ వి లిల నార్ఫోక్).
మెసేజ్ అందుకున్నది యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్ (UK Maritime Trade Oparetions Portal).
అరేబియా సముద్రం, హిందు మహా సముద్రాలలో భారత నేవీకి చెందిన కోస్ట్ గార్డ్ పహారా కాస్తుంది కాబట్టి వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ భారత్ నావీకి సమాచారం ఇచ్చింది.
*********
1. లైబీరియాకి చెందిన రవాణా నౌక సోమాలియా తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు సోమాలియాకి చెందిన పైరేట్స్ (సముద్రపు దొంగలు) MV Lila ని అడ్డగించి హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నౌక కెప్టెన్ ఎమర్జెన్సీ మెసేజ్ పంపించాడు.
2.UK MARITIME TRADE OPARATIONS PORTAL భారత నేవీకి సమాచారం ఇవ్వగానే వెంటనే భారత్ ప్రతిస్పందించింది.
3.MV లిలా నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లలో 15 మంది భారత పౌరులు ఉన్నారు కెప్టెన్ తో సహా!
4.MV లిలా నౌక మంగుళూరు పోర్టుకి వస్తున్నది.
5. ముందు భారత్ నౌకా దళానికి చెందిన P- 81 పేసొడియన్ విమానాన్ని పంపించింది.
6.P -81 Pesodian విమానం ప్రత్యేకించి సముద్రం మీద జరిగే యుద్ధం కోసం రూపొందించబడింది.
7.సముద్రం మీద ఎగురుతూ నిఘా పెట్టగలదు. అవసరం అయితే హై రిజల్యూషన్ తో ఫోటో వీడియో తీసి లొకేషన్ వివరాలు పంపగలదు. అయితే P 81 Pesodian ప్రధానంగా సముద్ర అడుగు భాగంలో వెళ్ళే జలాంతర్గాములని కనిపెట్టి టార్పెడోలని ప్రయోగించి మట్టుపెడుతుంది. సబ్మెరైన్ కిల్లర్!
8.ముందు P 81వెళ్లి MV లిలా ఎక్కడ ఉందో లొకేషన్ వివరాలు పంపించింది. అదే సమయంలో వాణిజ్య నౌక మీద ఎగురుతూ వీడియో తీసి పంపించింది.
9. P81 రాకని పసిగట్టిన నౌక కెప్టెన్ ఇంజిన్లు ఆపేసి లంగర్ దించి నౌకని ఆపేసాడు.
10.మొత్తం 21 మంది సిబ్బంది సిటడెల్ (Citadel) లో దాక్కున్నారు.
(ఇదీ సిటాడెల్)
11. Citadel అంటే ఏమిటి? పైరెట్స్ లేదా సముద్రపు దొంగలు రవాణా నౌకని హైజాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సిబ్బంది సిటాడెల్ లో దాక్కుంటారు. సిటడెల్ అంటే 12mm ఉక్కుతో నిర్మించిన గది. AK -47, RPG లతో దాడి చేసినా లోపల ఉన్నవాళ్ళకి ఎలాంటి హాని జరగదు.
12. సిటాడెల్ లో మినీ కంట్రోల్ సూట్ ఉంటుంది. అంటే సిటాడెల్ లోకి వెళ్ళి లాక్ చేసుకొని అక్కడి నుండి నౌక ఇంజిన్లని ఆపేయవచ్చు. అలాగే అక్కడి నుండి బయట ప్రపంచంతో కమ్యునికేషన్ సంబంధాలు చేయవచ్చు.
13. అలాగే సిటాడెల్ లో CCTV మానిటర్స్ లో నౌక లోపల బయట ఉన్న కెమెరాల లైవ్ కవరేజ్ చూడవచ్చు
14.సిటాడెల్ లో 10 రోజులకీ సరిపడా ఆహారం, మంచినీళ్ళు ఉంటాయి. రెండు వాష్ రూమ్లు ఉంటాయి. అత్యవసర మందులు ఉంటాయి.
15. మొత్తం 6 గురు సోమాలియా పైరెట్స్ చిన్న స్పీడ్ బోట్ లో వచ్చి MV లిలా నౌక మీదకి ఎక్కారు. అందరి దగ్గర Ak 47 లు, RPG లాంచర్లు ఉన్నాయి.
16. P81పేసొడియన్ ని చూడగానే వాళ్లకి అర్ధమయింది అది భారత్ నావికా దళానికి చెందినది అని.
17. సోమాలియా దొంగలకు నావికా దళ ఆయుధాల గురుంచి బాగా తెలుసు.
18. సోమాలియా పైరెట్స్ కి భారత్ తో చేదు అనుభవాలు ఉండడం వలన నౌకను నడుపుతున్నది భారత్ పౌరులు అని తెలుసుకొని తమ హైజాక్ ప్రయత్నం విరమించుకుని ఎలాంటి దాడి చేయకుండానే వెళ్ళిపోయారు.
19. సోమాలియా దొంగలకు భారత్ అంటే భయం. గతంలో చాలా మంది దొంగలని పట్టుకొని జైల్లో పెట్టింది భారత నావికా దళం. సాధారణంగా భారత్ కి చెందిన నౌకల మీద దాడి చేయరు సోమాలియా పైరెట్లు. ఎందుకంటే అరేబియా, హిందూ మహాసముద్రాలలో భారత్ యుద్ధ నౌకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా తక్కవ సమయంలోనే హైజాక్ ప్రదేశానికి చేరుకుంటాయి.
20.అదే ఇతర దేశాల నౌకలని హైజాక్ చేసి డబ్బులు తీసుకొని వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి.
*******
హైలైట్స్…
P 81 పేసొడియన్ బోయింగ్ విమానం కాబట్టి గంటకి 600 km వేగం కంటే తక్కువ స్పీడ్ తో వెళ్ళలేదు. కాబట్టి నిఘా డ్రోన్ అయిన MQ9B ని కూడా పంపించారు. P8 వెనక్కి వచ్చేసింది MQ9B రాగానే. శుక్రవారం మధ్యాహ్నానికి INS చెన్నై ఫ్రిగెట్ అక్కడికి చేరుకుంది. INS చెన్నై KOLKATTA క్లాస్ ఫ్రిగెట్. దాని మీద హెలిపాడ్ ఉంది. MV లీలా దగ్గరికి చేరుకోగానే హెలికాప్టర్ లో అప్పటికే సిద్ధంగా ఉన్న నావీకి చెందిన మర్కొస్ (MARCOS) కమాండోలు నేరుగా MV లిలా మీద లాండ్ అయ్యారు…
మొత్తం నౌకను పరిశీలించిన తర్వాత హైజాకర్లు ఎవరూ లేరని నిర్ధారించుకుని, అప్పుడు సిటాడెల్ దగ్గరికి వచ్చి, హిందీలో మేము ఇండియన్ నావీ మర్కోస్ కమాండోలము తలుపు తీయమని అడగగానే లోపల ఉన్న సిబ్బంది సిటాడెల్ నుండి బయటికి వచ్చారు. మార్కొస్ కమాండోస్ ని చూడగానే సిబ్బంది భారత్ మాతాకీ జై! మేరా భారత్ మహాన్! అంటూ ఆనందంగా నినాదాలు చేశారు. తరువాత నౌక ఇంజిన్లని ఆన్ చేసి మంగుళూరు పోర్టుకి చేరే వరకు INS చెన్నై ఫ్రిగెట్ వెన్నంటి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మార్కోస్ కమాండోలతో పాటు, MQ9B నిఘా డ్రోన్ పైలట్లకి రియల్ టైమ్ అనుభవం వచ్చింది…
Share this Article